million dollars
-
పెంపుడు జంతువులకు ఏకంగా రూ 23 కోట్ల ఆస్తిని రాసిన మహిళ!
దిగజారిపోతున్న కుటుంబ విలువలకు అద్దం పెట్టే గాథ ఆ మహిళ కథ!. కడుపున పుట్టిన వాళ్లను కష్టపడి ప్రయోజకులుగా చేస్తే..తీరా వాళ్లు వృద్ధాప్యంలో కన్నెత్తి చూడకపోతే ఆ పెద్దాళ్ల పరిస్థితి కడు దయనీయంగా ఉంటుంది. తమను అప్యాయంగా పిలిచే పిలుపు కానరాక, తామెందుకు బతుకుతున్నాం అనిపించేలా ప్రతి క్షణం ఓ యుగంలా వారిని వేధిస్తున్నప్పుడూ కోపంతో వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఇలానే ఉంటాయి. అలానే ఈ వృద్ధ మహిళ కూడా తట్టుకోలేని ఆవేదనలో తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అందుకు అక్కడ చట్టాలు ఒప్పుకోవు. దీంతో ఆ మహిళ.. అసలేం జరిగిందంటే..చైనాలోని షాంఘైకి చెందిన లియు తన పిల్లలకు ఊహించని రీతీలో గట్టి షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఉన్న రూ. 23 కోట్ల ఆస్తిని పెంపుడు జంతువులక పేర రాసేసింది. ఇంతకు మునుపు తన ముగ్గురు పిల్లలకు పంచి ఇస్తున్నట్లుగా వీలునామా రాసి ఉన్నా..దాన్ని సడెన్‌గా మార్చేసింది. ఒక రోజు అనారోగ్యానికి గురయ్యింది లియు. అయితే ఆమెను చూసేందుకు గానీ, ఎలా ఉన్నావు అని ఫోన్లో పలకరించడం గానీ చేయలేదు ఆమె పిల్లలు. దీంతో తన గురించి పట్టించుకోనివాళ్లకు తన ఆస్తితో పని ఏమిట? అన్న కోపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు చైనా చట్టాలు ఒప్పుకోవు. ఎందుకంటే చైనాలోని జంతువులకు నేరుగా విరాళాలు ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవు, అందుకు కొన్ని చట్టపరిమితులు ఉన్నాయి. ఈ మేరకు బీజింగ్‌లోని విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారి చెన్ కై ముందుకొచ్చి ఆ మహిళ సమస్యను పరిష్కరించేలా పలు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన వెటర్నీ క్లినిక్‌లోని పెంపుడు జంతువులను సరిగ్గా చూసుకోవడం కోసం ముందుగా తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిని నియమించమని ఆ వృద్ధ మహిళకు సూచించారు. అంతేగాదు డబ్బు మొత్తం ఇలా వెటర్నరీ క్లినిక్ చేతిలో పెట్టడం వల్ల జరిగే నష్టాలు ఎదురయ్యే సమస్యలు గురించి కూడా అధికారులు ఆమెకు క్లియర్‌గా వివరించారు. అలాగే భవిష్యత్తులో పిల్లలకు మనుసు మార్చుకుని వస్తే గనుక నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచించి సరైన విధంగా నిర్ణయం తీసుకుందామని ఆమెకు సలహ ఇచ్చారు అధికారులు. ఐతే చైనాలో ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో టేనస్సీలోని ఒక సంపన్న వ్యాపారవేత్త తన పెంపుడు పిల్లులు కోలీ, లులుకు కూడా ఇలానే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని రాసివ్వడం జరిగింది. (చదవండి: నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?) -
హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం
చెక్ రిపబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ తన ఫాలోయర్లకోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్ నుంచి జార విడవడం వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే తొలిసారి డాలర్ల వర్షం అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్‌ను అబ్బుర పరిచాడు. దీంతో ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు ఫ్యాన్స్. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కజ్మా అనే మారుపేరుతో బార్టోస్జెక్ సోషల్‌మీడియాలో బాగా పాపులర్. తను ప్రకటించిన ఒక పోటీ ప్రకారం కజ్మా తన చిత్రం 'వన్‌మాన్‌షో: ది మూవీ'లో పొందుపరిచిన కోడ్‌ను ఛేదించాలి. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీంతో మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రోగ్రాం కింద సైన్ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్మనినీ గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించాడు. దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును ఎక్కడ పడేస్తాడనే ఎన్క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈమెయిల్ పంపాడు. అన్నట్టుగా సేమ్ ప్లేస్‌కి వెళ్లి నిర్ణీత సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. హెలికాప్టర్ నుంచి డాలర్ల వర్షం కురపించాడు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు ''ప్రపంచంలో తొలిసారి నిజమైన డబ్బు వర్షం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. గాయాలు కాలేదు కూడా అంటూ తన పోస్ట్‌లో వెల్లడించాడు. View this post on Instagram A post shared by Kazma Kazmitch (@kazma_kazmitch) -
ఈ కుక్క సంపాదన రూ.8 కోట్లకుపైనే! ఫాలోవర్లు కోట్లలోనే..
ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటుంటారు.. కానీ టక్కర్ బడ్జిన్ అనే ఈ కుక్కకు సంవత్సరమంతా దానిదే.. ఎందుకంటే సంవత్సరంలో ఇది సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిచిగాన్‌లో టక్కర్ బడ్జిన్ అనే కుక్క మిలియన్ డాలర్ల సంపాదనతో సోషల్ మీడియా టాప్ డాగ్‌గా ఉద్భవించింది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, టిక్‌టాక్, యూట్యూబ్.. ఒక్కటేమిటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ కుక్కకు పేజీలు ఉన్నాయి. మిలియన్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ప్రింటెడ్ పెట్ మెమోరీస్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. టక్కర్ అనే ఈ ఐదేళ్ల కుక్క.. రెండు ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టింది. తన సోషల్ మీడియా పేజీల్లో ప్రకటనలు, పెయిడ్ పోస్ట్‌లు, ఇతర మార్గాల ద్వారా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.8 కోట్లకుపైనే) సంపాదించగలిగింది. View this post on Instagram A post shared by TUCKER | The Golden Retriever (@tuckerbudzyn) ఈ కుక్కను పెంచుతున్న కోర్ట్నీ బడ్జిన్ అది సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తోందో వివరించారు. యూట్యూబ్ పెయిడ్ పోస్ట్‌కు గానూ 30 నిమిషాల ప్రీ-రోల్ కోసం 40,000 నుంచి 60,000 డాలర్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 3 నుంచి 8 కథనాలకు దాదాపు 20,000 డాలర్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుక్కను చూసుకునేందుకు కోర్ట్నీ, ఆమె భర్త మైక్ ఇద్దరూ వారి ఉద్యోగాలను విడిచిపెట్టారు. టక్కర్, దాని పిల్ల టాడ్‌ను చూసుకునేందుకే అంకితమయ్యారు. 2018లో కేవలం ఎనిమిది వారాల వయసున్న ఆ కుక్కను ఇంటికి తీసుకువచ్చిన రోజున కోర్ట్నీ దాని కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించడంతో టక్కర్ స్టార్డమ్ మొదలైంది. తర్వాతి నెలలో టక్కర్ మొదటి వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం టక్కర్‌కు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో 11.1 మిలియన్లు, యూట్యూబ్‌లో 5.1 మిలియన్లు, ఫేస్బుక్లో 4.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లు, ట్విటర్లో 62,400 మంది ఫాలోవర్లను ఈ కుక్క సంపాదించుకుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఇన్క్యాష్మెంట్పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!
17 మిలియన్లను స్వాహా చేసినందుకు గాను ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో పనిచేసిన మాజీ భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్షపడింది. అలాగే 19 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రూ.138 కోట్ల కుంబకోణం కేసులో ఈ శిక్షను ఖరారు చేసినట్లు యూనిటైడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీస్ (United States’ attorney's office) కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. భారత్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్ అమెరికాలోని యాపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్ విభాగంలో 2008 నుంచి 2018 వరకు విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతనిపై మార్చి 2022లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సైతం ట్యాక్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ధీరేంద్ర ప్రసాద్ (Dhirendra Prasad) ఏం చేశాడు వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రసాద్ యాపిల్ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ఉంది. ఈ సమయంలో ధీరేంద్ర ప్రసాద్ తన దుర్బుద్ధిని చూపించారు. తన పదవిని అడ్డం పెట్టుకొని సంస్థకు కావాల్సిన విడిభాగాలను ఆర్డర్ పెట్టడం.. కంపెనీకి తెలియకుండా వాటిని ఇతర సంస్థలకు అమ్మడం, ఇక అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్నందుకు గాను సదరు సంస్థలకు చెల్లింపులు, ప్రొడక్ట్‌లను దొంగిలించడం, తప్పుడు ఇన్వాయిస్లను తయారు చేయడం, ఇందుకు గాను రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నినట్లు, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నమ్మకంగా పనిచేస్తారనుకుంటే ఎంతో నమ్మకంతో పనిచేస్తారని పేరు సంపాదించిన ప్రసాద్‌పై యాపిల్ యాజమాన్యం లెక్కలు, ప్రొడక్ట్‌లు ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేది. కంపెనీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్నివమ్ము చేశారు. చేసిన పాపం బయటపడింది. యాపిల్ కంపెనీలో ప్రసాద్ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాపిల్ కోసం విడి భాగాలు కొనుగోలు చేసే అంశంలో సుమారు 17 మిలియన్లకు పైగా మోసం చేశారు. పన్నుకూడా చెల్లించలేదు. కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు వివరాల మేరకు.. యాపిల్‌లో తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. సంస్థలో ప్రొడక్ట్‌ల కొనుగోళ్ల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండడం, దాన్ని దుర్వినియోగం చేస్తూ జీతం, బోనస్‌లను యాపిల్ నుంచి అక్రమంగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. అంతేకాదు సంస్థలో నేరాలకు పాల్పడే ఉద్యోగుల్ని యాపిల్ సంస్థ ఎలా కనిపెడుతుందో తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. తన అధికారాన్ని ఉపయోగించి వాటి నుంచి బయటపడ్డారు. 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఆయా నేరాలకు పాల్పడినందుకు ప్రసాద్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నేరం ఒప్పుకున్న నిందితుడు..మోసం చేసి సంపాదించిన డబ్బుల్ని, ఆస్తుల్ని తిరిగి చెల్లించాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో 3 ఏళ్ల పాటు నిశితంగా గమనించిన మరో సారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
అతనికి జాబ్ లేదు! కోట్లు సంపాదిస్తున్నాడిలా..
సోషల్ మీడియా ఈ రోజు ప్రపంచాన్ని ఏలేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటితో ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. ఆలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్'. ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్‌గా ప్రసిద్ధి చెందిన 'జిమ్మీ డొనాల్డ్సన్' యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి. ప్రస్తుతం తన ఛానెల్‌కి 139 మిలియన్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్ కలిగి ఉన్నారు. ఎంతో ఆసక్తికరమైన కంటెంట్స్ సృష్టించడంలో ఆరితేరిన మిస్టర్ బీస్ట్ అద్భుతమైన విన్యాసాలు, ఛాలెంజ్‌లు, విరాళాలను అందించడం ద్వారా బాగా పేమస్ అయ్యాడు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న యువకులలో డొనాల్డ్సన్ కూడా ఒకరు కావడం గమనార్హం. 2021లో అతడు ఏకంగా 54 మిలియన్ డాలర్లను సంపాదించినట్లు తెలిసింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 400 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!) 1998 మే 1న నార్త్ కరోలినాలోని గ్రీన్విల్లేలో జన్మించిన జిమ్మీ డొనాల్డ్సన్ 2012లో మిస్టర్ బీస్ట్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. గేమింగ్, కామెంటరీ వంటి వాటితో మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను ఎంతగానో ఆకట్టుకునే స్టంట్స్ మొదలైనవి ప్రారభించి ఎక్కువమందిని ఆకర్శించాడు. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ చాలా వేగంగా లెక్కకు మించిన సబ్స్క్రైబర్స్ పొందగలిగింది. అయితే ఇతని ఛానెల్ కోసం కొన్ని సంస్థలు బిలియన్ డాలర్లను ఆఫర్ చేసినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికి కూడా అతడు సొంతంగానే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. (ఇదీ చదవండి: మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!) బిలియన్ డాలర్ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మిస్టర్ బెస్ట్ అత్యంత విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంపాదిస్తున్న యూట్యూబర్స్ జాబితాలో డొనాల్డ్సన్ 40వ స్థానం పొందాడు. -
క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది. క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్‌స్కైని గత ఏడాది డిసెంబర్లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది
అది పోష్ ఏరియా. ఎటు చూసినా విలాసవంతమైన బంగ్లాలు.. ఖరీదైన కార్లు. కానీ, ఆ మధ్యలో దిష్టి చుక్కలాంటి ఓ చిన్న కొంప కనిపిస్తుంది. పైగా ఆ ఇంట్లో ఉండేవాళ్లకు దరిద్రం చుట్టుకుంటుందని, నష్టాలు-జబ్బులు జీవితాంతం వెంటాడుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఆ ఇంటి వైపు భయపడిపోయేవాళ్లు ఇంతకాలం. అలాంటి కొంప ఇప్పుడు ఏకంగా మన కరెన్సీలో రూ.14 కోట్లకుపైగా అమ్ముడుపోయి.. స్థానికులను నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని(కాలిఫోర్నియా) నోయి వ్యాలీలో ఉంది రెండు వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలోని ఈ పాడుబడిన కొంప. దీనికి ఓనర్ ఎవరనేదానిపై క్లారిటీ లేదు. పైకి డొక్కు బిల్డింగ్‌లా.. లోపల మంచి ఫర్నీషింగ్, మోడ్రన్ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది. 122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో.. రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి కొందరు నివసించేవాళ్లట. బెడ్రూం లేకుండా ఒక బాత్రూం(అందులో బాత్‌టబ్), కిచెన్, చిన్న లివింగ్ రూం మాత్రమే ఉన్నాయి ఆ ఇంట్లో. మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఇంటిలో ఎవరైనా నివసిస్తే.. వాళ్లను దురదృష్టం వెంటాడేదని నమ్ముతుంటారు. అలా చాలాకాలం పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. అంతెందుకు ఆ చుట్టుపక్కల కాస్ట్లీ ఇళ్లులు వెలిసినప్పటికీ.. ఆ ఇంటిని కూల్చే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారట. చివరికి ఓ పెద్దాయన ధైర్యం చేసి చాలాకాలం పాటు ఈ ఇంట్లో నివసించాడు. ఆయన నుంచి కన్జర్వేటర్‌షిప్ కింద టాడ్ వెలీ అనే వ్యక్తి ఈ ఇల్లును చేజిక్కించుకుని.. వేలం పాట నిర్వహించాడు. కంపాస్ అనే బ్రోకరేజ్ వెబ్సైట్ నుంచి జనవరి 7వ తేదీన.. ఆరు లక్షల డాలర్లపై చిలుకు విలువతో వేలం మొదలైంది. పాత కాలం నాటి ఇల్లు కావడం, పైగా దాని వెనుక ‘దరిద్రపుగొట్టు’ ప్రచారం ఈ పాత ఇంటికి మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆ పాత ఇంటిని ఏకంగా 1.97 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు పైనే) అమ్ముడుపోయింది. ‘పార్కింగ్ ప్లేస్ అంత లేదు.. అంత పెట్టి ఎవరు దక్కించుకున్నారు?’ అనే అనుమానాలు చాలా మందికి కలిగాయి. కానీ, గోప్యత కారణాలతో వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పడం లేదు టాడ్ వెలీ. అన్నట్లు ఆ ఇంటిని కూలగొట్టే ఉద్దేశంగానీ, రిన్నొవేషన్ చేసే ఉద్దేశంగానీ వేలంలో దక్కించుకున్న వ్యక్తికి లేవట!. మరి ఏం చేస్తాడో?. చదవండి: 5జీతో విమానాలకు ప్రమాదం పొంచి ఉందా? -
అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!
UK Court Orders Ruler Of Dubai: ఇంతవరకు మనం పెద్ద పెద్ద స్టార్లు, సినీ తారలు, లేదా సెలబ్రేటీల జంటలు విడిపోతే పెద్ద మొత్తంలో భరణంగా ఇవ్వడం వంటివి చూశాం. అంతేకాదు మహా అయితే 10 కోట్లు లేదా 100 కోట్లు వరకు భరణం ఇవ్వడం చూసి ఉండవచ్చుగానీ ఏకంగా ఐదువేల కోట్లను భరణంగా ఇవ్వడం విని ఉండం. (చదవండి: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!) అసలు విషయంలోకెళ్లితే...యూకేలోని లండన్ హైకోర్టు దుబాయ్ పాలకుడు, ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ (72)ను తన మాజీ భార్య యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు (728 మిలియన్ డాలర్లు) రూ. 5500 కోట్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. అయితే ప్రిన్సెస్ హయా బింట్ జర్మనీ దేశాన్ని ఆశ్రయం కోరింది. ఆపై దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్ తన పిల్లల్లను ఇవ్వమంటూ జర్మనీకి చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో యూకే కోర్టు మాజీ భార్య భద్రతకు, వారి ఇద్దరూ పిల్లలు అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్(14), షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్(9)ల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందేగా దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది. అంతేకాదు రూ. 2,516 కోట్లు ముందుస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తదుపరి మొత్తాన్ని మూడు నెలల్లో సెటల్మెంట్ చేయాల్సిందిగా ఆదేశించింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలి అని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు అయితే అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా II సోదరి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) -
చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్(డిఫై) సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు. చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే బాడ్జర్ డీఏఓ యాప్‌ను హ్యాక్ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది. Here is the current whereabouts as well as the total loss: $120.3M (with ~2.1k BTC + 151 ETH) @BadgerDAO pic.twitter.com/fJ4hJcMWTq — PeckShield Inc. (@peckshield) December 2, 2021 పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. Badger has received reports of unauthorized withdrawals of user funds. As Badger engineers investigate this, all smart contracts have been paused to prevent further withdrawals. Our investigation is ongoing and we will release further information as soon as possible. — ₿adgerDAO 🦡 (@BadgerDAO) December 2, 2021 బాడ్జర్ డీఏఓ బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్ కాయిన్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు. (చదవండి: పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..) -
చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. పన్నెండు వేల కోట్లు హాంఫట్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి భారీ షాక్ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 12 వేల కోట్లు పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలినెట్‌వర్క్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. తిరిగి ఇచ్చేయండి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్ అయిన పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. భిన్నాభిప్రాయాలు పాలినెట్‌వర్క్ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్ చైయిన్ టెక్నాలజీని క్రాక్ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర్ల మేథస్సు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు. Hope you will transfer assets to addresses below: ETH: 0x71Fb9dB587F6d47Ac8192Cd76110E05B8fd2142f BSC: 0xEEBb0c4a5017bEd8079B88F35528eF2c722b31fc Polygon: 0xA4b291Ed1220310d3120f515B5B7AccaecD66F17 pic.twitter.com/mKlBQU4a1B — Poly Network (@PolyNetwork2) August 11, 2021 -
వైరల్: ‘‘ది సాకురా’’ పింక్ డైమండ్ ఖరీదు తెలుసా?
హాంగ్‌కాంగ్: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది. జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం "ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్" 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా. కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.."ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం." అని ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) -
9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన
న్యూయార్క్ : తొమ్మిదేళ్ల వయసులో మనందరం ఏం చేస్తాం.. మహా అయితే స్కూల్‌కి వెళ్లడం.. ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకోవడం చేస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అసలు విషయంలోకి వెళితే.. ర్యాన్ కాజీ ..' ర్యాన్స్ వరల్డ్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూనే వాటిపై సమీక్ష నిర్వహిస్తాడు. అలా అతని చానల్‌కు 27 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 2018లో అతడు యూట్యూబ్ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా.. 2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది. (చదవండి : ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే) ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించిన ర్యాన్ కాజీ వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్‌గా నిలిచాడు . ఇటీవలే మిలియన్ డాలర్ల విలువైన నికెలోడియన్‌లో ఒక టీవీ సిరీస్ కోసం ర్యాన్‌కాజీ ఒక ఒప్పందంపై సంతకం చేయడం విశేషం. అంతేకాదు.. ర్యాన్ కాజీకి, అతడి తల్లిదండ్రులకు కలిపి మొత్తం తొమ్మిది యూట్యూబ్ చానల్స్ ఉండగా.. అన్నింటికీ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ర్యాన్ కాజీ అమెరికాలో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ బుడ్డోడు నిజంగా జీనియస్ అంటూ అతనిపై ప్రశంసలు వస్తున్నాయి. -
సాఫ్ట్వేర్ సేవల ఈ షేరు యమస్పీడ్
ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కొద్ది రోజులుగా ఇన్వెస్టర్ల ఫేవరెట్ షేరుగా నిలుస్తోంది. ఈ బాటలో అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో వరుసగా రెండో రోజు శుక్రవారం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 275 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కొనసాగడంతో గత నెల రోజుల్లోనే ఈ కౌంటర్ 105 శాతం ర్యాలీ చేసింది. అంతేకాకుండా గత మూడు నెలల కాలాన్ని పరిగణిస్తే.. 277 శాతం దూసుకెళ్లింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 13 శాతమే లాభపడటం గమనార్హం! పలు అంశాలు పలు సానుకూల అంశాల నేపథ్యంలో క్లౌడ్ ఆధారిత ఐటీ సేవలందించే రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూన్ 10న ప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియా రామ్‌కో సిస్టమ్స్‌లో షేరుకి రూ. 87.8 ధరలో దాదాపు 3.4 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. 1.1 శాతం వాటా కొనుగోలుకి రూ. 3 కోట్లు వెచ్చించారు. ఇదే విధంగా ఎన్ఎస్ఈ బల్క్ డేటా ప్రకారం గత వారం రామ్‌కో సిస్టమ్స్‌లో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్.. షేరుకి రూ. 240 ధరలో 1.57 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఈ బాటలో ఇటీవల విభిన్న పథకాల ద్వారా 2.25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో కంపెనీలో హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటా తాజాగా 8.65 శాతానికి ఎగసింది. భారీ డీల్.. మలేసియాకు చెందిన డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన యుటిలిటీస్, ఇన్ఫ్రా గ్రూప్‌తో మల్టీ మిలియన్ డాలర్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ గత నెల 25న వెల్లడించింది. తద్వారా గ్రూప్ కంపెనీలకు పోర్టులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్ నేపథ్యంలో రామ్‌కో ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ మలేసియాలోని 50 శాతం పోర్టుల నిర్వహణలో ఐటీ సేవలు అందించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
మిలియన్ డాలర్ల బ్యూటీ
తమిళసినిమా: మిలియన్ డాలర్ల బ్యూటీగా వాసికెక్కడం అంత సులభం కాదు. మిలియన్ డాలర్ అంటే విదేశాల్లో గొప్ప విషయమే. అంటే 10 లక్షల డాలర్లు అన్నమాట. అమెరికాలో విడుదలయ్యే తమిళం, తెలుగు చిత్రాలు ఒక మిలియన్ డాలర్లు వసూలు చేస్తే గొప్ప విషయమే అవుతుంది. అలా మిలియన్ డాలర్లు వసూలు చేసిన అధిక చిత్రాలు ఈ ముద్దుగుమ్మ ఖాతాలోనే చేరాయట. అందువల్ల సమంత నమోదు మిలియన్ డాలర్ల బ్యూటీగా వాసి కెక్కారు. సమంత నటించిన తమిళ చిత్రం తెరి, 24, మెర్శల్ చిత్రాలు అమెరికాలో 10 లక్షల డాలర్లు వసూలు చేశాయి. ఇటీవలే ప్రేమికుడు నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన సమంత నటిగా కొనసాగడం, అదీ హీరోయిన్గా బిజీ గా ఉండడం సహ నటీమణులు ఈర‡్ష్య పడుతున్నార ట. గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని చిత్రాల్లో నటిస్తున్న సమంత పాత్రల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నటనకు అవకాశం ఉందనిపిస్తే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారట. ఈమె రామ్‌చరణ్‌తో జత కట్టిన రంగస్థలం చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చి మంచి హిట్ టాక్‌ను తె చ్చుకోవడంతోపాటు సమం త నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే ఏ డా ది సమంత నటించిన ద్విభా షా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సీమరాజా, లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం యూటర్న్ చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఇవన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రాలేనని అం టున్నారీ మిలియన్ డాలర్ల బ్యూటీ. -
వరుణ్.. వరుసగా రెండోసారి..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లు సాదిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఒక్క అ! తప్ప ఓవర్ సీస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాలేవి రిలీజ్ కాకపోవటంతో ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో స్థానం దక్కించుకుంది. ఫిదా సినిమాతో ఓవర్సీస్లో తొలిసారిగా మిలియన్ డాలర్ క్లబ్లో జాయిన్ అయిన వరుణ్ తేజ్, తొలిప్రేమతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. వరుణ్ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడట. -
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు జనవరి 2వ తేదీతో ముగిసిన వారాంతానికి 319.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు వారంతో (డిసెంబర్ 26) పోల్చితే 471 మిలియన్ డాలర్లు తగ్గాయి. అమెరికా డాలర్ల రూపంలో ఉండే ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ 863 మిలియన్ డాలర్లు తగ్గి, 294.53 బిలియన్ డాలర్లుగా ఉంది. మారక విలువల్లో తగ్గుదల దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 1.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వల విలువ డిసెంబర్ 26తో పోల్చితే 18.98 బిలియన్ డాలర్ల నుంచి 19.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
ఇన్వెస్ట్ ఇట్ లైక్ బెక్హాం..
కుప్పతెప్పలుగా గోల్స్.. గోల్డెన్ బాల్స్ నిక్‌నేమ్‌తో పేరొందాడు ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం. ఫుట్‌బాల్ మైదానంలోనే కాదు వ్యాపారం, పెట్టుబడుల బరిలోనూ అదే మెళకువలు పాటిస్తూ, రాణిస్తున్నాడు. బెక్హాం సంపద విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 38 ఏళ్ల వయస్సులో ఇటీవలే రిటైరయిన బెక్హాం ఒకవైపు ఫుట్‌బాలర్‌గా సంపాదిస్తూనే మరోవైపు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ సంపద విలువను మరింత పెంచుకుంటున్నాడు. ఉదాహరణకు.. ఎప్పుడో 1999లో 3.2 మిలియన్ డాలర్లు పెట్టి బెక్హాం కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు ఏకంగా 29.3 మిలియన్ డాలర్లు పలుకుతోంది. రిటైర్ అయినప్పటికీ.. ఫ్యాషన్, కాస్మెటిక్స్ కంపెనీలు బెక్హాంను విడిచిపెట్టేయలేదు. అతనికి ఇప్పటికీ సింహభాగం ఆదాయం వీటి నుంచే వస్తోంది. తన పేరు మీద బెక్హాం ఇన్స్టింక్ట్ పేరిట ఈ మధ్యే అమెరికాలో ఒక ఆఫ్టర్షేవ్ను ప్రవేశపెట్టేందుకు 13.7 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ల జోరు మరికాస్త పెంచాడు. ఒక సాకర్ ఫ్రాంచైజీని కొంటున్నాడు. మరోవైపు, కరీబియన్ దీవుల్లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టాడు. హైతీలో పెద్ద ఎత్తున స్థలం కొనబోతున్నాడు. బెక్హాంతో స్ఫూర్తి పొందిన మన దేశీ డెరైక్టర్ ఒకరు బెండ్ ఇట్ లైక్ బెక్హాం అనే సినిమా కూడా తీశారు. బెక్హాం తరహాలోనే మరో ఫుట్‌బాలర్ లీ జాన్సన్ కూడా పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తాడు. అయిదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి 1.5 మిలియన్ డాలర్లకు ఓ ఇంటిని కొన్నాడు. దానికి మరికొన్ని హంగులు అద్ది.. పరిస్థితులు కాస్త మెరుగుపడగానే 2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. మాంద్యం సమయంలో కూడా అర మిలియన్ డాలర్ల లాభం జేబులో వేసుకున్నాడు. ఇదే ఊపుమీద మరో ఇరవై ప్రాపర్టీలు కొనేసేందుకు సిద్ధమవుతున్నాడు. -
‘బకాయిల వివరాలు తెలపండి’
కరాచీ: భారత క్రికెట్ బోర్డుకు ఏడు నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల మేరకు తాము బాకీ ఉన్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో వివరణతో పాటు పూర్తి వివరాలు అందించాల్సిందిగా పీసీబీ అధికారులు బీసీసీఐని కోరారు. టెస్టు క్రికెట్ ఆడే చాలా సభ్య దేశాలు బోర్డుకు బకాయి పడ్డాయని, అందులో 2000-2001 నుంచి ఎనిమిది మిలియన్ డాలర్లు పాక్ బోర్డు చెల్లించాల్సి ఉందని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ‘ఈ మొత్తం గురించి పూర్తి వివరాలు తెలపాల్సిందిగా బీసీసీఐకి లేఖ రాశాం. అయితే ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం రాలేదు. బహుశా ఇది ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా పీసీబీ తరఫున బీసీసీఐ ఖర్చు చేసిన మొత్తం కావచ్చు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.