యడ్యూరప్ప, కుమారస్వామిలపై ఎఫ్‌ఐఆర్ | fir on yaddurappa, kumara swamy | Sakshi
Sakshi News home page

యడ్యూరప్ప, కుమారస్వామిలపై ఎఫ్‌ఐఆర్

Published Fri, May 8 2015 1:50 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

fir on yaddurappa, kumara swamy

బెంగళూరు: ఓ భూమి డీనోటిఫికేషన్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్.డి.కుమారస్వామిలపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. వారిద్దరిపై అవినీతి నిరోధక చట్టంతోపాటు నేరపూరిత కుట్ర, చీటింగ్ సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక్కడి ఆర్.టి.నగర్‌లోని మతదహళ్లి లేఅవుట్‌లోని భూమిని డీనోటిఫై చేసిన వ్యవహారంలో ఇద్దరు నేతల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయని లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement