mobilization
-
పెట్టుబడుల సమీకరణలో మరో అడుగు ముందుకు - ఒబెన్ ఎలెక్ట్రిక్
బెంగళూరు: దేశీ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలెక్ట్రిక్ కొత్తగా రూ. 40 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. స్ట్రైడ్ వెంచర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ముంబై ఏంజెల్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు ఒబెన్ సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు. ఎక్స్టెండెడ్ ప్రీ–సిరీస్ ఏ రౌండ్ కింద ఈ నిధులను సమీకరించినట్లు చెప్పారు. దీంతో ప్రీ–సిరీస్ కింద మొత్తం రూ. 72 కోట్ల పెట్టుబడులు సాధించినట్లయిందని వివరించారు. కొత్తగా ఆవిష్కరించిన తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ రోర్ డెలివరీలను ప్రారంభించేందుకు, ఉత్పత్తిని వార్షికంగా లక్ష యూ నిట్లకు పెంచుకునేందుకు ఈ నిధులను ఉప యోగించుకోనున్నట్లు చెప్పారు. జూలై మొద టివారం నుంచి బెంగళూరులో డెలివరీలు ప్రారంభమవుతాయని అగర్వాల్ తెలిపారు. -
అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి
న్యూఢిల్లీ: భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్‌పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు. ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ వచ్చే బడ్జెట్లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్‌ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మంత్రి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష
-
మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు మింగేద్దాం
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 15 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. కనీసం హైడ్రలాజికల్ క్లియరెన్స్.. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) కూడా లేకుండానే.. లైన్ ఎస్టిమేట్ల(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగానే రూ.17,367 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని జలవనరుల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ప్రేమతో ఇదంతా చేస్తోందనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, కోటరీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్ల కింద దండుకునేందుకు వ్యూహరచన చేశారు. ఈ సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ, నాగావళి(తోటపల్లి) కాలువల ఆధునికీకరణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే వాటిని కట్టబెట్టాలంటూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. జనవరి రెండో వారంలోగా మిగిలిన ప్రాజెక్టుల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండడం గమనార్హం. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు ప్రభుత్వం రూ.44,877.24 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిన దాఖలాలు లేవు. కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లందించలేకపోయారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇం‘ధనం’ సమకూర్చుకోవడానికి కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోగా ఆయా ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి.. మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చే రూ.1,700 కోట్లను కమీషన్ల రూపంలో నొక్కేయడానికి పక్కాగా స్కెచ్ వేశారు. లైన్ ఎస్టిమేట్లే ఆధారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ వంశధార ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. కానీ, వంశధార ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వంశధార–బాహుదా నదుల అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన సర్వే ప్రక్రియే పూర్తి కాలేదు. లైన్ ఎస్టిమేట్లు ఆధారంగా టెండర్లు పిలవాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) కుడి కాలువ తవ్వుకోవడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. నాలుగు టీఎంసీల నీటిని కేటాయించింది. గత నాలుగున్నరేళ్లుగా ఆర్డీఎస్ కుడి కాలువకు సంబంధించి డీపీఆర్ తయారు చేయడంలో సర్కార్ విఫలమైంది. ఇప్పుడు లైన్ ఎస్టిమేట్ల ఆధారంగా ఆ పనులకు టెండర్లు పిలవాలని అంటున్నారు. కర్నూలు–కడప(కేసీ) కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి గుండ్రేవుల రిజర్వాయర్ సర్వే పనులు కూడా పూర్తి చేయలేని సర్కార్.. ఆ పనులను చేపడతామని చెబుతుండటంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. కుప్పంలో 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ.41.70 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పరిధిలో పాలార్ నదిపై నిర్మించిన 21 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు, పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.41.70 కోట్లు మంజూరు చేసింది. ఈ చెక్‌డ్యామ్‌ల కింద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా లేదు. కానీ, వాటి మరమ్మతు, పునరుద్ధరణ వల్ల 5,527 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని పేర్కొంటూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చెక్‌డ్యామ్‌ల మరమ్మతు, పునరుద్ధరణ పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లు కొల్లగొట్టడానికి ఉన్నతస్థాయిలో ప్రణాళిక రచించినట్లు సమాచారం. -
7,00,000 డాలర్లను సమీకరించిన బైండర్
హైదరాబాద్: దేశీ మొబైల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘బైండర్’ తాజాగా 7,00,000 డాలర్లను సమీకరించింది. బెన్ ఫ్రాంక్లిన్ టెక్నాలజీ పార్ట్నర్స్, ఎడ్యుకేషన్ డిజైన్ స్టూడియో, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సంస్థ ఈ పెట్టుబడులను పొందింది. కార్యకలాపాల విస్తరణ కోసం ఈ నిధులను ఉపయోగిస్తామని బైండర్ ఒక ప్రకటనలో తెలిపింది. కళాశాల యాజమాన్యాలకు చేరువవ్వడం సహా విద్యార్థులకు ఉపయోగకరమైన ఎడ్యుకేషన్ కంటెంట్లను రూపొందించడానికి ప్రయత్నిస్తామని వివరించింది. -
బాబు భూదాహానికి ఉళ్ళకు ఉళ్ళు బలి
-
10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ
విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా (150 కోట్ల డాలర్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో దీర్ఘకాల బాండ్ల జారీ ద్వారా ఈ స్థాయిలో నిధులను సమీకరిస్తామని బీఎస్ఈకి ఎస్బీఐ నివేదించింది. బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒకేసారి గాని, వివిధ దఫాలుగా గానీ సమీకరిస్తామని పేర్కొంది. పబ్లిక్ ఆఫర్/డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఈ పెట్టుబడులను సమీకరిస్తామని ఎస్బీఐ వివరించింది. -
రూ.15వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం
ఎస్బీఐ వాటాదారుల ఆమోదం ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వాటాదారుల ఆమోదం పొందింది. ఈ నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా కానీ, విదేశాల్లో షేర్ల జారీ ద్వారా కానీ సమీకరించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆమోదం పొందామని తెలియజేసింది. ప్రభుత్వ వాటా 52 శాతానికన్నా తగ్గకుండా ఉండేలా ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.15,000 కోట్ల నిధులు సమీకరించనున్నామని ఈ ఏడాది జనవరిలోనే ఎస్బీఐ వెల్లడించింది. బాసెల్-3 నిబంధనలకు పాటించడానికి అవసరమైన నిధులను ఇలా సమకూర్చుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. -
ఏడాదిలో 700 మిలియన్ డాలర్లు
130 దేశీ స్టార్టప్ సంస్థల భారీ నిధుల సమీకరణ ♦ 5 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన ♦ ఇన్నోవెన్ క్యాపిటల్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: రాబోయే 12 నెలల్లో సుమారు 130 దేశీ స్టార్టప్ కంపెనీలు దాదాపు 700 మిలియన్ డాలర్లు సమీకరించనున్నాయి. అలాగే సుమారు 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016 పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. స్నాప్‌డీల్, మింత్రా, ప్రాక్టో, ఫ్రీచార్జ్ తదితర 70 కంపెనీలకు ప్రారంభ దశలో ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా దాదాపు 100 పైగా రుణాలు అందించింది. తాజా నివేదికలో ఫండింగ్ దశతో సంబంధం లేకుండా రంగాలవారీగా విశ్లేషణ చేసింది. దీని ప్రకారం నియామకాలపరంగా కన్జూమర్ ఇంటర్నెట్, ఈ-కామర్స్ సంస్థలు ఎక్కువ ఆశావహంగా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన స్టార్టప్‌లలో 41 శాతం మంది వ్యవస్థాపకులు లేదా సీఎక్స్‌వో స్థాయి అధికారులు మహిళలే ఉన్నారు. ఏంజెల్ ఫండింగ్ పొందిన వాటిల్లో ఇది 29 శాతంగా ఉంది. లాభాల బాటలోకి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సొంత నిధులతో మనుగడ సాగిస్తున్న (బూట్‌స్ట్రాప్) సంస్థల్లో 50 శాతం, ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు పొందిన వాటిల్లో 45 శాతం, వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు సమీకరించిన వాటిల్లో 22 శాతం స్టార్టప్‌లు లాభాల బాట పట్టనున్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యాపార, రాజకీయ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 65 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. స్టార్టప్‌లకు వచ్చే ఏడాది మరింత సానుకూలంగా ఉంటుందని 76 శాతం సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 56 కింద ఏంజెల్ ట్యాక్స్ ఉంటుందన్న విషయం 74 శాతం బూట్స్ట్రాప్డ్, ఏంజెల్ ఫండెడ్ సంస్థలకు తెలియదని నివేదిక వెల్లడించింది. -
అమ్మకానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్ వాటా!
30 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల సమీకరణ లక్ష ్యం ఎయిర్‌పోర్టు వ్యాపారం ప్రస్తుత విలువ రూ. 10,000 కోట్లుగా అంచనా వాటా విక్రయం ప్రణాళిక ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని కంపెనీ వివరణ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :అప్పులను తగ్గించుకోవడానికి ఎయిర్‌పోర్టు వ్యాపారంలో వాటాలను విక్రయించాలని జీఎంఆర్ గ్రూపు నిర్ణయించింది. జీఎంఆర్ ఆనుబంధ కంపెనీగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ మార్కెట్లో నమోదు చేయడమో, లేక పీఈ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించటమో చేయటం ద్వారా నిధులు సేకరించే ప్రయత్నంలో కంపెనీ ఉంది. వచ్చే ఏడాది కాలంలో ఎయిర్పోర్ట్ వ్యాపారంలో వాటాలను విక్రయించడం ద్వారా కనీసం రూ. 3,500 నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది. ఈ నిధుల సేకరణకు ముఖ్య సలహాదారుగా క్రెడిట్ సూసీ సంస్థను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వ్యాపార విలువను రూ. 10,000 కోట్లుగా మదింపు వేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కనీసం 30 శాతం వాటాను మార్చిలోగా విక్రయించడం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇప్పటికే జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో పెట్టుబడి పెట్టిన వారు వైదొలగడానికి అవకాశం కల్పించడంతోపాటు, అప్పులను తీర్చుకోవడానికి ఈ వాటాల విక్రయాన్ని వాడుకోవాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో మెక్వైరీ ఎస్బీఐ ఇన్ఫ్రా, స్టాండర్డ్ చార్టర్డ్ ప్రైవేట్ ఈక్విటీ, జేఎం ఫైనాన్షియల్స్ వంటి పీఈ సంస్థలు సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయటం తెలిసిందే. వేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయానరంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, కేకేఆర్ వంటి సంస్థలు 30 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు మార్కెట్లో వినిపిస్తుండగా... కంపెనీ ప్రతి నిధులు మాత్రం దీన్ని ఖండిం చారు. వాటాల విక్రయం ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉందని, హడావిడిగా వాటాలను విక్రయించే ఉద్దేశం లేదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. సగం ఆదాయం ఎయిర్‌పోర్టు నుంచే... విద్యుత్, రోడ్లు, ఎయిర్పోర్ట్ వంటి విభిన్న వ్యాపారాల్లో ఉన్న జీఎంఆర్ గ్రూపునకు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా ఎయిర్‌పోర్టు విభాగం ఎదిగింది. గతేడాది మొత్తం వ్యాపారంలో 49 శాతం ఆదాయం ఎయిర్‌పోర్టుల నుంచే వచ్చింది. 2014-15లో జీఎంఆర్ గ్రూపు ఆదాయం రూ. 11,088 కోట్లుకాగా, ఎయిర్పోర్ట్ నుంచి రూ.5,468 కోట్లు సమకూరింది. ప్రస్తుతం జీఎంఆర్ గ్రూపు ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, ఫిలిఫైన్స్‌లో ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 64 శాతం వాటాను, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 63 శాతం, ఫిలిఫైన్స్ మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 40 శాతం వాటా జీఎంఆర్‌కు ఉంది. పూర్తి అప్పుల ఊబిలో ఉన్న కంపెనీ ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే పనిలో ఉంది. మార్చిలోగా అప్పులను 30 నుంచి 40 శాతం తగ్గించుకోవాలన్నది కంపెనీ ఆలోచన. సెప్టెంబర్ మాసాంతానికి జీఎంఆర్ గ్రూపు రుణాలు రూ. 40,500 కోట్లు. రెండు రోజుల క్రితమే ఎఫ్‌సీసీబీలు జారీ చేసి రూ. 2,000 కోట్లు సమీకరించింది. -
ఉబెర్ 210 కోట్ల డాలర్ల పెట్టుబడుల సమీకరణ
భారత, చైనాల్లో విస్తరణ కోసం న్యూయార్క్: యాప్ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ భారత్, చైనాల్లో విస్తరణ కోసం 210 కోట్ల డాలర్ల(సుమారుగా రూ.13,650 కోట్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. టైగర్ గ్లోబల్, ఇంకా ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ స్థాయిలో నిధులు సమీకరించనున్నదని సమాచారం. ఇలా సమీకరించిన నిధులను భారత్, చైనాల్లో ఉబెర్ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పెట్టుబడుల ఆధారంగా ఈ కంపెనీ విలువ 6,250 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.4 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం 9 నెలల్లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని ఈ ఏడాది జూలైలో ఉబెర్ వెల్లడించింది. ఉబెర్‌తో పోటీపడుతున్న మరో ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలాలో కూడా టైగర్ గ్లోబల్ పెట్టుబడులు పెట్టడం విశేషం. కాగా ఓలా కంపెనీ ఇతర పోటీ కంపెనీలైన డిడి, లిఫ్ట్, గ్రాబ్ ట్యాక్సీలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల ఈ యాప్‌ల యూజర్లందరూ భారత్, చైనా, అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా67 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉబెర్‌కు గట్టి పోటీనిచ్చిన్నట్లు అవుతుంది కూడా.