హత్య చేయాలనుకుని.. దొరికిపోయారు! | Want to murder a woman, but caught! | Sakshi
Sakshi News home page

హత్య చేయాలనుకుని.. దొరికిపోయారు!

Published Tue, Mar 15 2016 3:21 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

హత్య చేయాలనుకుని.. దొరికిపోయారు! - Sakshi

హత్య చేయాలనుకుని.. దొరికిపోయారు!

షాద్‌నగర్ : ఓ మహిళను హత్య చేయడానికి వచ్చిన ముగ్గురు నిందితుల్లో కాలనీవాసులకు ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్‌లోని అనితకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడకు చెందిన రాంచంద్రయ్యతో ఎనిమిదేళ్లుగా వివాేహతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతను సుమారు రూ. 8 లక్షలు ఇచ్చినా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఎలాగైనా ఆమెను హతమార్చాలని బంధువులైన హన్వాడకు చెందిన మల్లయ్య, షాబాద్ మండలం గొల్లూరుకు చెందిన నారాయణతో కలిసి పథకం వేశాడు.

షాద్‌నగర్ పట్టణంలోని రైతుకాలనీలో రాంచంద్రయ్య స్నేహితుడు జగన్‌గౌడ్ ఉంటున్నాడు. అతని ఇంట్లో అనిత కొంతకాలంగా పని మనిషిగా చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ముగ్గురూ ఆ ఇంట్లోకి చొరబడి బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఆమె లోపలికి రాగానే దాడిచేసి కింద పడేసి నోట్లో గుడ్డలు కుక్కి హతమార్చడానికి యత్నించారు. బాధితురాలు కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతలోనే ప్రధాన నిందితుడు రాంచంద్రయ్య పారిపోగా పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి సీఐ శంకరయ్య చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement