బాలికపై నవ వరుడి అత్యాచారం | New groom on girl rape | Sakshi
Sakshi News home page

బాలికపై నవ వరుడి అత్యాచారం

Published Sun, Jun 22 2014 3:09 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

New groom on girl rape

రాయదుర్గం రూరల్ : వివాహమై పక్షం రోజులు కాకముందే ఓ నవ వరుడు ఓ బాలికపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆర్బీవంక గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు..బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు... గ్రామానికి చెందిన దాసానాయక్‌కు 15 రోజుల క్రితం వివాహమైంది. ఇతని ఇంటి సమీపంలోనే ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డగించి, నోటిలో దుస్తులుకుక్కి అత్యాచారం చేశాడు.

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి వచ్చి మౌనంగా రోదిస్తుండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. భయపడిన బాలిక అపస్మారస్థితికి చేరుకుంది. దీంతో బాలికను కణేకల్లు ఆర్డీటి ఆసుపత్రికి  తరలించగా పరీక్షలు నిర్వహించిన ఆర్డీటీ వైద్యులు..అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనంతరం బాలికను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చినఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement