రూ.8.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.8.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

Published Tue, Mar 28 2023 8:22 AM | Last Updated on Tue, Mar 28 2023 8:22 AM

పోలీసులు సీజ్‌ చేసిన విదేశీ కరెన్సీ - Sakshi

పోలీసులు సీజ్‌ చేసిన విదేశీ కరెన్సీ

అన్నానగర్‌: తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి రూ.8.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రాత్రి 1.30 గంటలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో తంజావూరుకు చెందిన అహ్మద్‌ ముస్తఫా అనే ప్రయాణికుడి వద్ద అమెరికా డాలర్లను గుర్తించి అరెస్టు చేశారు. వాటి విలువ రూ.8.23 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement