ప్రభుత్వానికి డెడ్‌లైన్
రవి కేసు దర్యాప్తు
సీబీఐకి అప్పగించాల్సిందే
లేదంటే ఉద్యమం తప్పదు
{పభుత్వానికి కుమార హెచ్చరిక
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవి మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సోమవారం లోపు సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వానికి జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామి డెడ్‌లైన్ విధించారు. లేదంటే ‘జన్మభూమి నుంచి కర్మభూమి వరకు’ పేరుతో డీ.కే రవి స్వస్థలం దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పాదయాత్ర చేపడుతానని ఆయన వెల్లడించారు. డీ.కే రవి ృుతికి సంబంధించిన కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్ర ఒక్కలిగ సంఘంతోపాటు రాష్ట్రంలోని వివిధ ధార్మిక సంస్థల అధిపతులైన స్వామీజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని కువెంపు కళాక్షేత్రం నుంచి ఫ్రీడం పార్కువరకూ శుక్రవారం నిరసన ర్యాలీను నిర్వహించారు. వీరికి విపక్షాలకు చెందిన నాయకులు కూడా తమ మద్దతును తెలియజేశారు. డీ.కే రవి తల్లిదండ్రులతో కలిసి అనంతరం ఫ్రీడం పార్కుృో బహత్‌సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ... సోమవారం లోపు డీ.కే రవి కేసును సీబీఐకు అప్పగించకుంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పార్టీలకు అతీతంగా పాదయాత్ర చేస్తామని తెలిపారు. డీ.కే రవి కేసును తప్పుదోవ పట్టించడానికే ఒక మహిళా ఐఏఎస్ అధికారి పేరును అనవసరంగా తెరపైకి తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ అధికారిణి మూడు సార్లు డీ.కే రవికి ఫోన్ చేసిందనే నెపంతో విచారణ పేరుతో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ప్రశ్నించిన సీఐడీ అధికారులు...డీ.కే రవికు ఫోన్ చేసి బెదిరించిన మంత్రులు, వారి సంబంధీకులను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
డీ.కే రవికు పోస్ట్‌మార్టం చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఎందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లని ఈ సందర్భంగా కుమారస్వామి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనాయకులతో పాటు వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజలు చేసిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. కాగా, డీ.కే రవి తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఒక్కలిగ సంఘం నాయకులు భరోసా ఇచ్చారు.