అనుమానాస్పదంగా యువనటి ఆత్మహత్య! | actor allegedly committed suicide | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: అనుమానాస్పదంగా యువనటి ఆత్మహత్య!

Published Mon, Jun 19 2017 3:54 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

అనుమానాస్పదంగా యువనటి ఆత్మహత్య! - Sakshi

అనుమానాస్పదంగా యువనటి ఆత్మహత్య!

ముంబై: సినీ నటులు విషాదాంతాలు కొనసాగుతున్నాయి. 29 ఏళ్ల యువనటి అంజనీ శ్రీవాస్తవ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ముంబై పశ్చిమ అంధేరిలోని తన నివాసంలో ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

అంజనీ శ్రీవాస్తవ పలు భోజ్‌పూరి సినిమాల్లో నటించింది. గత కొన్నాళ్లుగా ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆమె ఆదివారం నుంచి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమానిని కాల్‌ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని డుప్లికేట్‌ తాళంచెవితో ఆమె ఇంటిని తెరిచిచూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంజనీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ ఇంకా తెలియరాలేదు. ఆమె ఎలాంటి సూసైడ్‌ నోట్‌ రాయలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement