=రాష్ట్రంలో జరగనున్న నరేంద్రమోడీ సభపై కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు
=28 లోక్‌సభ స్థానాల్లోనూ జేడీఎస్ పోటీచేస్తుందని వెల్లడి
సాక్షి, బెంగళూరు : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో రాష్ట్ర వాసులకు కథలను వినిపించేందుకు రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన చెప్పే కథలను ప్రతి ఒక్కరూ వినాలని జేడీఎస్ పార్టీ నేత, విధానసభ ప్రతిపక్ష నేత కుమారస్వామి పేర్కొన్నారు. ఇప్పటి వ రకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీలు, సమావేశాల్లో నరేంద్ర మోడీ వివిధ అంశాలపై కట్టు కథలను వినిపించారని, ఇప్పుడు రాష్ట్రంలో నాడప్రభు కెంపేగౌడ, కృష్ణదేవరాయలు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ తదితరుల కథలను వినిపించేందుకు అవకాశం ఉందని నరేంద్రమోడీ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బుధవారమిక్కడి విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. న రేంద్రమోడీ సభకు రూ.10 రుసుమును వసూలు చేయడంపై కుమారస్వామి మండిపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు గాంధీజీ సభకు కూడా ఈ తరహాలో ప్రవేశ రుసుమును వసూలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన షాదీ భాగ్య పథకం విస్తరణపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టతను ఇవ్వాలని కోరారు.
షాదీ భాగ్యను ఏయే వర్గాల వారికి విస్తరిస్తారు, బీపీఎల్ కార్డుదారులకి మాత్రమే పరిమితం చేస్తారా అనే విషయాలపై స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీచేయనుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు. ఇక మైసూరు జిల్లాలోని శ్రీరామ్ చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పనుల్లో తాను అక్రవ ూలకు పాల్పడ్డానన్న విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాన ని కుమారస్వామి వెల్లడించారు.
మోడీ చెప్పే క థలను వినడం మరిచిపోకండి...
Published Thu, Nov 14 2013 3:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement