
సాక్షి, షాద్‌నగర్: తెలంగాణలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రియల్టర్ కమ్మరి కృష్ణను అతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.
వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌లోని కేకే ఫామ్‌హౌస్‌లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, కృష్ణ బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఫామ్‌హౌస్ నుంచి బయటకు వస్తుండగా అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. మరోవైపు.. కృష్ణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, కన్వేషన్ సెంటర్లు, ఫామ్‌హౌస్‌లను నిర్వహిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment