జో మిన్-కి పాత చిత్రం
సియోల్ : మగ-ఆడా తేడా లేకుండా లైంగిక వేధింపుల పరంపరంను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆయుధంగా మారింది మీటూ(#MeToo) ఉద్యమం. అయితే అదే ఇప్పుడు ఓ నటుడి ప్రాణాలు తీసింది. దక్షిణ కొరియా ప్రముఖ నటుడు జో మిన్-కి గురువారం రాత్రి తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు.
52 ఏళ్ల జో మిన్ 200కి పైగా చిత్రాల్లో, పలు బుల్లి తెర కార్యక్రమాల్లో నటించారు. గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 8 మంది యువతులు ఆయన తమను వేధించారంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో దక్షిణ కొరియాలో మీటూ ఉద్యమం మొదలైంది.
పురుషాధిక్య దేశమైన దక్షిణ కొరియాలో మీటూ ఉవ్వెత్తున్న సాగటానికి జో మిన్ కారణమంటూ విమర్శలు వినిపించాయి. దీంతో మీడియా ముందుకు వచ్చిన ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అయితే తనపై ఆరోపణలు చేసే వారు బండారం త్వరలోనే బయటపెడతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినప్పటికీ ఆ ఉద్యమం ఆగలేదు. ఇంతలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు చెబుతుండగా, అధికారులు మాత్రం అది సూసైడ్ అని తేల్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment