'జాగ్వార్'లో జగపతిబాబు కీలకపాత్ర | jagapathi babu in jaguar movie | Sakshi
Sakshi News home page

'జాగ్వార్'లో జగపతిబాబు కీలకపాత్ర

Published Sat, May 21 2016 8:35 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'జాగ్వార్'లో జగపతిబాబు కీలకపాత్ర - Sakshi

'జాగ్వార్'లో జగపతిబాబు కీలకపాత్ర

బెంగళూరు : తెలుగులో కథానాయకుడి పాత్ర నుంచి ప్రతినాయకుడి పాత్రలకు మారిపోయి ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఉన్నత శిఖరాలకు చేరిన జగపతి బాబు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా కన్నడలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రంలో కీలకపాత్రను పోషించడానికి జగపతిబాబు సిద్ధమయ్యాడు.

జాగ్వార్ చిత్రంలో నటించనున్న పాత్రపై స్పందిస్తూ..తనను ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించాలని కోరగా అంగీకరించానన్నారు. ఈక్రమంలో షూటింగ్ స్పాట్‌లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తన స్థాయిని పక్కనపెట్టి ఆత్మీయంగా మెలగడం చాలా సంతోషాన్ని, ఆశ్చర్యపరిచిందన్నారు. చిత్ర హీరో నిఖిల్ అంకిత భావంతో పని చేసే నటుడని కితాబిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement