10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ | State Bank of India plans to raise $1.5 billion from overseas bonds | Sakshi
Sakshi News home page

10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ

Published Thu, Jun 30 2016 1:15 AM | Last Updated on Wed, Aug 1 2018 4:13 PM

10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ - Sakshi

10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ

విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా  (150 కోట్ల డాలర్లు) పెట్టుబడులు సమీకరించనున్నది.  డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో దీర్ఘకాల బాండ్ల జారీ ద్వారా ఈ స్థాయిలో నిధులను సమీకరిస్తామని బీఎస్‌ఈకి ఎస్‌బీఐ నివేదించింది. బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొంది.  ఈ నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒకేసారి గాని, వివిధ దఫాలుగా గానీ సమీకరిస్తామని పేర్కొంది. పబ్లిక్ ఆఫర్/డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో ఈ పెట్టుబడులను సమీకరిస్తామని ఎస్‌బీఐ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement