UK Court Orders Ruler Of Dubai: ఇంతవరకు మనం పెద్ద పెద్ద స్టార్‌లు, సినీ తారలు, లేదా సెలబ్రేటీల జంటలు విడిపోతే పెద్ద మొత్తంలో భరణంగా ఇవ్వడం వంటివి చూశాం. అంతేకాదు మహా అయితే 10 కోట్లు లేదా 100 కోట్లు వరకు భరణం ఇవ్వడం చూసి ఉండవచ్చుగానీ ఏకంగా ఐదువేల కోట్లను భరణంగా ఇవ్వడం విని ఉండం.
(చదవండి: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!)
అసలు విషయంలోకెళ్లితే...యూకేలోని లండన్ హైకోర్టు దుబాయ్ పాలకుడు, ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ (72)ను తన మాజీ భార్య యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు (728 మిలియన్ డాలర్లు) రూ. 5500 కోట్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. అయితే ప్రిన్సెస్ హయా బింట్ జర్మనీ దేశాన్ని ఆశ్రయం కోరింది. ఆపై దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్ తన పిల్లల్లను ఇవ్వమంటూ జర్మనీకి చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో యూకే కోర్టు మాజీ భార్య భద్రతకు, వారి ఇద్దరూ పిల్లలు అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్(14), షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్(9)ల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందేగా దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది.
అంతేకాదు రూ. 2,516 కోట్లు ముందుస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తదుపరి మొత్తాన్ని మూడు నెలల్లో సెటల్మెంట్ చేయాల్సిందిగా ఆదేశించింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలి అని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు అయితే అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా II సోదరి.
(చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!)
Comments
Please login to add a commentAdd a comment