మరణంలోనూ వీడని బంధం
► వృద్ధ దంపతుల ఆత్మహత్య
► అనారోగ్యంతోనే అఘారుుత్యం
► కొండాపూర్‌లో విషాదం
చిగురుమామిడి : కలకాలం కలిసి ఉంటామని బాస చేశారు ఆ దంపతులు. ఇన్నాళ్లూ కలిసి జీవించినవారు చివరకు మరణంలోనూ కలిసే‘పోయూరు’. అనారోగ్యంతో వృద్ధ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొండాపూర్‌లో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి మల్లయ్య(80), రాజవ్వ (75) దంపతులు. వీరికి ఓదయ్య ఒక్కడే కుమారుడు. ఓదయ్య వ్యవసాయం చేస్తుండగా.. మల్లయ్య చేతనైన పనిచేస్తూ కొడుక్కు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజవ్వ ఇంటివద్దనే ఉంటోం ది. వృద్ధాప్యం పైబడడంతో రాజవ్వకు కళ్లు కనిపించడం లేదు. మరోవైపు మల్లయ్యకు వరిబీజం ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. కొద్దిరోజులుగా ఇద్దరూ తీవ్ర మనస్తాపంతో ఉన్నారు.
ఎప్పటిలాగే బుధవారం రా త్రి కుటుంబసభ్యులందరూ ఒకేచోట పడుకున్నారు. గురువారం వేకువజామున ఐదు గం టలకు ఓద య్య లేచి చూడగా తల్లిదండ్రులిద్దరూ కనిపించలేదు. ఇంటిముందున్న రేకులషెడ్డులోకి వెళ్లి చూ డగా రాజవ్వ ఉరేసుకుని కని పించింది. మల్లయ్య ఉరేసుకున్నా.. తాడు తెగిపోవడంతో కిందపడిపోరుు ఉన్నాడు. ఓదయ్య రోదిస్తూనే 108కు సమాచారం ఇచ్చాడు. స్థానికులు వచ్చిచూసి ఇద్దరూ చనిపోరుునట్లు గుర్తించారు. దంపతులిద్దరూ ఒకేసారి చనిపోవడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయూరు. ఓదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్‌రావు తెలిపారు.