![Yeddyurappa Says BJP Not Involved In Any Operation To Topple Cong JDS Govt - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/17/yeddy.jpg.webp?itok=Iu-387k5)
సాక్షి, బెంగళూర్ : కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసేందుకు తమ పార్టీ సభ్యులెవరూ ప్రయత్నించడం లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో పాలక సంకీర్ణం, బీజేపీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న పాలక సంకీర్ణ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయడంలేదని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు.
తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్-జేడీఎస్ తమపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తమ పార్టీ నేతలెవరూ ఎలాంటి ఆపరేషన్‌నూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక చోట చేరితే వారెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్గత పోరు అదుపుతప్పిందని, వారి అంతర్గత వైఫల్యాలకు బీజేపీని నిందించడం తగదని యడ్యూరప్ప హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment