నటుడు ఆత్మహత్యాయత్నం | actor suciede attempt | Sakshi
Sakshi News home page

నటుడు ఆత్మహత్యాయత్నం

Published Mon, Jun 19 2017 5:00 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

actor suciede attempt

ఫినాయిల్‌ తాగి స్నేహితులకు సమాచారం
బనశంకరి :  ప్రేమ విఫలం కావడంతో కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ తన నివాసంలో ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రిలో చేరిన హుచ్చ వెంకట్‌ అక్కడ రచ్చ రచ్చ చేశారు. డాక్టర్లతో సహా అందరిపై విరుచుకుపడ్డారు. వివరాలు... కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని హుచ్చ వెంకట్‌ ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమించిందని, కానీ సదరు యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు.


దీంతో హుచ్చ ఆదివారం ఫినాయిల్‌ తాగి మీడియాకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులు హుటాహుటిన అక్కడకి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో హుచ్చ వెంకట్‌ అందరిపై విరుచుకుపడ్డారు. డాక్టర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతమైన ప్రచారం యావ కలిగిన హుచ్చ వెంకట్‌ ఈ ఘటనను ఇలా ప్రచారం చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే హుచ్చ వెంకట్‌ నటించిన పోకిరీ చిత్రం శాండిల్‌వుడ్‌లో అట్టర్‌ప్లాప్‌ కావడంతో నెల రోజులుగా సైలెంట్‌గా ఉన్న హుచ్చ వెంకట్‌ ఆదివారం ఒక్కసారిగా ఫినాయిల్‌ తాగి మీడియాతో పాటు స్నేహితులకు సమాచారం ఇవ్వడం సంచలనం కల్గిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement