
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు జనవరి 2వ తేదీతో ముగిసిన వారాంతానికి 319.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు వారంతో (డిసెంబర్ 26) పోల్చితే 471 మిలియన్ డాలర్లు తగ్గాయి. అమెరికా డాలర్ల రూపంలో ఉండే ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ 863 మిలియన్ డాలర్లు తగ్గి, 294.53 బిలియన్ డాలర్లుగా ఉంది. మారక విలువల్లో తగ్గుదల దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 1.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వల విలువ డిసెంబర్ 26తో పోల్చితే 18.98 బిలియన్ డాలర్ల నుంచి 19.37 బిలియన్ డాలర్లకు ఎగసింది.