మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్‌.. | I owe Rangasthalam’s success to Ram Charan | Sakshi
Sakshi News home page

నేను కుమార్‌బాబు టైప్‌ అండీ

Published Sun, Apr 1 2018 12:14 AM | Last Updated on Sun, Apr 1 2018 12:19 AM

I owe Rangasthalam’s success to Ram Charan - Sakshi

సుకుమార్‌

‘‘తెల్ల కాగితంలా రండి... సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’’. ‘రంగస్థలం’ రిలీజ్‌కు ముందు సుకుమార్‌ ఇచ్చిన స్టేట్మెంట్‌ ఇది. ఆడియన్స్‌ వస్తున్నారు..ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్‌ మళ్లీ ‘తెల్ల కాగితం’ తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే జస్ట్‌ నెల తర్వాత. ఈ తెల్ల కాగితంపై కొత్త కథ రెడీఅవ్వబోతోంది. మళ్లీ సేమ్‌...ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవద్దు..తెల్ల కాగితంలా థియేటర్‌కి వెళ్లాలి. సినిమా చూడాలి. ఎందుకంటే ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ స్టోరీ’స్‌ ఇవ్వడం సుకుమార్‌కి అలవాటు. లెక్కల మాస్టారిలా స్టూడెంట్స్‌కిమార్కులు వేసిన సుకుమార్‌ ఇప్పుడు ఆడియన్స్‌తో మంచి మార్కులు
వేయించుకుంటున్నారు.


► సక్సెస్‌ రీ–సౌండ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లున్నారు?
(నవ్వుతూ). అవును. ఫుల్‌ హ్యాపీగా ఉన్నాను.

► సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్‌ ‘సిటీ బ్యాక్‌డ్రాప్‌’ అని ఒక రూట్‌లో వెళుతుంటే.. ‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌’ రూట్‌లో వచ్చారు.. ఈ రూట్‌లోకి డైవర్ట్‌ అవ్వడానికి కారణం?
నేను ఇప్పటివరకూ తీసినవన్నీ సిటీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలే. ఖరీదు గల కార్లు, బంగ్లాలు, రిచ్‌ సెట్స్, ఫారిన్‌ లొకేషన్స్‌. ఇవన్నీ నా సినిమాల్లో చూపించాను. డిఫరెంట్‌గా ఆలోచిస్తే బాగుంటుందనిపించింది. అందుకే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేయాలనుకున్నాను. అది కూడా పక్కా పల్లెటూరిని చూపించాలనుకున్నాను.

► బాగానే ఉంది.. ముందు హీరోకి వినికిడి లోపం లేదట. తర్వాతే స్క్రిప్ట్‌లో యాడ్‌ చేశారట కదా. వినగానే రామ్‌చరణ్‌ ఏమన్నారు?
అవును. ముందు రాసుకున్న స్క్రిప్ట్‌లో లేదు. తర్వాత యాడ్‌ చేశాను. క్యారెక్టర్‌లో కామెడీ కూడా ఉండాలనుకున్నాను. కథ వినగానే చరణ్‌ ఒక్క క్షణం ఆలోచనలో పడినట్లు అనిపించింది. ‘కొత్తగా ఉంటుంది. మంచి ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది’ అన్నాను. చరణ్‌ ఇంకో క్షణం కూడా ఆలోచించలేదు.

► ‘రామ్‌చరణ్‌ ఈ సినిమాలో బాగా యాక్ట్‌ చేశాడు’ అని అందరూ అంటున్నారు. చరణ్‌ అలా చేయడానికి మీరు తనని ఏం చేశారు?
ఏమీ చేయలేదు. స్టోరీ, క్యారెక్టరే తనని అలా డ్రైవ్‌ చేశాయి. ఏ ఆర్టిస్ట్‌ అయినా అంతే. వాళ్లకు మంచి క్యారెక్టర్‌ వస్తే రెచ్చిపోయి నటిస్తారు. డైరెక్టర్‌గా నేనా స్టోరీని, క్యారెక్టర్‌ని తన మనసుకి బాగా ఎక్కేలా చెప్పాను.

► సమంతను డీ–గ్లామరైజ్డ్‌గా చూపిస్తూనే అందంగా చూపించారు. ఆ క్యారెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్‌ ఎవరైనా ఉన్నారా?
నా ఫ్యామిలీలోనే ఉన్నారు. నా చిన్నక్క కట్టూబొట్టూ అలానే ఉండేది. రామలక్ష్మీ క్యారెక్టర్‌ అనుకున్నప్పుడే అక్క కట్టూబొట్టూ ఫాలో అవ్వాలనుకున్నాను. సమంత కూడా చాలా బాగా చేసింది.

► ఫుల్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌.. అందులోనూ హీరోకి వినికిడి లోపం.. రిజల్ట్‌ ఎలా ఉంటుందోనని టెన్షన్‌ పడ్డారా?
కొంచెం ఉండేది. అయితే చిరంజీవిగారు ఫస్ట్‌ కాపీ చూసి, ‘చాలా బాగుంది’ అన్న తర్వాత, చరణ్‌ పెద్దమ్మ (వసంతలక్ష్మీ – చరణ్‌ అమ్మ సురేఖకు అక్క)గారు చూసి, బాగుందన్నాక మొత్తం టెన్షన్‌ పోయింది. ఆవిడ జడ్జిమెంట్‌ బాగుంటుంది. ఆర్య, ఆర్య–2, 100% లవ్‌ సినిమాలు ‘చాలా బాగున్నాయి. హిట్‌ ఖాయం’ అని ఆమె అన్నారు. అది నిజమైంది. వసంతలక్ష్మీగారు ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెబుతారు. ఆవిడ చెప్పింది కరెక్ట్‌ అని అల్లు అరవింద్‌గారి ఫ్యామిలీ నమ్ముతుంది. నాకూ ఆవిడ మీద నమ్మకం. సినిమా చూశాక నన్ను గట్టిగా హగ్‌ చేసుకున్నారు. సురేఖగారు కూడా చాలా బాగుందన్నారు. అప్పుడే నా టెన్షన్‌ మొత్తం పోయింది.

► ‘సినిమా బాగుంది’ అనే టాక్‌తో పాటు నాలుగు డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటుంది. కలెక్షన్స్‌ వైజ్‌గానూ ‘రంగస్థలం’ మీకు శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందనొచ్చా?
డెఫినెట్లీ. బిగ్గెస్ట్‌ హిట్‌ ఇన్‌ మై కెరీర్‌. ప్రొడ్యూసర్స్‌ నవీన్, రవిశంకర్, మోహన్‌గార్లు హ్యాపీగా ఉన్నారు. వీళ్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ‘రంగస్థలం’ షూటింగ్‌ సమయంలో వీళ్ల మీద జోక్‌ వేసుకునేవాళ్లం. అదేంటంటే.. ఒకవేళ వర్షం వస్తే మబ్బులను కూడా కొనేసి, వర్షం రాకుండా చూస్తారని నవ్వుతూ చెప్పుకునేవాళ్లం. వాళ్లెంత అన్‌కాంప్రమైజ్డ్‌ ప్రొడ్యూసర్సో చెప్పడానికి ఇలా అనుకునేవాళ్లం. ‘ఇది కావాలి’ అంటే చాలు.. వెంటనే ఎరేంజ్‌ చేసేసేవారు. ఇవాళ ప్రాడెక్ట్‌ ఇలా ఉందంటే దానికి కారణం వాళ్లే.
 

► అది సరే.. ‘రంగస్థలం’ క్యారెక్టర్స్‌లో మీరు ఏ టైప్‌? అన్ని క్యారెక్టర్స్‌ మీరే రాసుకున్నప్పటికీ మీకేది ఇష్టం?
నేను కుమార్‌ బాబు (రామ్‌చరణ్‌కి అన్నగా ఆది పినిశెట్టి చేసిన రోల్‌) టైప్‌ అండి. నేను రాసిన అన్ని పాత్రలూ నాకిష్టమే. కాకపోతే చిట్టిబాబుది స్పెషల్‌ ప్లేస్‌.

► మీది లవ్‌ మ్యారేజ్‌ కదా. కుమార్‌బాబు తన లవర్‌ని కలవడం కోసం మోపెడ్‌లో వెళతాడు.. మీరు?
(గట్టిగా నవ్వేస్తూ). సైకిల్‌. అయ్య బాబోయ్‌. ఇప్పుడు నా లవ్‌స్టోరీ ఎందుకండీ? ఇంకోసారి మాట్లాడుకుందాం.

► ఇంతకీ మీ పిల్లలు ఏమన్నారు? ఏ పాట ఎక్కువగా పాడుతున్నారు?
మా ఇంట్లో సినిమా అందరికీ నచ్చింది. మా అబ్బాయి ‘ఎంత సక్కగున్నావే..’ పాట పాడుతున్నాడు. వాళ్ల అమ్మని పట్టుకుని (నవ్వుతూ). మా ఇంట్లో మా ఆవిడే రామలక్ష్మీ (సమంత చేసిన క్యారెక్టర్‌ పేరు).

► మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్‌ అయిపోతారు. అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, ఇప్పుడు రామ్‌ చరణ్‌. ఎలా బుట్టలో పడేస్తున్నారు?
బుట్టలో పడేయడం ఏమీ ఉండదండి. ఒక సినిమా కోసం నేను హీరోలతో కనీసం రెండేళ్లు ట్రావెల్‌ చేస్తాను. వాళ్లతో కమ్యూనికేషన్‌ సరిగ్గా లేకపోతే పని సజావుగా జరగదు. నేను వాళ్లను బాగా ప్రేమిస్తాను. ఎంత అంటే 100% ఇష్టపడతాను. ఆ ప్రేమంతా నిజమైనదే. నటన కాదు. వాళ్లతో నేను ఎప్పుడైతే ప్రేమగా ఉంటానో అప్పుడు వాళ్లకూ నా మీద అభిమానం ఏర్పడుతుంది. సినిమా చేస్తున్నంతసేపు చాలా బాగుంటాం. చేశాక కూడా ఆ ఎఫెక్షన్‌ అలానే కంటిన్యూ అవుతుంది.

► కంటిన్యూస్‌గా సిటీ బోర్‌ అని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నారు? వాట్‌ నెక్ట్స్‌?
ఇంకా ఏమీ అనుకోలేదు. తెల్ల కాగితం బయటకు తీయాలి. రాయడం మొదలుపెట్టాలి.

► మీకు ‘రంగస్థలం’ హ్యాంగోవర్‌ ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది?
ఇప్పట్లో వదలదు. ముందు ఫ్యామిలీతో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకోవాలి. తర్వాత నెక్ట్స్‌ సినిమా గురించి ఆలోచించాలి.

► మూడు గంటల సినిమా చూస్తారో? లేదో? అనే డౌట్‌ ఉండేదా?
ఉండేది కానీ, సినిమా చూశాక చిరంజీవిగారు ఒక్క ఫ్రేమ్‌ తీసినా బాగుండదన్నారు. ఆయన మాటలు విన్నాక నమ్మకం కుదిరింది. మరో నమ్మకానికి కారణం ‘అర్జున్‌ రెడ్డి’. ఆ సినిమా మూడు గంటలకు పైన కొంచెం ఉంటుంది. చూశారు కదా అనుకున్నా.

► ‘రంగస్థలం’ చూసి ఎవరు బాగా ఇంప్రెస్‌ అవ్వాలనుకున్నారు?
నా టార్గెట్‌ చిరంజీవిగారే. సినిమా చూశాక నాతో గంట సేపు మాట్లాడారు. పక్కనే సురేఖగారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా చాలా హ్యాపీనెస్‌ ఎక్స్‌ప్రెస్‌ చేశారు.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement