కర్ణాటక సీఎం నేనే..! | The loneliness of Karnataka's CM candidates | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం నేనే..!

Published Mon, Apr 30 2018 2:25 AM | Last Updated on Mon, Apr 30 2018 10:55 AM

The loneliness of Karnataka's CM candidates - Sakshi

యడ్యూరప్ప, సిద్దరామయ్య, కుమారస్వామి

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ఒక వైపు కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం..  

మే 17, 18లలో ముహూర్తం
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని మోదీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో బాధ్యతలు చేపడతా.  

రెండు చోట్లా గెలుస్తా
చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతా.  

నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా..
మా జేడీఎస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్‌డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement