దిగజారిపోతున్న కుటుంబ విలువలకు అద్దం పెట్టే గాథ ఆ మహిళ కథ!. కడుపున పుట్టిన వాళ్లను కష్టపడి ప్రయోజకులుగా చేస్తే..తీరా వాళ్లు వృద్ధాప్యంలో కన్నెత్తి చూడకపోతే ఆ పెద్దాళ్ల పరిస్థితి కడు దయనీయంగా ఉంటుంది. తమను అప్యాయంగా పిలిచే పిలుపు కానరాక, తామెందుకు బతుకుతున్నాం అనిపించేలా ప్రతి క్షణం ఓ యుగంలా వారిని వేధిస్తున్నప్పుడూ కోపంతో వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఇలానే ఉంటాయి. అలానే ఈ వృద్ధ మహిళ కూడా తట్టుకోలేని ఆవేదనలో తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అందుకు అక్కడ చట్టాలు ఒప్పుకోవు. దీంతో ఆ మహిళ..
అసలేం జరిగిందంటే..చైనాలోని షాంఘైకి చెందిన లియు తన పిల్లలకు ఊహించని రీతీలో గట్టి షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఉన్న రూ. 23 కోట్ల ఆస్తిని పెంపుడు జంతువులక పేర రాసేసింది. ఇంతకు మునుపు తన ముగ్గురు పిల్లలకు పంచి ఇస్తున్నట్లుగా వీలునామా రాసి ఉన్నా..దాన్ని సడెన్‌గా మార్చేసింది. ఒక రోజు అనారోగ్యానికి గురయ్యింది లియు. అయితే ఆమెను చూసేందుకు గానీ, ఎలా ఉన్నావు అని ఫోన్‌లో పలకరించడం గానీ చేయలేదు ఆమె పిల్లలు. దీంతో తన గురించి పట్టించుకోనివాళ్లకు తన ఆస్తితో పని ఏమిట? అన్న కోపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
అయితే అందుకు చైనా చట్టాలు ఒప్పుకోవు. ఎందుకంటే చైనాలోని జంతువులకు నేరుగా విరాళాలు ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవు, అందుకు కొన్ని చట్టపరిమితులు ఉన్నాయి. ఈ మేరకు బీజింగ్‌లోని విల్ రిజిస్ట్రేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారి చెన్ కై ముందుకొచ్చి ఆ మహిళ సమస్యను పరిష్కరించేలా పలు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన వెటర్నీ క్లినిక్‌లోని పెంపుడు జంతువులను సరిగ్గా చూసుకోవడం కోసం ముందుగా తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిని నియమించమని ఆ వృద్ధ మహిళకు సూచించారు.
అంతేగాదు డబ్బు మొత్తం ఇలా వెటర్నరీ క్లినిక్ చేతిలో పెట్టడం వల్ల జరిగే నష్టాలు ఎదురయ్యే సమస్యలు గురించి కూడా అధికారులు ఆమెకు క్లియర్‌గా వివరించారు. అలాగే భవిష్యత్తులో పిల్లలకు మనుసు మార్చుకుని వస్తే గనుక నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచించి సరైన విధంగా నిర్ణయం తీసుకుందామని ఆమెకు సలహ ఇచ్చారు అధికారులు. ఐతే చైనాలో ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో టేనస్సీలోని ఒక సంపన్న వ్యాపారవేత్త తన పెంపుడు పిల్లులు కోలీ, లులుకు కూడా ఇలానే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని రాసివ్వడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment