Investigating the case
-
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
లైంగికదాడి కేసులో నిందితుల అరెస్టు
వర్ని : మండలంలోని సైదాపూర్ తండాకు చెందిన వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డ అదే తండాకు చెందిన ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్నిలో పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. సైదాపూర్ తండాకు చెందిన రమేశ్, బాబు అనే యువకులు ఈ నెల 26న రాత్రి తండాకు చెందిన వివాహితను బలవంతంగా బైక్‌పై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి కర్రతో కొట్టారని పేర్కొన్నారు. దీంతో బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. శరీరంపై ఉన్న దెబ్బలను గుర్తించిన బాధితురాలి తల్లి ప్రశ్నించడంతో విషయం వెల్లడించింది. దీంతో ఈ నెల 30న బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రుద్రూర్ సీఐ శేఖర్ రెడ్డి కేసును దర్యాప్తు చేశారు. నిందితులను మంగళవారం వ్యవసాయ పొలంలో అరెస్టు చేసి విచారించగా అత్యాచారం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. సమావేశంలో రుద్రూర్ సీఐ శేఖర్ రెడ్డి, వర్ని ఎస్సై అంజయ్య పాల్గొన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
► వృద్ధ దంపతుల ఆత్మహత్య ► అనారోగ్యంతోనే అఘారుుత్యం ► కొండాపూర్‌లో విషాదం చిగురుమామిడి : కలకాలం కలిసి ఉంటామని బాస చేశారు ఆ దంపతులు. ఇన్నాళ్లూ కలిసి జీవించినవారు చివరకు మరణంలోనూ కలిసే‘పోయూరు’. అనారోగ్యంతో వృద్ధ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొండాపూర్‌లో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి మల్లయ్య(80), రాజవ్వ (75) దంపతులు. వీరికి ఓదయ్య ఒక్కడే కుమారుడు. ఓదయ్య వ్యవసాయం చేస్తుండగా.. మల్లయ్య చేతనైన పనిచేస్తూ కొడుక్కు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజవ్వ ఇంటివద్దనే ఉంటోం ది. వృద్ధాప్యం పైబడడంతో రాజవ్వకు కళ్లు కనిపించడం లేదు. మరోవైపు మల్లయ్యకు వరిబీజం ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. కొద్దిరోజులుగా ఇద్దరూ తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఎప్పటిలాగే బుధవారం రా త్రి కుటుంబసభ్యులందరూ ఒకేచోట పడుకున్నారు. గురువారం వేకువజామున ఐదు గం టలకు ఓద య్య లేచి చూడగా తల్లిదండ్రులిద్దరూ కనిపించలేదు. ఇంటిముందున్న రేకులషెడ్డులోకి వెళ్లి చూ డగా రాజవ్వ ఉరేసుకుని కని పించింది. మల్లయ్య ఉరేసుకున్నా.. తాడు తెగిపోవడంతో కిందపడిపోరుు ఉన్నాడు. ఓదయ్య రోదిస్తూనే 108కు సమాచారం ఇచ్చాడు. స్థానికులు వచ్చిచూసి ఇద్దరూ చనిపోరుునట్లు గుర్తించారు. దంపతులిద్దరూ ఒకేసారి చనిపోవడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయూరు. ఓదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్రావు తెలిపారు. -
హత్య చేయాలనుకుని.. దొరికిపోయారు!
షాద్‌నగర్ : ఓ మహిళను హత్య చేయడానికి వచ్చిన ముగ్గురు నిందితుల్లో కాలనీవాసులకు ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్‌లోని అనితకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడకు చెందిన రాంచంద్రయ్యతో ఎనిమిదేళ్లుగా వివాేహతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతను సుమారు రూ. 8 లక్షలు ఇచ్చినా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఎలాగైనా ఆమెను హతమార్చాలని బంధువులైన హన్వాడకు చెందిన మల్లయ్య, షాబాద్ మండలం గొల్లూరుకు చెందిన నారాయణతో కలిసి పథకం వేశాడు. షాద్‌నగర్ పట్టణంలోని రైతుకాలనీలో రాంచంద్రయ్య స్నేహితుడు జగన్‌గౌడ్ ఉంటున్నాడు. అతని ఇంట్లో అనిత కొంతకాలంగా పని మనిషిగా చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ముగ్గురూ ఆ ఇంట్లోకి చొరబడి బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఆమె లోపలికి రాగానే దాడిచేసి కింద పడేసి నోట్లో గుడ్డలు కుక్కి హతమార్చడానికి యత్నించారు. బాధితురాలు కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలోనే ప్రధాన నిందితుడు రాంచంద్రయ్య పారిపోగా పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి సీఐ శంకరయ్య చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
బాలిక ప్రసవం కేసులో దర్యాప్తు ముమ్మరం
పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల ధర్నా ఎంఈఓ బసవలింగం సస్పెన్షన్ మాదాపూర్: ప్రభుత్వ పాఠశాలలో బాలిక ప్రసవం కేసు దర్యాప్తును మాదాపూర్ పోలీసులు ముమ్మరం చేశారు. సంఘటనపై పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక అక్క అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె దగ్గర ఉన్న సెల్‌ఫోన్ కాల్‌డాటా ఆధారంగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఎంఈఓ బసవలింగంను సస్పెండ్ చేసి, స్కూల్ టీచర్లకు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. కాగా ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. బాలల హక్కులను కాపాడాలని, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు శరత్ చంద్ర, ప్రసాద్, శివ, సతీష్, సాయిరాం, సందీప్, సునీల్ తదితరులు కోరారు. శిశు విహార్‌కు పసికందు రాయదుర్గం: మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసవించిన విద్యార్థినిని మంగళవారం రెస్క్యూ హోంకు తరలించారు. అలాగే పసికందును శిశువిహార్ సిబ్బందికి అప్పగించారు. మొదట ఉప్పల్‌లో పోలీసులు తల్లి, పసికందును అదుపులోకి తీసుకొని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి ఐసీడీఎస్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. -
భర్త చేతిలో హతం?
రొంపిచెర్ల: భర్త చేతిలో భార్య హతమైంది. ఈ ఘటన రొంపిచెర్ల వుండలం బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజలుపేటలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా కూలికుంటకు చెందిన తస్లీమ్(25), జిలానీ (29)కి ఆరేళ్ల క్రితం వివాహమైం ది. వీరు రొంపిచెర్ల వుండలం ఫజులుపేటలో నివాసముంటున్నారు. జిలాని వెల్డింగ్ పనిచేసేవాడు. వీరికి అవూల్(5), అల్మాన్(3) పిల్లలు. జిలానీ రోజూ తప్పతాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు బంధువులు వచ్చి తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో ఇంటిపైకి వెళ్లి చూశారు. తస్లీమ్ వుంచంపై పడి ఉంది. ఆమెను కదిలిం చినా కదల్లేదు. ఆమె గొంతుచూట్టు గాయూలు ఉండడంతో భర్త జిలానీ ఉరివేసి చంపి వేసి ఉంటాడని స్థాని కులు అనువూనిస్తున్నారు. ఆపై ఆగ్రహంతో జిలానీకి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో పిల్లలు అనాథలయ్యారు. ఎస్ఐ రహీవుుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వానికి డెడ్‌లైన్
రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాల్సిందే లేదంటే ఉద్యమం తప్పదు {పభుత్వానికి కుమార హెచ్చరిక బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవి మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సోమవారం లోపు సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వానికి జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామి డెడ్‌లైన్ విధించారు. లేదంటే ‘జన్మభూమి నుంచి కర్మభూమి వరకు’ పేరుతో డీ.కే రవి స్వస్థలం దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పాదయాత్ర చేపడుతానని ఆయన వెల్లడించారు. డీ.కే రవి ృుతికి సంబంధించిన కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్ర ఒక్కలిగ సంఘంతోపాటు రాష్ట్రంలోని వివిధ ధార్మిక సంస్థల అధిపతులైన స్వామీజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని కువెంపు కళాక్షేత్రం నుంచి ఫ్రీడం పార్కువరకూ శుక్రవారం నిరసన ర్యాలీను నిర్వహించారు. వీరికి విపక్షాలకు చెందిన నాయకులు కూడా తమ మద్దతును తెలియజేశారు. డీ.కే రవి తల్లిదండ్రులతో కలిసి అనంతరం ఫ్రీడం పార్కుృో బహత్సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ... సోమవారం లోపు డీ.కే రవి కేసును సీబీఐకు అప్పగించకుంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పార్టీలకు అతీతంగా పాదయాత్ర చేస్తామని తెలిపారు. డీ.కే రవి కేసును తప్పుదోవ పట్టించడానికే ఒక మహిళా ఐఏఎస్ అధికారి పేరును అనవసరంగా తెరపైకి తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ అధికారిణి మూడు సార్లు డీ.కే రవికి ఫోన్ చేసిందనే నెపంతో విచారణ పేరుతో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ప్రశ్నించిన సీఐడీ అధికారులు...డీ.కే రవికు ఫోన్ చేసి బెదిరించిన మంత్రులు, వారి సంబంధీకులను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. డీ.కే రవికు పోస్ట్‌మార్టం చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఎందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లని ఈ సందర్భంగా కుమారస్వామి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనాయకులతో పాటు వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజలు చేసిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. కాగా, డీ.కే రవి తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఒక్కలిగ సంఘం నాయకులు భరోసా ఇచ్చారు. -
పొదలకూరు సీఐ సస్పెన్షన్
గుంటూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు కేసు దర్యాప్తులో సరైన ఆధారాలను సేకరించడంలో విఫలమైన నెల్లూరు జిల్లా పొదలకూరు సీఐ హైమారావును గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నీలకుల రమేష్ పదేళ్లలోపు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 164-ఏ సీఆర్పీసీ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. 24 గంటల్లోగా బాధిత విద్యార్థినులను వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించడంతోపాటు వారి స్టేట్మెంట్లను సీఐ నమోదు చేయాల్సి ఉంది. పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు కొనసాగించాల్సిన సీఐ పూర్తిగా విఫలమయ్యూరు. దీంతో కోర్టులో కేసు విచారణలో సరైన ఆధారాలు చూపించలేకపోయూరు. అందుకు బాధ్యుడైన సీఐకు నెల్లూరు జిల్లా ఎస్పీ సింథల్కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ 16న వివరణ కోరుతూ మెమో జారీచేశారు. ఎస్పీ కోరిన వివరాలు ఇవ్వడంలోనూ సీఐ విఫలమవ్వడంతో ప్రత్యేక నివేదికలు రూపొందించి ఐజీకి పంపారు. గతంలో కూడా పలు కేసుల విచారణలో సీఐ విఫలమయ్యూరనీ ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా సీఐ హైమారావును సస్పెండ్ చేసి వెంటనే విధుల నుంచి తొలగించాలని ఐజీ ఆదేశాలు జారీ చేశారు. -
హత్యకు గురైంది మేకప్‌మన్ దర్శన్
బెంగళూరు : రాజగోపాలనగరలోని లక్ష్మిదేవి నగరంలో సోమవారం రాత్రి హత్యకు గురైన యువకుడి పేరు, వివరాలను పోలీసులు సేకరించారు. మృతుడిని హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన దర్శన్‌గా గుర్తించామని పోలీసులు గురువారం చెప్పారు. ఇతను కన్నడ టివీ సీరియల్స్‌లో నటించే నటీ నటులకు మేకప్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నెల క్రితం బెంగళూరు చేరుకుని ఇక్కడి నందిని లేఔట్‌లోని బంధువుల ఇంటిలో నివాసముంటున్నాడు. ఒక్కసారి ఉద్యోగానికి వెళితే రెండు, మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చేవాడు. దీంతో అతను ఇంటికి రాకపోయినా దర్శన్ బంధువులు పెద్దగా పట్టించుకొలేదు. సోమవారం రాత్రి దర్శన్‌ను మారణాయుధాలతో దారుణంగా నరికి హత్య చేశారు. బుధవారం రాజగోపాల నగరలోని లక్ష్మిదేవీ నగరలో యువకుడిని దారుణంగా హత్య చేశారని స్థానికులు పదేపదే మాట్లాడుకుంటున్న విషయం దర్శన్ బంధువులకు తె లిసింది. అనుమానం వచ్చి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని చూశారు. హత్యకు గురైంది దర్శన్నేనని గుర్తించారు. హత్యకు కారణాలు తెలియడం లేదని, మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు గురువారం తెలిపారు. -
బాలికపై నవ వరుడి అత్యాచారం
రాయదుర్గం రూరల్ : వివాహమై పక్షం రోజులు కాకముందే ఓ నవ వరుడు ఓ బాలికపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆర్బీవంక గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు..బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు... గ్రామానికి చెందిన దాసానాయక్‌కు 15 రోజుల క్రితం వివాహమైంది. ఇతని ఇంటి సమీపంలోనే ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డగించి, నోటిలో దుస్తులుకుక్కి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి వచ్చి మౌనంగా రోదిస్తుండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. భయపడిన బాలిక అపస్మారస్థితికి చేరుకుంది. దీంతో బాలికను కణేకల్లు ఆర్డీటి ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన ఆర్డీటీ వైద్యులు..అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలికను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చినఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.