-ఐదుగురి అరెస్టు
జైపూర్: విదేశీ కరెన్సీని చెలామణీ చేసేందుకు యత్నించిన ముఠాను ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ తెలిపిన వివరాలివీ.. టర్కీ దేశం కరెన్సీ ‘లిరా’ను చెలామణీ చేసేందుకు ఏడుగురు సభ్యుల ముఠా యత్నిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 300 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ. 500 కోట్లని తేలింది. అయితే, ఆ కరెన్సీ ప్రస్తుతం టర్కీలో చెలామణీలో లేదు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.