
7,00,000 డాలర్లను సమీకరించిన బైండర్
హైదరాబాద్: దేశీ మొబైల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘బైండర్’ తాజాగా 7,00,000 డాలర్లను సమీకరించింది. బెన్ ఫ్రాంక్లిన్ టెక్నాలజీ పార్ట్‌నర్స్, ఎడ్యుకేషన్ డిజైన్ స్టూడియో, ఇతర ఇన్వెస్టర్ల నుంచి సంస్థ ఈ పెట్టుబడులను పొందింది. కార్యకలాపాల విస్తరణ కోసం ఈ నిధులను ఉపయోగిస్తామని బైండర్ ఒక ప్రకటనలో తెలిపింది. కళాశాల యాజమాన్యాలకు చేరువవ్వడం సహా విద్యార్థులకు ఉపయోగకరమైన ఎడ్యుకేషన్ కంటెంట్‌లను రూపొందించడానికి ప్రయత్నిస్తామని వివరించింది.