![రూ.15వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం](/styles/webp/s3/article_images/2017/09/3/61456516921_625x300.jpg.webp?itok=wWj1Wua5)
రూ.15వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం
ఎస్‌బీఐ వాటాదారుల ఆమోదం
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వాటాదారుల ఆమోదం పొందింది. ఈ నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా కానీ, విదేశాల్లో షేర్ల జారీ ద్వారా కానీ సమీకరించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆమోదం పొందామని తెలియజేసింది. ప్రభుత్వ వాటా 52 శాతానికన్నా తగ్గకుండా ఉండేలా ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.15,000 కోట్ల నిధులు సమీకరించనున్నామని ఈ ఏడాది జనవరిలోనే ఎస్‌బీఐ వెల్లడించింది. బాసెల్-3 నిబంధనలకు పాటించడానికి అవసరమైన నిధులను ఇలా సమకూర్చుకోవాలని ఎస్‌బీఐ భావిస్తోంది.