తనను తాను కాల్చుకొని నటుడి ఆత్మహత్య! | actor commits suicide | Sakshi
Sakshi News home page

తనను తాను కాల్చుకొని నటుడి ఆత్మహత్య!

Published Wed, Dec 14 2016 12:06 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

తనను తాను కాల్చుకొని నటుడి ఆత్మహత్య! - Sakshi

తనను తాను కాల్చుకొని నటుడి ఆత్మహత్య!

ప్రముఖ టీవీ నటుడు కమలేశ్‌ పాండే ఆత్మహత్య చేసుకున్నాడు. సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘క్రైమ్‌ పెట్రోల్‌’ షోలో కమలేశ్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్ర పోషించాడు. అతడు మంగళవారం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఇంట్లో తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జరిగినప్పుడు అతని భార్య సోదరి అంజనీ కూడా అక్కడే ఉన్నారు. కొద్దిరోజుల కిందట అంజనీ కూతరు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కమలేశ్‌ను  ఆహ్వానించలేదు.

దీంతో అసంతృప్తి చెందిన కమలేశ్‌ మద్యం  తాగి ఇంట్లో పెద్ద గొడవ చేశాడు. ఈ క్రమంలో అతను తన రివాల్వర్‌ తీసి మొదట గాలిలో కాల్పులు జరిపాడు. అనంతరం తన ఛాతిపై కాల్చుకున్నాడు. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా వారు వచ్చేలోపు అతను ప్రాణాలు విడిచినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఇది ఆత్మహత్య కేసుగానే భావిస్తున్నామని, అయినా పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత  పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement