అలా అయితే గుండు గీయించుకుంటా
కోలారు:
ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎత్తినహొళె పథకం మూడేళ్లలో పూర్తి అయితే గుండు గీయించుకుంటానని మాజీ ము ఖ్యమంత్రి కుమారస్వామి సవాల్ చేశా రు. శనివారం నగరంలో జేడీఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. బయలు సీమ జిల్లాలకు ఎత్తినహొళె పథకం ద్వారా నీటిని అందించడానికి ప్రయత్నాలు చేస్తుందని. ఇది మూడేళ్లలో పూర్తవుతందని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడమేనన్నారు. ఎత్తిన హొళె ప్రాజెక్టు ప్రభుత్వం చెబుతున్నంత వేగవంతంగా సాగడం లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెండు సంవత్సరాల అవధిలో సాధించింది శూన్యమనాఇ చెప్పారు.
జేడీఎస్ వామ మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తోందని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలను కుమార స్వామి తిప్పికొట్టారు. 2004లో జేడీఎస్ అధికారంలో ఉన్న సమయంలో సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా జేడీఎస్ వామ మార్గంలోనే అధికారంలోకి వచ్చిందని చెప్పగలరా అని సీఎంకు సవాల్ విసిరారు.