కరీంనగర్ : వరంగల్ జిల్లాకు చెందిన రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై కుమారస్వామి (45) అనుమానాస్పద స్థితిలో మరణించారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే కాని మరణానికి కారణం తెలియదని పోలీసులు వెల్లడించారు.