మిలియన్‌ డాలర్ల బ్యూటీ | Here is the list of Samantha's thirteen Million Dollar movies | Sakshi
Sakshi News home page

మిలియన్‌ డాలర్ల బ్యూటీ

Published Sun, Apr 1 2018 4:41 AM | Last Updated on Sun, Apr 1 2018 4:55 AM

Here is the list of Samantha's thirteen Million Dollar movies - Sakshi

తమిళసినిమా: మిలియన్‌ డాలర్ల బ్యూటీగా వాసికెక్కడం అంత సులభం కాదు. మిలియన్‌ డాలర్‌ అంటే విదేశాల్లో గొప్ప విషయమే. అంటే 10 లక్షల డాలర్లు అన్నమాట. అమెరికాలో విడుదలయ్యే తమిళం, తెలుగు చిత్రాలు ఒక మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తే గొప్ప విషయమే అవుతుంది. అలా మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన అధిక చిత్రాలు ఈ ముద్దుగుమ్మ ఖాతాలోనే చేరాయట. అందువల్ల సమంత నమోదు మిలియన్‌ డాలర్ల బ్యూటీగా వాసి కెక్కారు.

సమంత నటించిన తమిళ చిత్రం తెరి, 24, మెర్శల్‌ చిత్రాలు అమెరికాలో 10 లక్షల డాలర్లు వసూలు చేశాయి. ఇటీవలే ప్రేమికుడు నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన సమంత నటిగా కొనసాగడం, అదీ హీరోయిన్‌గా బిజీ గా ఉండడం సహ నటీమణులు ఈర‡్ష్య పడుతున్నార ట. గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని చిత్రాల్లో నటిస్తున్న సమంత పాత్రల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నటనకు అవకాశం ఉందనిపిస్తే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారట.

ఈమె రామ్‌చరణ్‌తో జత కట్టిన రంగస్థలం చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చి మంచి హిట్‌ టాక్‌ను తె చ్చుకోవడంతోపాటు సమం త నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఇదే ఏ డా ది సమంత నటించిన ద్విభా షా చిత్రం నడిగైయార్‌ తిలగం (తెలుగులో మహానటి) విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై, శివకార్తికేయన్‌ సరసన నటిస్తున్న సీమరాజా, లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రం యూటర్న్‌ చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఇవన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రాలేనని అం టున్నారీ మిలియన్‌ డాలర్ల బ్యూటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement