బెంగళూరు : రాజగోపాలనగరలోని లక్ష్మిదేవి నగరంలో సోమవారం రాత్రి హత్యకు గురైన యువకుడి పేరు, వివరాలను పోలీసులు సేకరించారు. మృతుడిని హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన దర్శన్‌గా గుర్తించామని పోలీసులు గురువారం చెప్పారు. ఇతను కన్నడ టివీ సీరియల్స్‌లో నటించే నటీ నటులకు మేకప్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నెల క్రితం బెంగళూరు చేరుకుని ఇక్కడి నందిని లేఔట్‌లోని బంధువుల ఇంటిలో నివాసముంటున్నాడు. ఒక్కసారి ఉద్యోగానికి వెళితే రెండు, మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చేవాడు.
దీంతో అతను ఇంటికి రాకపోయినా దర్శన్ బంధువులు పెద్దగా పట్టించుకొలేదు. సోమవారం రాత్రి దర్శన్‌ను మారణాయుధాలతో దారుణంగా నరికి హత్య చేశారు. బుధవారం రాజగోపాల నగరలోని లక్ష్మిదేవీ నగరలో యువకుడిని దారుణంగా హత్య చేశారని స్థానికులు పదేపదే మాట్లాడుకుంటున్న విషయం దర్శన్ బంధువులకు తె లిసింది. అనుమానం వచ్చి విక్టోరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని చూశారు. హత్యకు గురైంది దర్శన్‌నేనని గుర్తించారు. హత్యకు కారణాలు తెలియడం లేదని, మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు గురువారం తెలిపారు.
హత్యకు గురైంది మేకప్‌మన్ దర్శన్
Published Fri, Nov 7 2014 4:00 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement