60 ఏళ్ల వృద్ధుడిగా జగపతిబాబు | Jagapathi babu as 60 years old man | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వృద్ధుడిగా జగపతిబాబు

Published Thu, Oct 13 2016 2:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

60 ఏళ్ల వృద్ధుడిగా జగపతిబాబు

60 ఏళ్ల వృద్ధుడిగా జగపతిబాబు

విలన్గా టర్న్ తీసుకున్న తరువాత జగపతి బాబు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవటంతో పాటు విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా జగ్గుభాయ్తనే తీసుకుంటున్నారు. అయితే విలన్గా మారిన తరువాత ఫుల్ బిజీ అయిన జగపతిబాబు ఇప్పుడు మరోసారి హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు.

జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమారస్వామి నిర్మాణంలో తాను హీరోగా ఓ సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు జగ్గుభాయ్. ఆ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలను జాగ్వర్ సక్సెస్ మీట్లో వెల్లడించారు. తాను లీడ్ రోల్లో తెరకెక్కనున్న సినిమాకు తాను నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటానని తెలిపారు.

జగపతి ఆర్ట్ పిక్చర్స్, చెన్నాంభిక ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయని తెలిపిన జగపతి బాబు, ఈ సినిమాలో తాను 60 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాకు సంబందించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement