Siddaramayya
-
బీజేపీ మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసింది: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్‌కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయలు చెప్పటం వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు బదలు.. ఎన్నికల తర్వాత సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
Karnataka: ఎద్దులబండిలో అసెంబ్లీకి
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును ఖండిస్తూ సోమవారం ఎద్దుల బండిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు విధానసౌధకు ఊరేగింపుగా వచ్చారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలపై భారం వేస్తోందని దుయ్యబట్టారు. ఎద్దుల బండి పోరాటం ద్వారా ప్రజల్లో జాగృతి కల్పించామని తెలిపారు. భారీ సందోహంతో రావడంతో సౌధ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందలాది పోలీసులు మోహరించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. దివంగతులకు సంతాపం శాసనసభా వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం ఇటీవల గతించిన రాజకీయ, సామాజిక ప్రముఖులకు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాగానే సభాధ్యక్షుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. అసంతృప్తి లేదు: యడ్డి బీజేపీ రాష్ట్రాధ్యక్షునితో కలిసి రాష్ట్రమంతటా పర్యటించనున్నట్లు మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా పని చేస్తానని, సంతోషంగానే ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేగా రావడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పక్కన సీట్లో కూర్చోవడానికి స్పీకర్ ఆమోదించారని తెలిపారు. స్వచ్ఛ గాలి ఎక్కడ .. స్వచ్ఛ గాలి పథకంతో బెంగళూరులో రూ.2.67 కోట్లను ఖర్చు చేశారు, స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉందో చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసీ.కొండయ్య పరిషత్‌లో ప్రశ్నించారు. పరిసర మంత్రి ఆనంద్‌సింగ్ తరఫున పరిషత్ నేత కోటే శ్రీనివాసపూజారి సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ గాలి పథకాన్ని బెంగళూరు, దావణగెరె, హుబ్లీ, ధారవాడ, కలబురిగి నగరాల్లో చేపట్టిందన్నారు. 2019 నుంచి 2024 నాటికి గాలిలో ధూళి ప్రమాణాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడమే లక్ష్యమన్నారు. కాగా, చేతనైతే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలను తగ్గించాలని మంత్రి శ్రీరాములు ఆ పార్టీని సవాల్ చేశారు. చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. -
‘ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ కేసును వాడుకుంటోంది’
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19, వరదల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం డ్రగ్స్‌ను కేసును వాడుకుంటోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. అంతేగాక ఈ కేసులో అధికార బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ మంత్రులను, నాయకులను రక్షించుకునే ప్రయత్నం చేస్తుందని ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులను కించపరిచారంటూ తన వరుస ట్వీట్లలో ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని ఆయన సీఎం బీఎస్ యడియూరప్పను కోరారు. కరోనా విజృంభన, వరదల ఉధృతిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా... డ్రగ్స్ కేసును ప్రధానంగా తీసుకోవడం దారణమంటూ #DrugsMuktaKarnataka హ్యాష్ ట్యాగ్‌ను తన ట్వీట్‌కు జోడించారు. అంతేగాక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కూడా స్పందిస్తూ.. ముస్లీం కావడం వల్లే తనను టార్గేట్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో జమీర్ అహ్మద్‌కు కూడా సంబంధం ఉన్నట్లు ప్రముఖ పారశ్రామిక వేత్త ప్రశాంత్ సంబరాగి ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ సంబరాగిపై పరువు నష్టం దావా వేస్తానని ఖాన్ హెచ్చిరించారు. అంతేగాక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాతో సహా కొందరూ బీజేపీ నాయకులను ఇప్పటికీ ఎందుకు విచారించ లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక ఫొటోతో రాజకియ నాయకులపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కన్నడ చిత్ర నిర్మాత లంకేష్ బెంగుళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు(సీసీబీ)కి పరిశ్రమలో మాదక ద్రవ్యాల వాడకంపై సమాచారం ఇవ్వడంతో శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు నటి సంజన గల్రానీ ఆమె తల్లిని కూడా సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని చమరాజ్ పేట ప్రాంతంలోని సీసీబీ కార్యాలయంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ప్రజాతీర్పే పరిష్కారం
‘ఇంకెన్నాళ్లు...?’ అని అందరి చేతా పదే పదే అనిపించుకున్నాక, మూడు వారాలపాటు కాలయాపన చేశాక కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకుంది. అక్కడి రాజకీయ పరిణామాలతో విసుగు చెందిన జనం ఊపిరిపీల్చుకునేంతలోనే మధ్యప్రదేశ్‌లో కుర్చీలాట మొదలైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చేస్తామని బీజేపీ ప్రకటించగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ సవాలుకు జవాబిచ్చారు. ఆ రాష్ట్రంలోని రాజకీయం మరెన్ని మలుపులు తిరుగు తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. కర్ణాటక రాజకీయ చదరంగంలో అటు అధికార పక్షమూ, ఇటు విపక్షమూ రెండూ సాధారణ ప్రజానీకానికి ఏవగింపు కలిగించాయి. నిరుడు మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటినుంచి దినదిన గండంగానే బతుకీడుస్తోంది. 104మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... యడ్యూరప్ప సారధ్యంలో సర్కారు ఏర్పరి చినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. అటుపై 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి డీకే కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభు త్వానికి పాలనపై దృష్టి పెట్టే అవకాశమే కలగలేదు. స్వీయ రక్షణే దాని ఏకైక ఎజెండాగా మారింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని స్వల్పకాలం ఏలిన యడ్యూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేక పోయారు. వెలుపలి నుంచి యడ్యూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ఇలా రగిలిపోతుంటే కుమారస్వామి భరోసాతో ఉండటం ఎలా సాధ్యం? అందుకే ఆయన రాజీనామా చేసి పోతానని అనేకసార్లు బెదిరించారు. ఒక సందర్భంలో కంటతడి పెట్టారు. ఎవరినీ సంతృప్తిపరచలేక, సము దాయించలేక అయోమయానికి లోనయ్యారు. అయినా సిద్దరామయ్యను అదుపు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆయన్ను ఏదోవిధంగా సముదాయించినా ఆ పార్టీలో ఇతరేతర వర్గాలున్నాయి. వాటి డిమాండ్లు వాటికున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూటమి ప్రభుత్వం 14 నెలలు అధికారంలో కొనసాగడం నిజంగా వింతే. ఇప్పుడు యడ్యూరప్ప వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారో, లేదో చూడాల్సి ఉంది. సభకు గైర్హాజరైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో కూడా ఆసక్తికరమే. అయితే యడ్యూరప్ప ఏర్పరిచే ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పదవులు దక్కని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు చేసినట్టే, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించరని చెప్పలేం. 2008లో అధికారంలోకి వచ్చాక బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ము లాటలు ఎవరూ మరిచిపోరు. తొలుత యడ్యూరప్ప, ఆ తర్వాత సదానంద గౌడ, అటుపై జగదీశ్ శెట్టార్లకు అధికార పగ్గాలు అప్పగించినా అసంతృప్తి సద్దుమణగలేదు. పార్టీలో ముఠా తగాదాలు ముదిరిపోగా అధిష్టానం నిస్సహాయంగా మిగిలిపోయింది. చివరకు 2013లో దారుణంగా ఓటమి పాలయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిచేరే కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అండతో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగించగలదో చూడాలి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో వనరులు లేవు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా అదంత సులభమూ కాదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అనుకోవాలి. అసలు ఆ రెండూ ఇప్పుడున్నట్టే మిత్రపక్షాలుగా కొనసాగుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే బీజేపీ తెరవెనక ఉండి ఆడించిన రాజకీయ క్రీడ వల్ల తాము అధికారం కోల్పోయామని ప్రజల ముందు ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడానికి వాటికి అవ కాశం ఉంటుంది. రెండూ కలిసి నడిస్తేనే ఇదంతా సాధ్యం. తగినంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు ఫిరాయింపుల వల్ల కూలిపోవడం విచారించదగ్గ విషయమే. కానీ దేశంలో వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఫిరాయింపుల విషయంలో సూత్రబద్ధమైన వైఖరితో లేవు. ఫిరాయింపుల వల్ల బలైనప్పుడు ఒకలా, వాటివల్ల లబ్ధి పొందే పరిస్థితులున్నప్పుడు మరొకలా మాట్లాడటం ఆ పార్టీలకు అలవాటైపోయింది. సాగినన్నాళ్లు కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ప్రభుత్వాలను పడగొట్టింది. గతంలో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం అందుకున్నాక తానూ ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. ఫిరా యింపుల నిరోధక చట్టం ఆచరణలో పనికిమాలినదని రుజువయ్యాక కూడా కేంద్రంలో అధికారం చలాయించిన ఏ పక్షమూ దాన్ని సరిచేయడానికి పూనుకోలేదు. అలా చేయనివారే నష్టపోయినప్పుడల్లా అన్యాయం జరిగిందని శోకాలు పెడుతున్నారు. తాము అధికారంలోకొచ్చినప్పుడు మళ్లీ ఆ ఫిరాయింపులనే ప్రోత్సహించి, వాటితోనే మనుగడ సాగిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ పరిధి నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి కట్టబెడితే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అది ముందుమునుపూ ఏం సమస్యలు తెచ్చిపెడు తుందోనన్న భయంతో అలాంటి సవరణకు ఏ ప్రభుత్వమూ సిద్ధపడదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పది కాలాలపాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉందామని పార్టీలు భావించనంతకాలమూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫిరాయింపుల్ని, వాటిని ప్రోత్స హించే పార్టీలనూ ప్రజలు ఏవగించుకుంటే పార్టీలు పంథా మార్చుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ రాజకీయ సంతలు, బేరసారాలు కొనసాగక తప్పదు. కర్ణాటకలో ఇప్పుడున్న రాజ కీయ అస్థిరత సమసిపోవాలన్నా, అనైతిక రాజకీయాలకు కళ్లెం పడాలన్నా కొత్తగా ప్రజల తీర్పు కోరడమే శ్రేయస్కరం. అయితే అందుకు ఎన్ని పార్టీలు సిద్ధపడతాయన్నది ప్రశ్నార్థకమే. -
సంక్షేమ ‘భాగ్యం’ చేతికందేనా?
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంటోంది. దక్షిణాదిలో గతంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి గెలుపుకోసం బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకొని దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం నైతిక స్థైర్యాన్ని పెంచుకునే వ్యూహరచనలో నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో కన్నడ ఓటరు నాడి ఎలా ఉంది? సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమేంటి? అయిదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)తో కలసి ‘దక్ష’ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. సంక్షేమ పథకాలపై ప్రజల మాటేంటి? సంక్షేమ పథకాలనగానే గుర్తొచ్చే పేర్లు.. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితలే. అయితే ఇదే బాటలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ప్రజలను ఆకట్టుకునేలా ‘భాగ్య’ పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వీటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోసారి పట్టం గట్టేందుకు అవకాశం ఉందని ఏడీఆర్–దీక్ష సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ప్రారంభించిన ‘అన్న భాగ్య’ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే కిలో బియ్యం అందించే పథకం)కు ఈ సర్వేలో భారీ సానుకూలత వ్యక్తమైంది. ఇది అద్భుతమైనదని 79 శాతం మంది కితాబిచ్చారు. పాఠశాలలనుంచి ఆడపిల్లల డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు వారికి ఉచితంగా సైకిళ్లను ఇచ్చే ‘సైకిల్ భాగ్య’ పథకం పట్ల కూడా 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వాన నీటిని సంరక్షించి సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడుల్ని పెంచే ‘కృషి భాగ్య’ బాగుందని 58% మంది రైతులు చెప్పారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించే ‘అనిల్ భాగ్య’ భేష్ అని 66 శాతం మంది అన్నారు. వెనుకబడిన, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన నవదంపతులకు 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే ‘షాదీ భాగ్య’ పథకంపై కూడా 45 శాతం మంది సంతృప్తి ప్రకటించారు. తమిళనాడు ‘అమ్మ క్యాంటీన్’ల స్ఫూర్తితో గతేడాది ఆగస్టులో ఇందిర క్యాంటీన్ల పథకం మాత్రం ఆశించినంతగా ప్రజాదరణ పొందలేదని ఈ సర్వేలో తేలింది. 36 శాతం మంది ఇందిర క్యాంటీన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తే 31 శాతం మందే ఈ పథకం బాగుందన్నారు. పదికి 7 మార్కులు ఈ సర్వేలో సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఆయన పనితీరుకు 10కి 7 మార్కులు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు తేడాల్లేకుండా అత్యధికులు వివిధ రంగాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పాఠశాలల నిర్వహణ (7.85), విద్యుత్ సరఫరా (7.83), ప్రజా రవాణా (7.61), అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువుల పంపిణీ (7.35), ఉద్యోగ అవకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. అయితే, ఈ ‘భాగ్య’ పథకాలు సిద్ధరామయ్యకు మరోసారి ‘భాగ్యా’న్నిస్తాయో లేదో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే. సిద్దరామయ్య సంక్షేమ పథకాలు అన్నభాగ్య కృషి భాగ్య సైకిల్ భాగ్య అనిల్ భాగ్య షాదీ భాగ్య క్షీర భాగ్య వసతి భాగ్య ఆరోగ్య భాగ్య ఇందిరా క్యాంటీన్లు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కర, కమల సమరాంగణం
నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పును కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. కర్ణాటకలోనే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే పూర్వకాలంలో అయితే మైసూర్ రాజ్యం మీద అయోధ్య పాలకుల దండయాత్ర అని పేరు పెట్టొచ్చు. కానీ 2018 నాటి రాజకీయ పరిభాషలో అయితే మాటల యుద్ధం అంటే సరిపోతుంది. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరు ప్రాంతం వారే కూడా. ఆయనతో మాటల యుద్ధానికి తలపడినవారు యోగి ఆదిత్యనాథ్. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. గడచిన ఒక నెల నుంచి యోగి తనకున్న సమయాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటకల కోసం సమంగా వెచ్చిస్తున్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు కర్ణాటక కూడా గుజరాత్ మాదిరిగానే ప్రాణం నిలబడేటట్టు చేయగలిగేదేనని అనిపిస్తుంది. పశ్చిమ భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తన పార్టీ బీజేపీ కోసం విశేషంగా ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోను ఆయన ఎన్నికల నగరాను మోగించినట్టే కనిపిస్తోంది. అక్కడ మరో ఐదు మాసాలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికలలో యోగి ప్రచారం వల్ల పార్టీకి ఎంతో లబ్ధి చేకూరింది. కమలం పరిస్థితి గడ్డుగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 35 సభలలో ఆయన పాల్గొన్నారు. వాటిలో 22 నియోజక వర్గాలు కమలం ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కర్ణాటకలో గెలుపు కూడా బీజేపీకి కీలకమే. ఎందుకంటే దక్షిణాదిన అడుగు మోపడానికి ఆ పార్టీకి ప్రధాన ద్వారంలా పని చేస్తున్నది కర్ణాటకే. మరొక అంశం కూడా ఉంది. ఇప్పుడు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో ఉన్న పెద్ద రాష్ట్రాలు రెండంటే రెండే. మొదటిది పంజాబ్, రెండోది కర్ణాటక. ఈ విషయం కూడా బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తూ, కచ్చితంగా గెలిచి తీరాలన్న కసిని పెంచుతోంది. యోగి వెంట కర్ణాటక కర్ణాటకలో యోగి పాల్గొన్న నవ కర్ణాటక పరివర్తన యాత్ర చిత్రాలను చూస్తే ఆయన నాయకత్వంలో నడవడం అనివార్యమన్నది స్పష్టమవుతుందని కర్ణాటక శాఖ నాయకులే అంగీకరిస్తున్నారు. ఆ చిత్రాలలో ఒకదాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వినమ్రంగా యోగి ముందు చేతులు జోడించి, కొంచెం ముందుకు వంగి కనిపిస్తారు. యోగి కటాక్ష వీక్షణాలతో కనిపిస్తారు. పార్టీ అధిష్టానం కరుణను పొందడానికి కూడా ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు కూడా అయిన యడ్యూరప్పకు ఇంతకు మించిన ప్రచారం మరొకటి దొరకదు. కానీ ప్రస్తుతం కథల ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోనే అసలు సమస్య. కొన్ని మాసాల నుంచి ఆ సమస్య మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యర్థి బీజేపీని విమర్శించడానికి, ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ సదవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. లింగాయత్‌లకు హిందువేతరులన్న స్థాయి కల్పించాలన్న ప్రతిపాదనకు సిద్ధరామయ్య మద్దతు ఇచ్చారు. లింగాయత్‌లు కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్నారు. సంప్రదాయకంగా వీరు బీజేపీ మద్దతుదారులు. యడ్యూరప్ప కూడా ఆ వర్గానికి చెందిన ప్రముఖుడే. వీరికి రాష్ట్రంలో ఓబీసీ హోదా ఉంది. లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన సంస్కర్త బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తారు. బసవన్న అని అంతా పిలుచుకునే బసవేశ్వరుడు హిందూ సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినవారు. ఆ క్రమంలోనే ప్రత్యేకమైన ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అదే వీరశైవం. ఈ పరిణామమే లింగాయత్ శాఖ సంప్రదాయ హిందూ ధర్మానికి చెందినది కాదన్న వాదనకు దారి తీసింది. ఈ వాదనకే కాంగ్రెస్ మద్దతు చెబుతోంది. దీనితో ఆ వర్గంలో చీలిక వచ్చింది. ఇదే బీజేపీని ఇరకాటంలోకి నెడుతోంది. ఆ వర్గం ఓటుబ్యాంక్‌ను కోల్పోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. లింగాయత్‌లను హిందూయేతర శాఖగా గుర్తించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సిద్ధరామయ్య ఆ విషయం గురించి మళ్లీ పట్టించుకోకపోయినా, ఆ వర్గానికి చెందిన కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. ప్రత్యేక మతశాఖగా గుర్తించాలన్న డిమాండ్‌కు వెనుక కొన్ని ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. ఆ వర్గం నడుపుతున్న విద్యా సంస్థలకు మైనారిటీ హోదా లభిస్తుంది. రుణమాఫీ పేరుతో కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కులం ఆధారంగా సిద్ధరామయ్య వేసిన ఈ ఎత్తుకు పై ఎత్తు వేయాలని, మతం ఆధారంగా బీజేపీ కథనాలు ఆరంభించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆదిత్యనాథ్ రంగ ప్రవేశం చేయడంతోనే వారి గెలుపునకు మత కథనం పాఠ్యాంశమయింది. స్థలపురాణాలతో సమరం నవ కర్ణాటక పరివర్తన యాత్రలో యోగి దర్శనమిచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల గోదాను హనుమాన్, టిప్పుసుల్తాన్ల బరిగా మార్చేశారు. ఈ రాష్ట్రం నుంచి ప్రజలు కాంగ్రెస్‌ను కనుక పంపివేస్తే, ఇక టిప్పును తలుచుకునేవారే ఉండరని యోగి అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో హనుమంతుడు, ఇతర మహర్షులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను ఆరాధిస్తారే తప్ప, టిప్పు సుల్తాన్‌ను కాదని మీరు స్పష్టం చేస్తారని కూడా అన్నారు. ప్రస్తుతం కర్ణాటక అని పిలుచుకుంటున్న చోటే హనుమంతుడు జన్మించాడన్న విశ్వాసం ఆధారంగా యోగి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం హంపీలో ఉండే ఆంజనేయ పర్వతం మీదే మారుతి జన్మించాడు. కర్ణాటక పశ్చిమ తీరంలోని గోకర్ణ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉండే ఒక కొండ మీద ఉన్న గుహ ఆయన జన్మస్థలమని చెప్పే స్థల పురాణం కూడా ఉంది. అయితే అంజనీపుత్రుడి జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పే కథలు కూడా వినిపిస్తాయి. మారుతి జన్మించిన గడ్డ మీద టిప్పు పేరుతో ఉత్సవాలు జరపడం ఏమి సబబని బీజేపీ ప్రశ్నిస్తోంది. టిప్పు మహమ్మదీయ పాలకుడని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తరం యోధులలో ఒకడు కూడా కాదని చెప్పడమే ఈ ప్రచారం లక్ష్యం. అలాగే టిప్పు ఉత్సవాలు జరపడం సమర్థనీయమేనని కాంగ్రెస్ చేత చెప్పించడం కూడా. తద్వారా ఆ పార్టీ ముస్లిం అనుకూల పార్టీ అని ముద్ర వేసి, హిందూ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడమే బీజేపీ వ్యూహం. అయితే ఉత్తరాదిన పనిచేసిన ఈ వ్యూహం వింధ్య పర్వతాలకు ఇవతల దక్షిణాదిన ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి. టిప్పు మీద కన్నడిగుల దృష్టి వేరు అయితే ఉత్తరాది నాయకత్వం అవలంబిస్తున్న ఈ తరహా వ్యూహంతో కర్ణాటక పార్టీ శాఖలోని వారంతా ఏకీభావం ఉన్నవారు కాదు. రాష్ట్ర బీజేపీ నేతలు ఎంత చెబుతున్నా కన్నడ ప్రాంత హిందువులు చాలామంది టిప్పును కరుడు గట్టిన మహమ్మదీయునిగా పరిగణించడం లేదు. పైగా మైసూర్ సింహంగానే చూస్తున్నారు. గుజరాత్లో వలెనే చర్చను ఎవరు మంచి హిందువు, లేదా ఎవరు పెద్ద హిందువు అన్న విషయం వరకు తెచ్చి పలచన చేశారు. ‘నా పేరేమిటి? సిద్ధరామ. నా పేరులోనే రాముడు ఉన్నాడు. మనం రామ జయంతి, హనుమత్ జయంతి జరుపుతాం. అలాగే టిప్పు జయంతి కూడా జరుపుతాం. అందరి జయంతులు మనం జరుపుకుంటాం’ అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి. అయితే సమీకరణలను మార్చే ఇలాంటి కథనం వల్ల కర్ణాటక కోస్తా తీరంలో బీజేపీకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతం బీజేపీకి కంచుకోట. ఈ పరిణామాలతో ఆ బలం మరింత పటిష్టమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎజెండా మర్మమేమిటో వివరించే ప్రయత్నం చేయకుండా యోగి ఆదిత్యనాథ్‌ను సోషల్ మీడియా కేంద్రంగా ఇరుకున పెట్టేందుకు చూస్తున్నది. దీనితో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆన్లైన్లో వ్యంగ్య విమర్శలు, చురకలు వేసుకుంటూ మాటల యుద్ధానికి దిగే పరిస్థితి ఏర్పడింది. ‘మీరు మా నుంచి నేర్చుకోవలసింది చాలానే ఉంది సార్! మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు మా ఇందిరా క్యాంటీన్‌ను, రేషన్ దుకాణాన్ని పరిశీలించండి. మీ రాష్ట్రంలో జరుగుతున్న ఆకలిచావులకు పరిష్కారం ఏమిటో అవి మీకు తెలిసేటట్టు చేస్తాయి’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఇందుకు, ‘మీ కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా మీ హయాంలో చాలా ఎక్కువ జరిగాయని విన్నాను. మీరు వాటిని పట్టించుకోకుండా నిజాయితీపరులైన అధికారులను బదలీచేయడం మీద దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ మిత్రులు సృష్టించిన విషాదాన్ని తుడిచిపెట్టడానికి కృషి చేస్తున్నాను’ అంటూ యోగి కూడా స్పందించారు. గుజరాత్ బాటలోనే ఎవరు నిజమైన హిందువు, ఎవరు పెద్ద హిందువు అన్న అంశం కూడా ముందుకు వచ్చింది. హిందువులు గోమాంసం తినరాదంటూ యోగి చెప్పడం గురించి కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘సిద్ధరామయ్య హిందువు కాలేరు. ఎందుకంటే ఆయన గోమాంస భక్షణ చేయవచ్చునని చెబుతారు. సిద్ధరామయ్య కనుక హిందువే అయితే ఆయన హిందుత్వ గురించి మాట్లాడితే ఆయన గోమాంస భక్షణ చేయకూడదు. గోవధను అనుమతించరాదు’ అని యోగి అన్నారు. ఇందుకు సిద్ధరామయ్య ఇలా చెప్పారు, ‘చాలామంది హిందువులు గోమాంసం తింటారు. నేను కూడా తినాలనుకుంటే తింటాను. గోమాంసం తినవద్దని నాకు చెప్పడానికి వారు ఎవరు? కానీ నేను తినను. ఎందుకంటే నాకు రుచించదు కాబట్టి తినను.’ ఈ ధోరణి నుంచి కర్ణాటక బీజేపీ ఎప్పుడు బయటపడుతుంది? యోగి ముందుకు తెస్తున్న చిన్న చిన్న అంశాల నుంచి ఎప్పుడు దృష్టి మళ్లించుకుంటుంది? రాష్ట్ర పార్టీ శాఖలో ఐక్యత లేదు. ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పనే ప్రతిపాదిస్తున్నారు. కానీ, పార్టీ ఎంతో కీలకమని భావిస్తున్న వచ్చే ఎన్నికల సమరంలో నాయకులందరినీ కలుపుకుని పోగల సత్తా ఆయనకు ఉందా లేదా అన్నది ఇప్పటికీ సందేహమే. పార్టీలో పెద్ద తలలు లెక్కకు మించి ఉన్నాయి. ఎవరి ఆశలు, స్వప్రయోజనాలు వారివే. అయితే ఎన్నికలకు కాస్త ముందు అనంత్‌కుమార్ హెగ్డేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు యడ్యూరప్పలో అభద్రతాభావాన్ని కలగచేస్తున్నాయి. ఇందుకు కారణం ఉంది. వివాదాస్పద ప్రకటనలకు పేర్గాంచిన ఈ డాక్టరు పార్టీ ఆశయం మేరకే అలా వ్యహరిస్తున్నారు. కర్ణాటక ఎప్పుడూ రాజకీయ నాటకానికి ప్రసిద్ధి. ఒక విభజన అంకానికి ఈ వేసవి వేదిక కావచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సిద్ధరామయ్యది తుగ్లక్ పాలన
బీజేపీ అధికారంలోకొస్తే ఎస్టీ కమిషన్ ఏర్పాటు యడ్యూరప్ప లింగసూగూరు : రాష్ట్రంలో సిద్దరామయ్య తుగ్లక్ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం పట్టణ శివార్లలోని నారాయణపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వాల్మీకి పరివర్తన సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పలు ప్రజోపయోగ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అహింద మంత్రాన్ని జపిస్తూ వెనుకబడిన, దళిత, మైనార్టీ వర్గాల నోట్లో మట్టి కొడుతోందన్నారు. పథకాలు కేవలం ప్రకటనకు పరిమితమయ్యాయని, వాటికవసరమైన నిధులందించడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాల్మీకి సముదాయం ఐకమత్యంగా బీజేపీకి మద్దతు తెలిపి 150 స్థానాల్లో గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘పిల్లలను విద్యావంతులను చేసే బాధ్యత మీది, వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది’ అని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజూగౌడ సమావేశానికి అధ్యక్షత వహించగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప, నేతలు జగదీష్ శెట్టర్, ఆర్.అశోక్, ఎంపీలు బీ.శ్రీరాములు, శోభా కరంద్లాజే, కరడి సంగణ్ణ, భగవంత్ కూబా, ఎమ్మెల్యేలు సీఎం ఉదాసి, సీటీ రవి, కే.శివనగౌడ నాయక్, తిప్పరాజు హవల్దార్, అరవింద లింబావళి, సురేష్‌బాబు, నాయకులు గోవింద కారజోళ, కృష్ణప్ప, రేణుకాచార్య, గురుపాటిల్, దొడ్డనగౌడ పాటిల్, జెడ్పీ అధ్యక్షురాలు వీరలక్ష్మి, ప్రముఖులు ఎన్.శంకరప్ప, పాపారెడ్డి, సిద్దు బండి, దొడ్డనగౌడ, రేవునాయక బెళమగి, ఎస్కే బెళ్లుబ్బి, సోమలింగప్ప, కే.విరుపాక్షప్ప, శివరామేగౌడ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శరణప్పగౌడ జాడలదిన్ని, తాలూకా అధ్యక్షుడు దొడ్డనగౌడ హొసమని, ప్రభు హవల్దార్లతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీఎం ఫొటోను ‘చెప్పు’తో కొట్టారు
బెంగళూరు: భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని అరెస్టు చేయాలని, అమ్నెస్టీ సంస్థను నిషేధించాలని పేర్కొంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు కర్ణాటకలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కోల్పోయారు. బాగల్కోటెలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల కన్నుగప్పి రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై. మేటి ఇంట్లోకి చొచ్చుకువెళ్లారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులకు ఆ ఇంట్లో సిద్దరామయ్య ఫొటో కనిపించింది. అంతే సంయమనం కోల్పోయిన నిరసనకారులు ఫొటోను చెప్పుతో కొట్టారు. అంతేకాక అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకు నేతృత్వం వహించిన కుమార్ హీరేమఠ్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో వేరే ప్రాంతాలకు తరలించారు. అనంతరం నిరసనకారులు దాదాపు గంటపాటు అమాత్యుడి ఇంటిముందు నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక సంఘటన గురించి తెలుసుకొని అక్కడికి వచ్చిన మంత్రి ఉమాశ్రీ మీడియాతో మాట్లాడుతూ... శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయాలని కోరారు. సంయమనాన్ని కోల్పోయి ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు. -
ఏక్షణంలోనైనా ప్రభుత్వం పడిపోవచ్చు !
= మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు = కాంగ్రెస్‌లో సిద్ధూ మాట ఎవరూ ఖాతరు చేయడం లేదు = కర్ణాటక ముక్త కాంగ్రెస్‌ను ఆ పార్టీ నేతలే చేసుకుంటున్నారు = జీఎస్టీ బిల్లుకు వచ్చే లోక్‌సభ సమావేశాల్లో ఆమోదం = కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ బళ్లారి (గుల్బర్గా) : రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తుంటే ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుల్బర్గాలో అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సిద్దరామయ్య మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత అసమ్మతి పెరిగిపోయిందన్నారు. దీంతో ఏకంగా సీఎం కుర్చీ కదిలే పరిస్థితే కాకుండా మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను పూర్తిగా లేకుండా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ముక్త కర్ణాటక చేయాలని ప్రయత్నం చేస్తోందని, అయితే తాము చేయాల్సిన పనిని కాంగ్రెస్ పార్టీ నేతలే చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని వారు, మంత్రి వర్గం నుంచి తొలగించిన వారు కలిసికట్టుగా యుద్ధం ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉందని, దీంతో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అవినీతి పరులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన సిద్దరామయ్య మరింత ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించి, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులకే పట్టం కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి మాటను ఏ మంత్రులు ఖాతరు చేయడం లేదన్నారు. అధికారులు, మంత్రుల మధ్యనే సమన్వయం లేదని గుర్తు చేశారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నాయని, అయితే తమిళనాడులో ఓ లోక్‌సభ మెంబరు కొంత వ్యతిరేకత వ్యక్తపరిచారని, అయితే ఆ సమస్యను కూడా అధిగమిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అలా అయితే గుండు గీయించుకుంటా
కోలారు: ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎత్తినహొళె పథకం మూడేళ్లలో పూర్తి అయితే గుండు గీయించుకుంటానని మాజీ ము ఖ్యమంత్రి కుమారస్వామి సవాల్ చేశా రు. శనివారం నగరంలో జేడీఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. బయలు సీమ జిల్లాలకు ఎత్తినహొళె పథకం ద్వారా నీటిని అందించడానికి ప్రయత్నాలు చేస్తుందని. ఇది మూడేళ్లలో పూర్తవుతందని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడమేనన్నారు. ఎత్తిన హొళె ప్రాజెక్టు ప్రభుత్వం చెబుతున్నంత వేగవంతంగా సాగడం లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెండు సంవత్సరాల అవధిలో సాధించింది శూన్యమనాఇ చెప్పారు. జేడీఎస్ వామ మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తోందని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలను కుమార స్వామి తిప్పికొట్టారు. 2004లో జేడీఎస్ అధికారంలో ఉన్న సమయంలో సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా జేడీఎస్ వామ మార్గంలోనే అధికారంలోకి వచ్చిందని చెప్పగలరా అని సీఎంకు సవాల్ విసిరారు. -
పా(డి)డు చేయొద్దు
సామాజిక వర్గాల మధ్య తేడా చూపరాదని బీజేపీ హితవు రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ ఎస్సీ, ఎస్టీ నిధుల వినియోగంపై అభ్యంతరం లేదన్న విపక్షం ప్రోత్సాహకంపై పాలక పక్షానికి జేడీఎస్ మద్దతు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించడం సోమవారం శాసన సభలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఒకానొక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్లు సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రికి దళితులపై అంత ప్రేమ ఉంటే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిని చేయాలని శెట్టర్ సవాలు విసిరారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ. ఎస్టీ పాడి రైతులకు రూ.2 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. సామాజిక వర్గాల మధ్య తేడా చూపడం ప్రభుత్వానికి సరికాదని హితవు పలుకుతూ, అన్ని వర్గాల రైతులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రోత్సాహకాన్ని ఇచ్చే ప్రతిపాదన పరిశీలన దశలో ఉందని, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వివరణ ఇచ్చారు. ఈ దశలో అధికార పార్టీకి చెందిన సభ్యులు కల్పించుకుంటూ బీజేపీ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. బీజేపీ సభ్యులు కూడా లేచి నిల్చుని వారితో వాదనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే జయచంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన రూ.200 కోట్లలో రూ.93 కోట్లు మాత్రమే ఖర్చయిందని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే ప్రోత్సాహకం ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. బీజేబీ సభ్యుడు సీటీ. రవి దీనికి అభ్యంతరం చెబుతూ, ఎస్సీ, ఎస్టీలకు భూములు, ఆవులను ఇవ్వండని సూచిస్తూ, ఆ వర్గాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారికి కేటాయించిన నిధులున్నప్పుడు, ప్రోత్సాహకం ఇస్తే తప్పేమిటని అన్నారు. దీని వల్ల సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని శెట్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులందరికీ ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘సమాజంలో అసమానతలను ృష్టించిందే’ మీరే అంటూ, ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకం ఇస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శెట్టర్, సీఎంలు పలుమార్లు సవాళ్లు విసురుకున్నారు. సభ అదుపు తప్పుతోందని గ్రహించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభ్యులను శాంతింపజేశారు. అనంతరం మాట్లాడిన జేడీఎస్ సభ్యుడు వైఎస్వీ. దత్తా ఎస్సీ, ఎస్టీలకు రూ.2 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంపై ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, దీనికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. -
గడువు ఐదు నెలలే...
చెత్త డంపింగ్‌పై మండూరు ప్రజల సడలింపు మాట తప్పితే పోరాటాలు తప్పవని దొరస్వామి హెచ్చరిక రాష్ర్ట రాజధానిలో పోగవుతున్న చెత్తను మండూరు వద్ద డంప్ చేయడానికి ఐదు నెలల వరకు అవకాశం కల్పించారు. తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ చెత్తను డంప్ చేయనివ్వబోమని స్థానికులు తేల్చి చెప్పారు. మంగళవారం బెంగళూరులో మండూరు ప్రజలతో సీఎం సిద్ధరామయ్య చర్చలు జరిపారు. చర్చల్లో బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మేయర్ కట్టే సత్యనారాయణ, స్వాత ంత్ర సమరయోధుడు దొరస్వామి పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐదు నెలల తర్వాత మండూరులో చెత్త డంప్ చేయబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీ లిఖితపూర్వకంగా హామీనివ్వడంతో మండూరు వాసులు సమ్మతించారు. ఈ లోపు మండూరుకు మంచి నీటి సరఫరా, ఉచిత వైద్యం, దోమల నివారణ, అంటు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హమీనిచ్చింది. ప్రతి వారం సమీక్ష నిర్వహించి స్థానికుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు దొరస్వామి తెలిపారు. మాట తప్పితే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. -
కేంద్రం సహకరించాలి
సీఎం సిద్ధరామయ్య మోడీకి పూర్తిగా సహకరిస్తాం ‘అక్రమ-సక్రమ’నియమావళి సిద్ధం త్వరలో అమలు చేస్తాం రాష్ర్ట రాబడి 13 శాతం పెరిగింది విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదు త్వరలో పలు ఉద్యోగాల భర్తీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నందున రాజ్యాంగ బద్ధంగా కేంద్రం రాష్ట్రాలకు సహకరించి తీరాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని విధాన సౌధలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సాధన బాటలో ఏడాది-చెప్పినట్లే నడుచుకున్నాం’ పేరిట వివిధ శాఖల సాధనలతో కూడిన 108 పుటల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉండడం కాకతాళీయమని, అయితే అభివృద్ధికి, దీనికి సంబంధం ఉండబోదని అన్నారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నానని చెబుతూ, ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. అదే విధంగా తమకూ సహకారం లభిస్తుందని ఎదురు చూస్తున్నామని చెప్పారు. అక్రమ-సక్రమకు నియమావళి బెంగళూరులో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన అక్రమ-సక్రమ పథకానికి నియమావళిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే అక్రమ-సక్రమను అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వ ఏడాది సాధనలను వివరించారు. పన్ను రాబడి తగ్గిందన్న విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదంటూ, 13 శాతం పెరిగిందని తెలిపారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశలవారీ నెరవేరుస్తామని చెప్పారు. దేశంలో అభివృద్ధి సాధించిన తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కర్ణాటకకు చోటుండాలనేది తమ లక్ష్యమన్నారు. గుడిసె రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. పోస్టుల భర్తీ రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. ఇంకా 8,500 మంది పోలీసు సిబ్బంది, 816 మంది ఎస్ఐలను నియమిస్తామన్నారు. కాగా బెంగళూరు మెట్రో రైలు తొలి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. రెండో దశకు కేంద్రం రూ.26,405 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. -
ముళ్లబాటేనా..!
సీఎం సిద్ధరామయ్యకు అగ్ని పరీక్ష పార్టీ లక్ష్యాన్ని అందుకోలేక పోయిన నాయకులు నిరుత్సాహాన్ని మిగిల్చిన ఫలితాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే అగ్ని పరీక్షలా ఎదురైన లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చాయి. ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించలేక పోయినందుకు అధిష్టానం ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. కనీసం 20 స్థానాల్లో విజయం సొంతం చేసుకోవాలని, లేన ట్లయితే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధిష్టానం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అసోంలో పేలవమైన ఫలితాల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేయడం కూడా సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచుతోంది. అధిష్టానం ఆమోదించేదీ, లేనిదీ తర్వాత...ముందుగా నామమాత్రంగానైనా ఆయన రాజీనామా లేఖను పంపించాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు పార్టీలోని అసమ్మతి వాదుల నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలను ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అధికారంలోకి వచ్చిందిప్పుడే కదా, అంత త్వరగా విమర్శలు చేస్తే ఎలా...చేసినా అధిష్టానం ఊరకుంటుందా అని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన ప్రత్యర్థులు, ఇక విజృంభించనున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా మైసూరులో ఓడిపోవడం సీఎంకు ఊహించని పరిణామం. తన అనుయాయులైన మంత్రులకు మాత్రమే ముఖ్యమంత్రి అండదండలు అందిస్తున్నారని పార్టీలో విమర్శలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీనియర్లను సంప్రదించలేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం సీఎంకు కొంత ఊరట అనే చెప్పాలి. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఆనవాయితీ లేదు. కనుక సీఎం కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఓటమితో సొంత పార్టీలోని ప్రత్యర్థులనే కాకుండా, ఘన విజయం కారణంగా ఉత్సాహంతో ఉరకలేస్తున్న కమలనాథులను ఎదుర్కోవడం సీఎంకు అంత సులభం కాదు. -
ఊహల్లో నేతలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో గెలుపు అంచనాలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నిమగ్నమయ్యాయి. 1957 తర్వాత భారీగా పోలింగ్ నమోదు కావడంతో... ఇది దేనికి సంకేతమో అర్థం కాక పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారుకు వ్యతిరేంగా ఓటర్లు స్పందించారని బీజేపీ చెబుతుంటే, సిట్టింగ్ ఎంపీలకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ర్టం నుంచి 20 సీట్లు తప్పక గెలిపించి ఇస్తానని అధిష్టానానికి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని తేలిన నేపథ్యంలో, ఆ నష్టాన్ని కర్ణాటక నుంచి భర్తీ చేయాలని అధిష్టానం సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. అధికారంలో ఉండడం, ఇంకా ఏడాది పూర్తి కాకపోవడం...లాంటి కారణాల వల్ల కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశాల్లేవని పార్టీ భావిస్తోంది. కేంద్రంలో అధికారం వైపు దూసుకు పోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి కళ్లెం వేయాలంటే, కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. తాను అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, బీజేపీకి ఆ ఛాన్సు ఇవ్వకూడదనే దిశగా కాంగ్రెస్ ఆలోచనలు సాగుతున్నాయి. అవసరమైతే తృతీయ ఫ్రంట్‌కు వెలుపలి నుంచి మద్దతునిచ్చి, బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కనుక బీజేపీకి ఎక్కువ విజయావకాశాలున్న కర్ణాటకలో, ఆ పార్టీని దెబ్బ కొట్టాలని అధిష్టానం ఇదివరకే సీఎంకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు ఇరవైకి పైగా స్థానాల్లో గెలుపొందుతామని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హీన పక్షం 17 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. బీజేపీకి పెట్టని కోటల్లా ఉన్న పలు నియోజక వర్గాల్లో కూడా ఈసారి గెలుపును సొంతం చేసుకుంటామని వారు ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపు ఖాయమనే విశ్వాసంతో ఉంది. మోడీ ప్రభంజనం కారణంగానే భారీ పోలింగ్ నమోదైనట్లు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎంకు ఎన్నికల కమిషన్ మందలింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గురువారం మందలించింది. దీనిపై సీఎం ఇచ్చిన వివరణను తిరస్కరించింది. భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. గత నెల 23న సిద్ధరామయ్య మైసూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీని నర హంతకుడిగా అభివర్ణించారు. క్షమాపణ చెప్పను..: మోడీ నర హంతకుడని తానెప్పుడూ చెప్పలేదని, మోడీ సర్కారు నర హంతక ప్రభుత్వమని మాత్రమే చెప్పానని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మోడీకి తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చారు. మైసూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను అనని మాటలకు ఎందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాగా తనకు వివాహమైనట్లు నామినేషన్‌ను దాఖలు చేసిన సందర్భంగా మోడీ1 అఫిడవిట్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌ను గెలిపించండి
కార్యకర్తలకు సీఎం సిద్ధరామయ్య పిలుపు రాయచూరు లోక్‌సభ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున ప్రచారం 11 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేసి చూపాం బీజేపీని నమొద్దు యాదగిరి, న్యూస్‌లైన్ : ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిం చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన యాదగిరి జిల్లాలోని షాపూర్, భీమరాయనగుడి పట్టణాలలో రాయచూరు లోక్‌సభ అభ్యర్థి బీవీ.నాయక్ తరఫున ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంనుద్దేశించి మాట్లాడారు. మతతత్వ బీజేపీ, ఏకనాయకత్వంపైనే నమ్మకం పెట్టుకున్నారని, అయితే కాంగ్రెస్ లౌకిక పార్టీ అని, మైనార్టీలు, దీన, దళిత, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కొప్పళ, రాయచూరు, గుల్బర్గా, బీదర్ సహా అన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు శాయశక్తులా కృషి చేయాలన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మోడీ ధనవంతుడని, అందుకే ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిందని అన్నారు. 2002లో గుజరాత్లో గోద్రా నరమేధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీపై మాజీ మంత్రి రాందాస్ చేసిన వ్యాఖ్యలను సిద్ధు ఖండించారు. ప్రధాని పదవి వ రించినా ఆమె సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. అలాంటి నాయకురాలిపై ఆరోపణలు చేసే నైతికత బీజేపీ నాయకులకు లేదన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు మాజీ మంత్రి రాందాస్‌పై ఉన్నాయని, ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి అవసరం లేదన్నారు. కోబ్రా పోస్ట్ సంస్థ కార్యాచరణ వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందన్నారు. తాను రైతు సంఘం పోరాటం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించానని, అందువల్ల రైతులపై చులకనగా మాట్లాడే వ్యక్తిత్వం కాదన్నారు. ఆరభావికి చెందిన రైతు విఠల్ విషం తాగి మరణించాడని, అతను విషం తాగడానికి ప్రభుత్వం కారణం కాదని మాత్రమే తాను వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే కిలో బియ్యం పథకం, బడిపిల్లలకు పాలు, రైతుల రుణాల మాఫీ, అహింద వర్గాలకు వడ్డీతో సహా రుణాల మాఫీ చేశామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్టికల్-371 కు సవ రణ చేశామన్నారు. ఇప్పటికే రూ.1600 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. కేవలం 11 నెలల్లో రాష్ట్రంలోని పేదల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సాధన ఏమిటో చెప్పాలన్నారు. ముస్లిం మైనార్టీలపై మొసలి కన్నీరు కార్చుతున్న బీజేపీని నమ్మరాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీవీ.నాయక్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి శివనగౌడ నాయక్‌పై చట్టప్రకారం కేసు నమోదైందన్నారు. శివనగౌడ మాటలు పట్టించుకోకుండా ప్రజల కష్టనష్టాలపై స్పందించి బీవీ.నాయక్‌కే ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని సీఎం కోరారు. మాజీ మంత్రి ఇబ్రహీం, మంత్రి బాబురావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రాజా వెంకటప్ప నాయక్, డాక్టర్ ఏబీ మాలకరెడ్డి, అల్లమ ప్రభు పాటిల్, మరిగౌడ హులికల్, చంద్రశేఖర్ ఆర్.బోళ, మాజీ మంత్రి శరణబసప్పగౌడ దర్శనాపూర్, డాక్టర్ బసవరాజ్ ఇజేరి, సురపుర, షాపూర్లతో పాటు జిల్లాకు చెందిన వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ‘సెల్ఫ్ గోల్’
సిద్దు, పరమేశ్వర్ నోటి దురుసు బెడిసికొడుతున్న విమర్శలు రైతులు, ఒక్కలిగల ఆందోళన విపక్షాల చేతికి బలమైన అస్త్రాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం సాక్షి, బెంగళూరు : సిద్ధరామయ్య, పరమేశ్వర్ అనాలోచితంగా చేస్తున్న విమర్శలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయి. బెల్గాంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో చెరుకు మద్దతు ధర చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు విఠల్ అరభావి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ప్రత్యర్థులకు ఇదే ప్రధాన అస్త్రమైంది. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించాయి. వాటిని తిప్పి కొట్టే యత్నంలో భాగంగా కొడుగు జిల్లా నాపోక్లూహళ్లిలో సీఎం సిద్దు బుధవారం మాట్లాడుతూ.. ‘విషం తీసుకోవడం వల్ల విఠల్ చనిపోలేదు.. మద్యం తాగడం వల్లే మరణించాడు.. అతని మరణానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు.’ అని తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యల పట్ల అటు విపక్షాల్లోనే కాకుండా స్వపక్షంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధరామయ్య అనాలోచితంగా మాట్లాడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విఠల్ మద్యం తాగి మరణిస్తే ప్రభుత్వం ఎందుకు రూ. పది లక్షలు పరిహారంగా చెల్లించిందంటూ కుమారస్వామి ప్రశ్నించారు. మరోవైపు రైతు సంఘాలు కూడా ముఖ్యమంత్రి తీరుపై మండిపడుతున్నాయి. సీఎం సిద్ధు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఈ నెల 10న రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, విఠల్ భార్య సిద్దవ్వ కంకణవాడి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భర్త మరణానికి సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వమే కారణం. చనిపోయిన వారి విషయంలో అవహేళనగా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి.’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తప్పు తెలుసుకున్న సిద్ధు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేనెప్పుడు రైతులను అవమానపరిచేలా మాట్లాడలేదు. నా మాటలను మీడియా వక్రీకరించింది’ అంటూ చెప్పుకొచ్చారు. పరమేశ్వరపై ఒక్కలిగల ఆగ్రహం.. మాజీ ప్రధాన మంత్రి హెడీ దేవెగౌడపై కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘దేవెగౌడ ఎప్పుడు విషం తాగుతారా అని ఎదురుచూస్తున్నా’ అని పరమేశ్వర్ అనడంపై రాష్ర్టంలోని ఒక్కలిగలు మండిపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఒక్కలిగ సంఘం సభ్యులు, పదాధికారులు పరమేశ్వర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మాజీ ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా.. సీనియర్ రాజకీయ నేత అయిన దేవెగౌడ పట్ల అవహేళనగా మాట్లాడిన పరమేశ్వర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోవాలని రాష్ట్ర ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు అప్పాజిగౌడ, క్షమాపణ చెప్పడంతో పాటు కేపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ నాగరాజు డిమాండ్ చేశారు. -
విమర్శల జడి
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పదునెక్కుతున్న విమర్శనాస్త్రాలు దేవెగౌడపై పరమేశ్వర ఘాటు విమర్శలు సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డ దేవెగౌడ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు పదునెక్కుతున్నాయి. బుధవారం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఇక్కడి శివాజీ నగరలో ప్రచారం చేసిన సందర్భంగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ చేసిన విమర్శలు కొద్ది పాటి దుమారాన్ని రేపాయి. దేవెగౌడ ప్రతి సారి తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చెప్పి మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతుంటారని పరమేశ్వర ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే విషం తాగుతానని కూడా ఆయన బెదిరించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. వచ్చే జన్మలో ముస్లింల కుటుంబంలో పుడతానని చెప్పిన గౌడ, ఇప్పుడే ఆ మతంలోకి మారిపోతే అడ్డుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు. మరో వైపు దేవెగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విరుచుకు పడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల సీఎం హాసనలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై చేసిన విమర్శలపై విరుచుకు పడ్డారు. టమోటా, బంగాళా దుంపలు అమ్ముకునే వారు కోట్లకు ఎలా పడగలెత్తారని సీఎం ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కోట్ల రూపాయలు సంపాదించాననడానికి సీఎం వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడకుండా నాలుకను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన దేవెగౌడ, జేడీఎస్ కథలు ముగిసి పోయాయని పలువురు భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాగా కొప్పళ నియోజక వర్గంలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. -
అంతా అవినీతే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెళ్లిన చోటల్లా, అవినీతి గురించి ఉపన్యాసాలు దంచేస్తున్నారని, తీరా ఆయన మంత్రి వర్గంలోనే అత్యంత అవినీతి పరులున్నారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన మంత్రి వర్గంలో ఉన్న అవినీతి పరులపై ముఖ్యమంత్రి మొదట దృష్టి సారిస్తే మంచిదని సూచించారు. మంత్రి డీకే. శివ కుమార్‌కు అనేక అవినీతి కుంభకోణాలలో సంబంధం ఉందనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనపై సీబీఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ చేత దర్యాప్తు జరిపించడానికి ఎవరు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు వంటివని విమర్శించారు. కాగా దక్షిణ కన్నడ స్థానాన్ని మిత్ర పక్షానికి కేటాయించామని, కొప్పళలో కాంగ్రెస్‌కు మద్దతునిస్తామని చెప్పినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని తెలిపారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘ఆప్’ను తేలికగా తీసుకోవడం లేదు లోక్‌సభ ఎన్నికల్లో తాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని తక్కువగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సభలో గళమెత్తడానికి ఆ పార్టీ యువకులను బరిలో దింపిందని చెప్పారు. కాగా రాష్ర్టంలో బీజేపీ కేవలం నరేంద్ర మోడీ ఆకర్షణపై ఆధారపడి ఉందన్నారు. తద్వారా 23 సీట్లు గెలుస్తామనే అంచనాలో ఉందని తెలిపారు. మరో వైపు జేడీఎస్ ఒక సీటు కూడా గెలవకుండా చూస్తామని సీఎం ప్రకటిస్తున్నారని అన్నారు. వీటినంతా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వనున్నారు కనుక మే 16 వరకు వేచి చూడాలని ఆయన సూచించారు. -
వ్యక్తిగత దూషణలొద్దు
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ హితవు పలికారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఏక వచన ప్రయోగం తగదన్నారు. కాంగ్రెస్‌లో ఎందరో నాయకులు తనతో గౌరవంగానే మసలుకుంటున్నారని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒక్క స్థానం కూడా గెలవబోదని సీఎం జోస్యం చెప్పడాన్ని సవాలుగా స్వీకరిస్తున్నామని తెలిపారు. తాను, కుమార స్వామి కార్యకర్తల సమావేశాల్లో భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చడంపై కూడా సీఎం చులకనగా మాట్లాడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు తెలిసిన వారెవరూ అలా మాట్లాడరని అన్నారు. కావేరి నదీ జలాలు సహా అంతర్ రాష్ట్ర వివాదాలపై జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పక్కనున్న తమిళనాడులో అందుకనే ప్రాంతీయ పార్టీలకు పట్టం కడుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాగా పదేళ్ల పాటు కేంద్రంలో నిరాటంకంగా అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ల గురించి ప్రస్తావించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. -
రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
‘మండ్య’లో తారస్థాయికి చల్లార్చడంపై కేపీసీసీ దృష్టి ఎస్ఎం, అంబి వర్గాల మధ్య విభేదాలు రమ్యకు సహకరించని ఆత్మానంద ఎస్ఎంతో సిద్ధు, పరమేశ్వర భేటీ ‘కృష్ణ’ రాయబారం చేయాలంటూ ఒత్తిడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో అసంతృప్తిని చల్లార్చడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మండ్య జిల్లా నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ అభ్యర్థి రమ్య పుట్టి ముంచేట్లు ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు ముందుగా ఆ స్థానంపై దృష్టి సారించారు. ప్రస్తుతం సింగపూర్‌లో చికిత్స పొందుతున్న మండ్య జిల్లాకు చెందిన మంత్రి అంబరీశ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్మానంద వర్గాల మధ్య విభేదాలున్నాయి. ప్రచారం సందర్భంగా రమ్యకు ఆత్మానంద వర్గం నుంచి సహకారం అందడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయనకు కేంద్ర మాజీమంత్రి ఎస్ఎం. కృష్ణ అండదండలున్నాయి. ఎన్నికల సమయంలో ఆత్మానందను చూస్తూ ఊరుకుంటే పార్టీలో క్రమశిక్షణ లోపించడంతో ఎన్నికల్లో నష్టం వాటిల్లడం ఖాయమనే అభిప్రాయం అంబరీశ్ తదితరుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆత్మానందను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనికి ఎస్ఎం. కృష్ణ ఆమోద ముద్ర కోసం సీఎంతో పాటు పరమేశ్వర గురువారం ఇక్కడి సదాశివనగరలోని ఆయన నివాసానికి వెళ్లారు. మండ్య విషయమై చర్చించారు. అయితే ఆత్మానందను తొలగించడానికి ఆయన సమ్మతించ లేదని తెలిసింది. నచ్చజెప్పి పార్టీకి పని చేసే విధంగా చూడాలే తప్ప, తొలగిస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. ‘ఆ బాధ్యతేదో మీరే చేపట్టండి’ అని చెప్పి వారిద్దరూ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే సందర్భంలో ఒక్కలిగ సామాజిక వర్గం ప్రాబల్యం కలిగిన నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని కూడా కృష్ణను కోరినట్లు తెలిసింది. మండ్య ఉప ఎన్నికలో అందరూ కలసి కట్టుగా పని చేసినందునే కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవగలిగిందని, ఇప్పుడు కూడా ఆ ఐక్యతను తీసుకు రావాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
లోక్‌సభ ఎన్నికల తర్వాతా నేనే ముఖ్యమంత్రి
సిద్ధరామయ్య వెల్లడి విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు మోడీకి ఓటమి భయం అందుకే రెండు స్థానాల్లో పోటీ మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. అలాగైతే లోక్‌సభ ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహించగలుగుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జేడీఎస్‌కు ఉనికే లేదని, బీజేపీలో అవినీతిపరులున్నారని విమర్శించారు. మైసూరులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా తనకు అప్రతిష్ట తెచ్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. మోడీకి భయం : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పుకుంటున్న ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రెండు చోట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని సవాలు విసిరారు. గుజరాత్లో మోడీ అవినీతికి పాల్పడి రూ.కోట్లు వెనకేసుకున్నారని, ఆ ధనాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో నరమేధానికి పాల్పడిన మోడీని శివునితో పోల్చడం హాస్యాస్పదమన్నారు. -
సాకారం కానున్న ఉభయ జిల్లావాసుల కల
నేడు చిక్కబళ్లాపురంలో ఎత్తినహొళె పథకానికి శంకుస్థాపన విచ్చేయనున్న సీఎం సిద్ధరామయ్య పథకం అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు 28 టీఎంసీల నీరు లభ్యం పరమశివయ్య నివేదికలో భాగమే ఎత్తినహొళె కోలారు/చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నిత్యం కరువు కోరల్లో చిక్కుకునే కోలారు, చిక్కబళ్లాపురం జిల్లావాసుల స్వప్నం సాకారం కాబోతోంది. ఈ రెండు జిల్లాలకు శాశ్వత తాగు, సాగునీటిని అందించేందుకు రూపొందించిన ఎత్తినహొళె పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం చిక్కబళ్లాపురంలోని బీజీఎస్ వర్డ స్కూల్ మైదానంలో ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉభయ జిల్లాలతో పాటు బయలు సీమ జిల్లాలకు సాగునీటిని అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. నీటిపారుదల రంగం నిపుణుడు పరమశివయ్య నివేదికను అమలు చేసి పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే నేత్రావతి నీటిని బయలు సీమ జిల్లాలకు మళ్లించాలని ప్రజలు, రైతు సంఘాలు, సంఘ సంస్థలు ఉద్యమించాయి. పోరాటాల ఫలితంగా గత బీజేపీ ప్రభుత్వం పరమశివయ్య నివేదికలోని ఒక భాగమైన ఎత్తిన హొళె పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అప్పట్లో రూ. 8 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచి ఎత్తినహొళె పథకానికి కేబినెట్లో ఆమెదం తెలిపింది. టెండర్ ప్రక్రియ పూర్తవ్వడంతో నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎంబీ.పాటిల్, కేంద్రమంత్రులు వీరప్పమొయిలీ, కేహెచ్.మునియప్ప, మాజీ ప్రధాని హెచ్డీ.దేవెగౌడ, జిల్లా ఇన్చార్జ్మంత్రి రోషన్‌బేగ్, రవాణాశాఖా మంత్రి రామలింగారెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి యుటీ.ఖాదర్, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్‌శెట్టర్, డీవీ.సదానందగౌడ జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ విశాల్ తదితరులు పాల్గొనున్నారు. ఎత్తినహొళె పథకానికి అనేకులు వ్యతిరేకం : ఇదిలా ఉండగా ఎత్తినహొళె పథకాన్ని ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే చేపడుతోందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఎత్తినహొళె ప్రారంభాన్ని బ్లాక్‌డేగా పరిగణించి శాశ్విత నీటిపారుదల పోరాట సమితి ఆందోళనలు చేస్తోంది. పరమశివయ్య నివేదిక అమలు ద్వారా తమ ప్రాంతానికి నీటి సమస్య ఎదురువుతుందని, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ కన్నడ జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చారు. పరమశివయ్య నివేదికలో భాగమే.. : మధ్య కర్ణాటకలోని బయలుసీమ జిల్లాల్లో భవిష్యత్తులో భయంకర క్షామం ఏర్పడుతుందని యోచించిన నీటిపారుదల రంగం నిపుణుడు డాక్టర్ పరమశివయ్య 30 ఏళ్ల క్రితమే పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే 2500 టీఎంసీల నీటిలో 120 టీఎంసీల నేత్రావతి నీటిని బయలుసీమలోని 9 జిల్లాలకు మళ్లించాలని ప్రభుత్వానికి నివేదికను అందించారు. కానీ పాలకులు ఆ నివేదికను మూలన పడేశారు. -
హామీలు అమలు చేస్తున్నాం
తొలి ఏడాదే 65 హామీలు అమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా జాగ్రత్తలు రైతు సంక్షేమమే లక్ష్యం శాసన సభలో సీఎం సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. క్రమశిక్షణ పాటించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. శాసన సభలో బడ్జెట్‌పై సాగిన సుదీర్ఘ చర్చకు బుధవారం ఆయన సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కొట్టి పారేస్తూ, తన ప్రభుత్వ సాధనలను ఏకరువు పెట్టారు. కర్ణాటక చరిత్రలోనే...చెప్పినట్లు నడుచుకోవడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని వెల్లడించారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో 165 హామీలిచ్చామని చెబుతూ, తొలి ఏడాదే 65 హామీలను అమలు చేశామని తెలిపారు. 2014-15 బడ్జెట్లో 30 హామీలను నెరవేర్చనున్నట్లు ప్రకటించామని గుర్తు చేశారు. ఏలకులు, ద్రాక్ష, వక్క రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని చర్చ సందర్భంగా సభ్యులు కోరారని, దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఆపన్న హస్తం అందించడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఆహారోత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలను చేపడతామని ప్రకటించారు. 2013-14లో ఆహారోత్పత్తి 131 లక్షల టన్నులని వెల్లడించారు. వర్షాధార పంటలను ప్రోత్సహించడానికి కృషి భాగ్య పథకం కింద రూ.500 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం మాని వ్యవసాయానికి తగినంత సహాయ సహకారాలు అందించే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. కర్ణాటక పాడి సమాఖ్యకు తొలిసారిగా రూ.1,400 కోట్ల సబ్సిడీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్‌ను సభ మూజవాణి ఓటుతో ఆమోదించింది. అంతకు ముందు ముఖ్యమంత్రి సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించకుండా, పరిశీలిస్తామంటూ అన్నిటినీ దాట వేసిన ందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ తెలిపారు. పంటల సాగుపై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి,బెంగళూరు : వ్యవసాయ విధానంలో వచ్చిన నూతన ఆవిష్కరణలపై దూరవిద్యా ద్వారా శిక్షణ ఇవ్వడానికి బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఔత్సాహిక రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదవడం, రాయడం వచ్చిన రైతులు ఎవరైనా ఇందుకు అర్హులు. వివరాల కోసం 08023418883 లేదా 9449551060,9449044975 లో సంప్రదించవచ్చు. -
28 నుంచి ‘పీణ్యా-సంపిగే’ మెట్రో పరుగులు
1 నుంచి ప్రయాణికులకు అనుమతి 10 కిలోమీటర్ల దూరం.. పది స్టేషన్లు తొలుత మూడు బోగీల రైలు ‘స్మార్ట్ కార్డు’ వారికి టికెట్ ధరలో డిస్కౌంట్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి సాక్షి, బెంగళూరు : సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ‘పీణ్యా-సంపిగే’ మార్గంలో మెట్రో సేవలు ఈనెల 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. తర్వాతి రోజు అంటే మార్చి ఒకటి నుంచి ఇందులో ప్రయాణించడానికి ప్రజలకు అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్న పీణ్యా-సంపిగే మార్గంలో పది స్టేషన్లు ఉంటాయన్నారు. మొదట ఈ మార్గంలో మూడు బోగీలు గల రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందులో సుమారు 975 మంది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి వీలువుతుందని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల స్పందనను బట్టి బోగీల, సమయం పెంపు విషయమై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే మెట్రో రైలు గరిష్టవేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లకు పెంచామన్నారు. ప్రస్తుతం ఓల్వో బస్సులో పిణ్యా నుంచి సంపిగే వరకూ చేరుకోవ డానికి ప్రయాణికులు రూ.45 చెల్లిస్తున్నారన్నారు. అదే సాధారణ బస్సులో రూ.16 వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే ఈ రెండు మార్గాల మధ్య మెట్రో రైలులో ధరను రూ.23గా నిర్ణయించామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు పొందిన ప్రయాణికులకు ప్రయాణ ధరలో 15 శాతం రాయితీ కూడా దొరుకుతుందని తెలిపారు. ఈ మార్గంలోని స్టేషన్లలో వాహనాలకు పార్కింగ్ కల్పించే విషయమై బీబీఎంపీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అస్కార్ ఫెర్నాండెజ్, మల్లిఖార్జున ఖర్గే, వీరప్పమొయిలీ తదితరులు పాల్గొననున్నారన్నారు. సీఎం సిద్ధరామయ్యతో కలిసి వీరు మెట్రోరైలులో రాజాజీనగర స్టేషన్ నుంచి పిణ్యా వరకూ ప్రయాణించి అక్కడి నుంచి సంపిగే స్టేషన్‌ను చేరుకోనున్నట్లు రామలింగారెడ్డి వివరించారు. -
పాల ఉత్పత్తిలో నంబర్ వన్ కావాలి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పాల ఉత్పత్తి లక్ష్యం 60 లక్షల లీటర్లకు పెరగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకాంక్షించారు. బెంగళూరు-తుమకూరు రహదారిలోని నైస్ జంక్షన్ వద్ద ఉన్న నైస్ మైదానంలో శనివారం నిర్వహించిన నందిని పాలు ఉత్పత్తిదారుల బృహత్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాల ఉత్పత్తిలో గుజరాత్ ప్రథమ స్థానం, కర్ణాటక రెం డో స్థానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజూ 55 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోందంటూ, 60 లక్షల లీటర్లకు పెంచడం ద్వారా తొలి స్థానంలో నిలవాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడుగా, పశు సంవర్ధక శాఖ మం త్రిగా పని చేసిన తనకు పశు పోషణ ఎంత కష్టమో తెలుసునని చెప్పారు. కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడీ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. సంస్థకున్న మంచి పేరును కాపాడుకోవాలని సూచించారు. రైతులు తమ వినియోగానికి ఉంచుకుని మిగిలిన పాలను కేఎంఎఫ్‌కు పోయాలని కోరారు. రైతులకూ పౌష్టికత అవసరమన్నారు. విద్యార్థుల కోసం క్షీర భాగ్య పథకాన్ని అమలు చేయడం ద్వా రా కేఎంఎఫ్‌ను నష్టాల బారి నుంచి తప్పించామని ఆయన వెల్లడించారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... కేఎంఎఫ్‌తో తమ కుటుంబానికి 15 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో తన తండ్రి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే కేఎంఎఫ్ బ్రాండ్ అయిన నందిని ఉత్పత్తుల కోసం ప్రచారం చేశారని తెలిపారు. తాను కూడా తండ్రి బాటలో పయనిస్తున్నానని చెప్పారు. ఇంత వ ుంది ప్రజల ఆశీర్వాదమే తనకు సంభావన అని పేర్కొన్నారు. ఈ బృహత్ సమావేశంలో తనకు జరిగిన సన్మానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కేఎంఎఫ్ అధ్యక్షుడు జీ. సోమశేఖర రెడ్డి, ఎండీ ఏఎస్. ప్రేమనాథ్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో గాలికుంటు వ్యాధి నియంత్రణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చన్నపట్టణ తాలూకా కన్నమంగల వద్ద పశు ఆహారోత్పత్తి కేంద్రానికి శంకు స్థాపన చేశారు. నందిని ప్రత్యేక పాలును కూడా విడుదల చేశారు. -
వ్యవసాయం అవసరం
సంక్షోభంలో సేద్యం.. : సీఎం లాభదాయక రంగం కాకపోవడమే కారణం అగ్రికల్చర్‌పై యువత విముఖత రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయమే ఎక్కువ గిట్టుబాటు కాక ఊర్లకు ఊర్లే ఖాళీ 50 శాతం గ్రామీణులు వలస సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వ్యవసాయంపై రాను రాను రైతులకు మొహం మెత్తుతోందని, లాభదాయకం కాకపోవడమే దీనికి కారణమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఎవరో పాత తరం వారు తప్ప యువత వ్యవసాయం పట్ల పూర్తి విముఖతతో ఉందని తెలిపారు. ఇది అపాయకరమైన పరిణామమని, వ్యవసాయాన్ని ఆకర్షణీయమైన రంగంగా తీర్చి దిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విధాన సౌధలోని బాంక్వెట్ హాలులో బుధవారం ఆయన పలువురు రైతులకు వ్యవసాయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, రైతులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, అవన్నీ సాఫల్యం కావాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ఎక్కువని, దీనిని దృష్టిలో ఉంచుకునే వాన నీటి సంరక్షణ చర్యలకు రూ.500 కోట్లను కేటాయించామని వివరించారు. గతంలో వర్షాలు బాగా పడడంతో పాటు పంటలూ బాగా పండేవని గుర్తు చేసుకున్నారు. రైతులు నెమ్మదిగా, సంతోషంగా ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్నాయని తెలిపారు. తమ ఊర్లోనే 50 శాతం మంది వలస పోయారని వాపోయారు. కొందరు విద్యావంతులై ఊరు వదలగా, మరి కొందరు వ్యవసాయంపై ఆధారపడి బతకలేమని వెళ్లిపోయారని తెలిపారు. కుటీర పరిశ్రమలు నాశనమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణులు వలసలు పోతున్నందున, పట్టణాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఈ వలసలను నివారించడానికి వ్యవసాయాన్ని లాభదాయకంతో పాటు ఆకర్షణీయంగా మలచాల్సిన అనివార్యత ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ శాఖ కేవలం ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం కోసమే కాకుండా రైతులకు అన్ని విధాలా సాయపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామలింగా రెడ్డి, రమానాథ్ రై, కృష్ణ బైరేగౌడ ప్రభృతులు పాల్గొన్నారు. -
కేటాయింపు ఘనం.. ఖర్చు స్వల్పం
బడ్జెట్‌పై శెట్టర్ వాగ్బాణాలు నిధులను సమర్థంగా వినియోగించుకోలేని సర్కార్ గత బడ్జెట్లో 57 శాతం నిధులు మాత్రమే వినియోగం ఈ స్వల్ప కాలంలో నిధులు ఖర్చు చేయడం సాధ్యమేనా? త్వరగా ఖర్చు చేయాలని చూస్తే..నిధుల దుర్వినియోగం ఖాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు.. ఖజానా ఖాళీ ప్రధాన రంగాలకు ప్రాధాన్యత కరువు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులైతే ఘనంగానే ఉన్నా, ఆ మొత్తాలను ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించ లేకపోతోందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ విమర్శించారు. శాసన సభలో సోమవారం ఆయన 2014-15 బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో జనవరి ఆఖరు వరకు 57 శాతం మాత్రమే ఖర్చయిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెలన్నర మాత్రమే ఉందని, ఈ స్వల్ప కాలంలో 43 శాతం నిధులను ఖర్చు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఈ మొత్తాన్ని ఖర్చు చేయజూస్తే డబ్బంతా మూడో వ్యక్తి పాలవుతుందని హెచ్చరించారు. ప్రధాన ఉద్దేశం నెరవేరదన్నారు. తన హయాంలో ఈ కాలానికి 70 నుంచి 80 శాతం నిధులను ఖర్చు చేశామని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందా...అనే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడం లేదని, డబ్బు ఎక్కడి పోతున్నదో అంతుబట్టడం లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గత ఏడాది బడ్జెట్ రూపకల్పనలో సమయం లేకపోయిందని అనుకున్నామని, ఈ ఏడాది కావాల్సినంత సమయం ఉన్నా ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి విఫలమయ్యారని, పన్ను సేకరణ లక్ష్యాన్ని సాధించలేక పోయారని విమర్శించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, ఆంతరంగిక కలహాలు... తదితర కారణాల వల్ల ఆయన పాలనపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారని ఆరోపించారు. తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారనే కీర్తిని గడించిన ముఖ్యమంత్రి, తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారని నిష్టూరమాడారు. -
సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి
= సీఎంకు రామదాసు లేఖ సాక్షి, బెంగళూరు : ‘తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన రాజకీయతకే మచ్చ తెచ్చేలా ప్రేమకుమారి అనే మహిళ నాపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి.’ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాజీ మంత్రి ఎస్ఎ రామదాసు లేఖ రాసారు. ఈ నెల 14న ఆయన రాసిన లేఖ మీడియాకు ఆదివారం అందింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజకీయ కుట్రతోనే తన ప్రత్యర్థులు ఇందులో ఇరికించారని, ఆ మహిళతోపాటు కొంతమంది బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా చేయాలని లేఖలో సిద్ధరామయ్యను ఆయన కోరారు. -
బాదుడుండదు!
నేడు రాష్ట్ర బడ్జెట్ పథకాలకు స్వల్ప మార్పులు.. మరిన్ని మెరుగులు పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్ విధాన సౌధలో తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సిద్ధు అరుదైన ఘనత దక్కించుకోనున్న సీఎం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభలో శుక్రవారం 2014-15 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక శాఖను ఆయనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిదో సారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నందున, ఆ ఖ్యాతి రాష్ట్రంలో తొలిసారిగా ఆయనకు దక్కనుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున, ముఖ్యమంత్రి పలు వరాలు కురిపిస్తారనే అంచనాలున్నాయి. 50 కొత్త తాలూకాల ఏర్పాటు, ప్రతి తాలూకాలో ప్రాథమిక సదుపాయాల కల్పనకు తలా రూ.5 కోట్లు, వ్యవసాయానికి వడ్డీ రహిత రుణాల గరిష్ట మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంపు లాంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. పేద కుటుంబాల్లో జన్మించిన ఆడ పిల్లల కోసం అమలవుతున్న భాగ్యలక్ష్మిలో కొన్ని మార్పులు చేయాలని కూడా సంకల్పిస్తోంది. పీయూసీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ఏపీఎల్ కార్డుదారులకు తక్కువ ధరకు రేషన్ లాంటి వ రాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కొత్త పన్నులు విధించడానికి ముఖ్యమంత్రి సాహసించబోరని వినవస్తోంది. బీబీఎంపీ విభజన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను రెండుగా విభజించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. బడ్జెట్లో దీనిపై ప్రకటన చేస్తానని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ప్రతీకార’ ప్రణాళికలు !
యడ్యూరప్ప ఓటమికి రాజకీయ ఎత్తుగడలు శివమొగ్గ నియోజకవర్గంపై ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించిన సిద్దు ? బలమైన అభ్యర్థి కోసం గాలింపు శివమొగ్గ, న్యూస్‌లైన్ : శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం బీఎస్.యడ్యూరప్పను సొంత ఊరిలోనే ఓడించి రాజకీయంగా మట్టికరిపించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య రహస్య ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. మొదటి నుంచి యడ్యూరప్పకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య సత్సంబంధాలు అంతంతమాత్రమే. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధు తీవ్ర విమర్శలు చేసేవాడు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిద్ధు ముఖ్యమంత్రి కాగా యడ్యూరప్ప ప్రతిపక్షస్థానంలో ఉన్నారు. నాటి ప్రతీకారానికి పర్యవసానం : గత విధానసభ ఎన్నికల్లో వరుణా విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిద్ధరామయ్యను ఓడించడానికి యడ్యూరప్ప తన వ్యక్తిగత కార్యదర్శి సిద్దలింగస్వామిని బరిలోకి నిలిపాడు. అయినా అంతిమంగా సిద్ధునే వరించింది. శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి యడ్యూరప్ప పోటీ చేస్తుండటంతో ప్రతీకారం తీర్చుకోడానికి శివమొగ్గపై ప్రత్యేక దృషి సారించారు సిద్ధరామయ్య. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలతో, ఇంటెలిజెన్స్ ద్వారా నియోజకవర్గ సవ ూచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు.. కుల సమీకరణలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జేడీఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎవ రనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. మంత్రి కిమ్మనె రత్నాకర్‌ను పోటీ చేయాలని సూచించారు. తాను దగ్గరుండి గెలిపిస్తానని సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే రత్నాకర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన కాగోడు తిమ్మప్ప పోటీ చేస్తే యడ్యూరప్పకు గట్టి పోటీ ఉంటుందని, జేడీఎస్ సైతం మద్దతు తెలిపే అవకాశం ఉండటంతో కాగోడును ఎన్నికల్లో పోటీ చేయించడానికి ఒత్తిడి తెస్తున్నారు. అయితే తాను లోక్‌సభ బరిలో నిలబడేది లేదని కాగోడు స్పష్టం చేసినట్లు సమాచారం. -
విభజన్!
బీబీఎంపీని రెండుగా చీల్చే యోచన సాధక బాధకాలను సమీక్షిస్తాం ఈ సారి బడ్జెట్లో ప్రకటన రాజ కాలువలకు ఇరువైపులా ఆర్సీసీ గోడ కాలువలపై 77 చోట్ల ఫ్లైఓవర్లు సీఎం సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను రెండుగా విభజించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పూర్తి చేసిన, చేపట్టనున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన బీబీఎంపీని విభజించాలనే ప్రతిపాదన పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందన్నారు. దీనిపై సాధక బాధకాలను సమీక్షించిన తర్వాత ఈ నెల 14న శాసన సభలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ప్రకటిస్తామని వెల్లడించారు. నగరంలో వాన నీటి ముంపును అరికట్టడానికి రూ.85 కోట్ల వ్యయంతో రాజ కాలువలకు ఇరువైపులా ఆర్సీసీ గోడల నిర్మాణానికి ఆమోదం తెలిపామని చెప్పారు. రాజ కాలువలున్న 77 చోట్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తామని తెలిపారు. ఓకలీపురం జంక్షన్ నుంచి ఫౌంటెన్ సర్కిల్ వరకు ఎనిమిది బాటల సొరంగ మార్గం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామని వెల్లడించారు. భూ సేకరణకు ఇప్పటికే రూ.77 కోట్లు విడుదలైందని, ఈ ప్రాజెక్టుకు రూ.187 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. కాగా నగరంలోని రెసిడెన్సీ రోడ్డు, విశ్వ మాన్య రోడ్డు, మ్యూజియం రోడ్డు, కన్నింగ్‌హాం రోడ్డు, సిద్ధయ్య పురాణిక్ రోడ్డు, జేసీ రోడ్డు, నృపతుంగ రోడ్డు సహా 12 రోడ్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. -
అభ్యర్థుల ఎంపికపై.. కసరత్తు
సిద్దు, పరమేశ్వర్ నేడు ఢిల్లీకి పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ‘ఎంపిక’పై చర్చ సిట్టింగ్‌లకు టికెట్ ఖాయం 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పాట్లు ఒక్కో స్థానంలో ముగ్గురు, నలుగురు ఆశావహులు మేడమ్ ఆమోద ముద్రే ఫైనల్ అసమ్మతి చెలరేగే ప్రమాదం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీలో గురువారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో పాల్గొనడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు సీనియర్ నాయకులు మధుసూదన్ మిస్త్రీ, వయలార్ రవిలు మొత్తం 28 నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలను గెలుచుకుంది. కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గ), వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), కేహెచ్. మునియప్ప (కోలారు)లతో పాటు చామరాజ నగర ఎంపీ ధ్రువ నారాయణ్, మైసూరు ఎంపీ విశ్వనాథ్, బీదర్ ఎంపీ ధరం సింగ్‌లు తిరిగి పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. వీరికి తోడు సదానంద గౌడ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ జయప్రకాశ్ హెగ్డే, ఇటీవల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన డీకే. సురేశ్ (బెంగళూరు గ్రామీణ), నటి రమ్య (మండ్య)లకు తిరిగి పార్టీ అభ్యర్థిత్వాలు దక్కనున్నాయి. మిగిలిన 19 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను సూచిస్తూ జాబితాను సిద్ధం చేసింది, దీనిపై విస్తృతంగా చర్చించడం ద్వారా తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. దానిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక పోవడం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల గెలుపుపై చాలా మందికి భరోసా ఉండడంతో టికెట్ల కోసం పోటీ ఎక్కువైంది. వీరప్ప మొయిలీతో పాటు రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా తమ తనయులకు టికెట్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరాజయాల పరంపరను మూటగట్టుకుంటూ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జనార్దన పూజారి ఈసారి ఎలాగైనా మంగళూరు టికెట్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, మొయిలీ ఆయనకు మోకాలొడ్డుతున్నారు. -
ఈ ఏడాది నుంచే విద్యా సిరి
= అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన = పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యం = ప్రతిభ ఆధారంగా ఎంపిక = ఈ పథకానికి మరిన్ని నిధులు = ‘అన్న భాగ్య’తో ప్రజా సంక్షేమానికి పెద్దపీట = మతతత్వ శక్తులను అణిచేస్తాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీట్లు లభించని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,500 వంతున చెల్లించడానికి ఉద్దేశించిన విద్యా సిరి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం గురువారం ఆయన సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి ఇంకా నిధులు పెంచుతామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రణాళికా వ్యయం కూడా అనుకున్న మేరకే జరుగుతోందని తెలిపారు. కిలో రూపాయి బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు ఏటా రూ.4,500 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని చెప్పారు. ఈ దశలో...ఏపీఎల్ కార్డుదారులకు బియ్యం లేకుండా చేశారు కదా అని జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి నిష్టూరమాడినప్పుడు, జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చిన తర్వాత, ఏపీఎల్ కార్డులకు బియ్యం ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. తమ ప్రభుత్వం రూ.6,589 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజ వేయలేదని చెప్పారు. కాగా రాజ్యాంగంలో 371 (జే) చేర్పుతో హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా లభించినందున, ఆ ప్రాంతానికి ఎక్కువ నిధులను కేటాయించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని కోరామని వెల్లడించారు. మత తత్వ శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తాం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశంతో కొందరు రాష్ట్రంలో మత ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం అలాంటి శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తుందని హెచ్చరించారు. శాంతి, సామరస్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు. మచ్చ లేని రాజకీయాలు 1978లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి స్వచ్ఛమైన రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చానని తెలిపారు. గతంలో తాను వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల పదవులకు రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈ దశలో బీజేపీ సభ్యుడు బసవరాజ్ బొమ్మయ్ కలుగజేసుకుని తమ భయం కూడా అదేనని పేర్కొన్నారు. ‘మనమిద్దరం ఒకే పార్టీలో పని చేశాం కదా, నా గురించి నీకు తెలుసు కదా బొమ్మయ్’ అని సీఎం అన్నప్పుడు....ఇప్పుడు కూడా అదే విధంగా రాజీనామా చేసేస్తారేమోనని భయపడుతున్నా అని బొమ్మయ్ సమాధానమిచ్చారు. అయితే తాను రాజీనామా చేసే పరిస్థితే రాబోదని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన వక్క సాగును నిషేధిస్తారంటూ బీజేపీ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోను వక్క సాగును నిషేధించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి డీకే. శివ కుమార్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని అంటూ, సంతోష్ లాడ్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. ఈ దశలో బీజేపీ సభ్యులు ‘ఆహా, ఓహో’ అనడంతో ముఖ్యమంత్రి సైతం నవ్వసాగారు. -
నిర్లక్ష్యం వీడండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అధికారులు జడత్వాన్ని, నిర్లక్ష్యాన్ని వీడితేనే ప్రజలు కోరుకున్న విధంగా పాలనలో మార్పులు తీసుకు రావడానికి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. విధాన సౌధలో మంగళవారం జరిగిన వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీల సీఈఓల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికారులు బాధ్యతా రహితంగా వ్యవహరించడాన్ని ఏ మాత్రం సహించలేమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆశయాలు, పథకాలను పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత జూలైలో జరిగిన సమావేశంలో పాలనా యంత్రాంగం లో చురుకు పుట్టించాలని సూచనలు చేశానని గుర్తు చేశారు. అయితే ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారనే అంశాలపై సమాచారమే రాలేదని నిష్టూరమాడారు. కొందరు జిల్లా కలెక్టర్లు సమాచారమే ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఆశించినా, ఆ దిశగా ఎలాంటి మార్పులు రాలేదని విచారం వ్యక్తం చేశారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమగ్ర పథకాలను రూపొందించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను కాల పరిమితితో పరిష్కరించాలని ఆదేశించారు. ఆహార ధాన్యాల ధరలను పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మోనో రైలుకు సర్కారు యోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మెట్రో రైలుకు ఫీడర్ లైన్‌గా వ్యవహరించే మోనో రైలును ప్రారంభించడానికి ప్రభుత్వం యోచిస్తోందని హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మెట్రో రైలు పనులు పూర్తయిన వెంటనే మోనో రైలును అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై చర్చిస్తారని చెప్పారు. నగరంలో మంగళవారం 25వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండడానికే మోనో రైలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి అనేక కంపెనీలు ముందుకొచ్చాయని, దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా హోటళ్లు, పబ్‌ల వేళలను పొడిగించే విషయమై పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
సురక్షితంగా ఇంటికి..
ప్రసవానంతరం ఉచిత రవాణా సదుపాయం మాతా శిశువును ఇంటికి చేర్చేందుకు నూతన అంబులెన్సలు నగు-మగు పథకాన్ని ప్రారంభించిన గులామ్ నబీ ఆజాద్, సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : ప్రసవానంతరం మాతా, శిశు మరణాలను తగ్గించే చర్యల్లో భాగంగా ‘నగు-మగు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకున్న తర్వాత తల్లి బిడ్డలను ఉచితంగా ఇంటికి చేర్చడం కోసం ఈ వాహనాలను ఉపయోగిస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ పట్టణ ఆరోగ్య అభియాన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్-ఎన్యూహెచ్ఎం)ను నగరంలోని ఫ్రీడం పార్కులో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్‌తో కలిసి ఈ వాహనాలను ఆరోగ్య శాఖకు అప్పగించారు. అనంతరం ఖాదర్ మాట్లాడుతూ... జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద ఇప్పటి వరకూ గర్భిణులను ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చేవారన్నారు. ప్రసవించిన తర్వాత సొంత ఖర్చులతో బిడ్డతో పాటు తల్లిఇంటికి చేరుకునే వారని తెలిపారు. సరైన వాహన సదుపాయం లేకపోవడం వల్ల కొంత మంది తల్లులు, శిశువులు అనారోగ్యానికి గురికావడమే కాకుండా, కొన్ని సార్లు మృ్యు వాత పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని నివారించడానికి అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన ‘నగు-మగు’ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. వాహనాల్లో నైపుణ్యం గల సిబ్బంది ఉంటారన్నారు. బాల స్వస్థ కార్యక్రమం (ఆర్బీఎస్కే) పథకం కింద 0-18 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్రంలో తాలూకాకు రెండు చొప్పున వైద్య బృదాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బృదంలో డాక్టరు, నర్సు, కంటి వైద్యుడు ఉంటారని వివరించారు. అంగన్వాడీలు సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించి ఈ బృదాలు రోజుకు కనీసం 150 మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీరు రెఫర్ చేసిన పిల్లలకు శస్త్ర చికిత్స సహా అవసరమైన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించడం కోసం వైద్య రంగానికి ఎక్కువ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. -
లోక్‌సభ ఎన్నికల అనంతరం సిద్ధుకు పదవీ త్యాగం తప్పదు
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయకతప్పదని మాజీ సీఎం, ప్రతిపక్షనేత కుమారస్వామి జోస్యం చెప్పారు. విధానసౌధలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీలేవీ సిద్ధును పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు రచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆయన్ను పదవి నుంచి తొలగించడానికి తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారన్నారు. జేడీఎస్ పార్టీ వల్ల తాను రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినట్లు సిద్ధరామయ్య చెప్పుకోవడం సత్యదూరమన్నారు. జేడీఎస్ జాతీయ అధ్యక్షుడైన దేవెగౌడపై ఆరోపణలు చేయడం మంచిదికాదని హితవు పలికారు. ఈ విషమై చర్చించడానికి ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని సిద్ధరామయ్యకు కుమారస్వామి సవాల్ విసిరారు. కేఆర్ఎస్ డ్యాంలో రోజురోజుకూ నీటిమట్టం తగ్గిపోతోందన్నారు. దీంతో బెంగళూరుతోపాటు చుట్టుపక్కల ఉన్న తొమ్మిది జిల్లాల ప్రజలు వేసవి రాకుండానే తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో కావేరి ప్రవహిస్తున్నా తాగునీటి కోసం పొరుగు రాష్ట్రమైన తమిళనాడు వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కేంద్రప్రభుత్వ సవతితల్లి ప్రేమే కారణమన్నారు. రాహుల్ మేనియ రాష్ట్రంలో పనిచేయదన్నారు. పదేళ్ల తర్వాత కర్ణాటకపై ఆయనకు ప్రేమ పుట్టుకు వచ్చిందా అని కుమారస్వామి వ్యంగ్యంగా అన్నారు. -
‘అమాత్యుల అక్రమాలకు సాక్ష్యాలివిగో...’
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కళంకితులను మంత్రి వర్గంలో చేర్చుకోవడంతో పాటు వారిని వెనకేసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపకుడు ఎస్ఆర్. హిరేమఠ్ ఆరోపించారు. హుబ్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌ల అక్రమాలపై రెండు సార్లుగా తాము సాక్ష్యాధారాలను విడుదల చేసినప్పటికీ, మంత్రి వర్గంలో కొనసాగించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. రోషన్ బేగ్ వంచనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ఆధారాలను ప్రదర్శించారు. బెంగళూరులోని భారతీ నగర పోలీసు స్టేషన్లో దీనిపై కేసు కూడా నమోదైందని వెల్లడించారు. శివ కుమార్ భూ కబ్జాలకు సంబంధించి ముఖ్యమంత్రికి ఛార్జిషీట్ ప్రతులను పంపినా, ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని నిష్టూరమాడారు. -
జేడీఎస్ కుటుంబ పార్టీ
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రెండుసార్లు తాను కోల్పోవడానికి జేడీఎస్ పార్టీ కారణమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే చట్టసభల్లో పేర్కొన్నారన్నారు. వెనుకబడిన వర్గాల రాష్ట్రస్థాయి జాగృతి సమావేశం బెంగళూరులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... జేడీఎస్‌ను ఓ కుటుంబ పార్టీగా పేర్కొన్నారు. అందులో తండ్రి, కొడుకులదే రాజ్యమంటూ ధ్వజమెత్తారు. మిగిలిన వారు ఎంతకష్టపడినా ఆ పార్టీలో ఉన్నతస్థాయికి చేరనివ్వరని మండిపడ్డారు. దేవెగౌడ లేదా ఆయన కుమారులకే సీఎం పదవి దక్కాలనేది... దేవెగౌడ లక్ష్యమని విమర్శించారు. అందువల్లే తనకు సీఎం అయ్యే అవకాశం రెండుసార్లు వ చ్చినా దేవెగౌడ మోకాలడ్డారని ఆరోపించారు. తాను గతంలో అహింద వర్గాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ విధానం కూడా ‘అహింద’ వర్గాలకు మద్దతిచ్చే సిద్ధాంతాన్ని పోలి ఉంటుందన్నారు. అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ పార్టీనే కారణమన్నారు. అయితే కాంగ్రెస్ అహింద వర్గాలకు మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. జాతి, కుల, వ ర్గాల వారీగా నిర్వహించే సమావేశాలను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇలాంటి సమావేశాల వల్లే ఆయా వర్గాలు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా వారి మధ్య ఐక్యత పెరుగుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బీజేపీలో కూడా వెనుకబడిన వర్గాలకు చోటులేదన్నారు. ఆ పార్టీ నాయకులైన యడ్యూరప్ప, శెట్టర్, అనంతకుమార్, కే.ఎస్ ఈశ్వరప్పలు రిజర్వేషన్‌కు వ్యతిరేకులంటూ విమర్శించారు. ప్రైవేటు రంగాల్లో కూడా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. అప్పుడు మాత్రమే వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి వీలవుతుందని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. -
మంత్రి ఆంజనేయకు సీఎం క్లాస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం క్లాస్ తీసుకున్నారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన కేపీసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగం సమావేశంలో తారస పడిన ఆంజనేయను చూసిన సీఎం తొలుత అసహనం వ్యక్తం చేశారు. విధాన సౌధలోని తన కార్యాలయం కోసం కేటాయించిన రెండు గదుల మధ్య ఉన్న గోడను ఆంజనేయ పట్టుబట్టి కూల్చి వేయించారు. దీనిపై కొంత వివాదం నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం ఆయనను సుతిమెత్తగా మందలించారు. గోడ కొట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా శాఖా పరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు. కాగా విధాన సౌధలో 340, 340ఏ గదులను ఆంజనేయకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ రెండు గదుల మధ్య గోడను కూల్చాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్ అడ్ బీ)ను ఆదేశించిన మంత్రి, అప్పటి వరకు వేరే గదిలో తాత్కాలింగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొన్న మంత్రి వర్గంలో చేరిన విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తనకూ అదే 340 గది కావాలని పట్టుబట్టారు. దీనిపై ఆంజనేయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గోడ కొట్టే పనులను త్వరగా పూర్తి చేయనందుకు ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కొట్టకపోతే నేనే దగ్గరుండి కూల్చి వేయిస్తా, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తా’ అని అధికారులను కస్సు బుస్సుమంటూనే పరోక్షంగా శివకుమార్‌పై చిందులేశారు. అయితే ప్యాలెస్ మైదానంలో సమావేశం సందర్భంగా వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని చిరు నవ్వులు చిందించారు. కాంగ్రెస్ మార్కు రాజకీయమంటే ఇదేనేమో...! -
ఆగిన ఆటోలు
= ఆటో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బంద్ = ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, రోగులు, విద్యార్థులు = రోడ్డెక్కని 1.20 లక్షల ఆటోలు = ఫ్రీడం పార్కులో ఆటో డ్రైవర్ల ధర్నా = సీఎం సిద్ధుకు వినతి పత్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు :ఆటో గ్యాస్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ ఆటో డ్రైవర్లు సోమవారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. రోడ్లపైకి ఆటోలు రాకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి మెజిస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చిన్న పిల్లలు, భారీ లగేతో వచ్చిన వారు బస్సులు ఎక్కలేక టాక్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది. బీఎంటీసీ 250 అదనపు బస్సులు నడిపినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించ లేదు. ప్రయాణికుల్లో చాలా మంది తమ ఇళ్లకు నడిచి వెళ్లగా, కొంత మంది తమ బంధు మిత్రులు తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. నగరంలో సుమారు 1.20 లక్షల ఆటోలుండగా, దాదాపుగా ఒక్కటీ రోడ్డెక్కలేదు. యశవంతపుర, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లు, శివాజీ నగర, శాంతి నగర బస్సు స్టేషన్లలో ప్రయాణికులు విధి లేక టాక్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది. నిత్యం ఆటోల్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు అనేక ఇక్కట్లకు గురయ్యారు. తల్లిదండ్రులు ఆఫీసులకు సెలవు పెట్టి తమ పిల్లలను స్కూళ్లలో విడిచి, సాయంత్రం ఇంటికి పిలుచుకు వచ్చారు. మార్కెట్ల నుంచి కూరగాయలు, పళ్లు, ఇతర సామాగ్రిని తీసుకు వెళ్లే వ్యాపారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరో వైపు 24 గంటలు సమ్మె చేపట్టిన ఆటో డ్రైవర్లు ఫ్రీడం పార్కులో ధర్నా నిర్వహించారు. తక్షణమే ఆటో గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. -
దేశంలో మోడీ ప్రభంజనం
గంగావతి, న్యూస్‌లైన్ : దేశంలో మోడీ గాలి బలంగా వీస్తోందని కొప్పళ లోక్‌సభ మాజీ సభ్యులు, బీఎస్ఆర్ పార్టీ నేత కే.విరుపాక్షప్ప అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక ఎస్ఎస్ మోటర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను కొప్పళ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి అభిప్రాయానికి అనుగుణంగా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకుంటానన్నారు. బీఎస్ఆర్ పార్టీ నేత బీ.శ్రీరాములు సైతం బీజేపీలో చేరతారని, అయితే అంతిమ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, అయితే ఏ పార్టీలో చేరాలన్నది త్వరలో నిర్ణయిస్తానని చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశంతోనే కలిసింది వాస్తవమని ఒప్పుకున్న విరుపాక్షప్ప, ఆ పార్టీలో స్థానికుల వ్యతిరేకతను బట్టి ఆ పార్టీలోకి వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు తమ్మినేని రామచంద్ర, విఠలాపుర యమనప్ప, పక్కీరయ్య పాల్గొన్నారు. ‘కొప్పళ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నా’ శ్రీరామనగర్, న్యూస్‌లైన్ : బీజేపీ తరపున కొప్పళ లోక్‌సభ టికెట్‌ను తాను ఆశిస్తున్నట్లు కొప్పళ మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప తెలిపారు. బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో స్థానిక నాయకులను తమ మద్దతుదారులు కలుస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రాయచూరులో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ దేశ్‌పాండే, కనకగిరి బ్లాక్ బీజేపీ అధ్యక్షులు కే.సత్యనారాయణరావులను కలిసినట్లు తెలిపారు. -
కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది
= కళంకితులకు మంత్రి పదవులపై 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన = బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప సాక్షి, బళ్లారి : కళంకితులకు మంత్రి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో బయట పడిందని రాష్ట్ర ఎస్టీ మోర్చా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని మయూర హోటల్లో విలేకరులతో మాట్లాడారు. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు అన్న చందంగా అక్రమ గనుల తవ్వకాలపై పాదయాత్ర చేసి, తర్వాత అదే అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులు డీకే శివకుమార్, రోషన్‌బేగ్‌లకు మంత్రి పదవులు ఇచ్చిన సిద్ధరామయ్య ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డీకే శివకుమార్, రోషన్ బేగ్‌లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 6న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందన్నారు. బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములును బీజేపీలోకి త్వరగా వచ్చే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని, అదే విధంగా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున శ్రీరాములును పోటీలో పెట్టే విధంగా పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. బళ్లారి ఎస్టీ వర్గాలకు రిజర్వ్ అయినందున శ్రీరాములు బీజేపీ తరుపున సమర్థుడైన అభ్యర్థి అని గుర్తు చేశారు. శ్రీరాములు వెంట తామందరం ఉంటామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అవినీతి పరులకు మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ తప్పిదం చేస్తోందన్నారు. యడ్యూరప్ప బీజేపీలోకి తిరిగి రానుండటంతో బీజేపీకి కొండంత బలం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ధరలు అదుపు చేయకపోగా, గ్యాస్ ధరలు కూడా పెంచడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రయ్య, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు. -
నూతన అమాత్యులకు శాఖల కేటాయింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. డీకే. శివ కుమార్‌కు విద్యుత్ శాఖ, ఆర్. రోషన్ బేగ్‌కు ప్రాథమిక సదుపాయాలు, సమాచార, హజ్ శాఖలను కేటాయిస్తూ ఆయన చేసిన సిఫార్సును గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ఆమోదించారు. ప్రధాన శాఖల కోసం పట్టు.. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో కొత్తగా చేరిన డీకే. శివ కుమార్, ఆర్. రోషన్ బేగ్ మొదట ప్రధాన శాఖలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బేగ్ తనకు వక్ఫ్ శాఖ కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఖమరుల్ ఇస్లాం ఆ శాఖను నిర్వహిస్తున్నారు. ఈ శాఖను బేగ్‌కు ఇచ్చేది లేదంటూ ఆయన తెగేసి చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై గురువారం మధ్యాహ్నం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ నివాసంలో దాదాపు గంట సేపు పంచాయతీ జరిగింది. ఇందులో పాటిల్, ఖమరుల్ ఇస్లాంలతో పాటు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ పాటిల్ పాల్గొన్నారు. బేగ్‌కు వక్ఫ్ శాఖను ఇవ్వడానికి సమ్మతించాలని అందరూ ఖమరుల్ ఇస్లాంపై ఒత్తిడి తెచ్చారు. దీనిక ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ కూడా తన శాఖ పట్ల అసంతృప్తితో ఉండడంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మరో మంత్రి డీకే. శివ కుమార్ కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరను గురువారం సదాశివ నగరలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. శివ కుమార్ సైతం ప్రధాన శాఖను కోరుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వద్ద అనేక ప్రధాన శాఖలున్నాయి. రెవెన్యూ, ప్రజా పనులు, సహకారం లాంటి కీలక శాఖలను సీఎం, జనతా దళ్‌లో తనతో ఉన్న అనుయాయులకు ఇచ్చారు. దీనిపై ఆది నుంచీ కాంగ్రెస్‌లో ఉంటున్న వారిలో అసంతృప్తి నెలకొంది. అందుకే... శాసన సభ లోపల, బయటా ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ‘దాడి’ చేసే సందర్భాల్లో వారెవరూ ఆయనకు అండగా నిలబడడం లేదు. -
అసంతృప్తి విస్తరణ
చెప్పేది శ్రీరంగనీతులు .... = కళంకితులకు అందలమా! = మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్మయం = అధిష్టానం నిర్ణయానికి తలొగ్గిన సీఎం = నిరాడంబరంగా ప్రమాణ స్వీకారోత్సవం = ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి = లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం = బీజేపీ చేతికి మరో ‘మైనింగ్’ అస్త్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్ర మంత్రి వర్గంలో డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లకు స్థానం కల్పించడంపై బయట మాటెలా ఉన్నా, కాంగ్రెస్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి పదవులపై కన్నేసిన అనేక మందికి ఈ ‘స్వల్ప విస్తరణ’ కడుపు మంటను రగిల్చింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ‘ఈ రోజు కాకపోతే రేపు’ మంత్రి పదవులు లభించకపోతాయా అని ఆశలు పెంచుకుంటూ వచ్చారు. హఠాత్తుగా ఇద్దరికి మాత్రమే స్థానం కల్పించడంపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. శివ కుమార్ తండ్రి మంగళవారం కాల ధర్మం చెందారు. మరుసటి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వీరిద్దరిని మంత్రి వర్గంలో చేర్చుకోవడం ఇష్టం లేదు. అధిష్టానం నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఆయన చేయలేక పోయారు. బీజేపీ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేశారు. అలాంటి సిద్ధరామయ్య అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తన మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు వస్తాయనే బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆయన అత్యంత నిరాడంబరంగా జరపాలని అధికారులకు సూచించారు. సాధారణంగా రాజ్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో తిలకించడానికి అక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు రాజ్ భవన్‌లోని బాంక్వెట్ హాలులో ఈ ఇద్దరి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేశారు. మీడియా నుంచి కేవలం 23 మందిని మాత్రమే అనుమతించారు. ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా మెన్‌ను సైతం అనుమతించ లేదు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విస్తరణ బీజేపీకి ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఈ ఆయుధాన్ని విృ్తతంగా వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన మే నెల వరకు ఆగి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ వీర విధేయులు సైతం ఈ విస్తరణను వ్యతిరేకించారు. కాగా శివ కుమార్, రోషన్ బేగ్‌లకు గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. శివ కుమార్ రామనగర జిల్లా కనకపుర స్థానానికి, రోషన్ బేగ్ నగరంలోని శివాజీ నగర స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరి ఒత్తిడీ లేదు మంత్రి వర్గ విస్తరణకు తనపై ఎవరూ ఒత్తిడి తీసుకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన సొంత నిర్ణయం మేరకు వీరిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకున్నానని చెప్పారు. శివ కుమార్‌పై ఓ ఆరోపణ ఉందని, దాని విచారణపై ఆయన స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రోషన్ బేగ్‌పై ప్రైవేట్ ఫిర్యాదు ఉందని చెబుతూ, సంతోషంగానే విస్తరణ చేపట్టానని వెల్లడించారు. -
కాంగ్రెస్ అన్వేషణ
= జిల్లాల వారీగా సమావేశాలు = 6న రాష్ట్రానికి దిగ్విజయ్ = ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల నేతలతో సమావేశం సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర విభాగం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆది వారం జిల్లాల వారీగా వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. మొదటిరోజు ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, మైసూరు, మం డ్య, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేలు, గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన పరాజితులు, పార్టీ జిల్లాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు అరగంట సమయం కేటాయించారు. సవ ూవేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడి అభిప్రాయాన్ని విన్నారు. తమ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడాలని ఎవరెవరు భావిస్తున్నారు, అందులో గెలుపు అవకాశాలు ఎవ రికున్నాయి అన్న విషయాలపై ఇరువురు నాయకులు కూపీ లాగారు. చర్చకు వచ్చిన ప్రతి విషయాన్ని ఇరువురు నోట్ చేసుకున్నారు. అనంతరం అన్ని జిల్లాల నాయకులను ఒకచోట చేర్చి పరమేశ్వర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సిద్ధరామయ్య , పరమేశ్వర్, మల్లికార్జున ఖర్గే గ్రూపులుగా విడిపోయారంటూ అటు సొంత పార్టీలోనూ ఇటు విపక్షాల్లోనూ విమర్శలు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై పార్టీలో గ్రూపు రాజకీయాలు జరపకూడదన్నారు. పార్టీ హైకవ ూండ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన నాయకులు సదరు నాయకుడి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సమీక్షసమావేశం సోమవారం) కూడా కొనసాగనుంది. జనవరి 6న రాష్ట్రానికి దిగ్విజయ్.... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. ఆదేరోజున ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ సమితి సభ జరగనున్నట్లు సమాచారం. -
సర్దార్ పటేల్‌ను హైజాక్ చేసిన మోడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైజాక్ చేశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. పటేల్ పేరును ప్రస్తావించడానికి మోడీకి నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇక్కడి నందినీ లేఔట్లో కాంగ్రెస్ పార్టీ 129వ వ్యవస్థాపక దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సర్దార్ పటేల్ ఇంకా బతికి ఉంటే మోడీపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండేవారని అన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్కే. అద్వానీని బీజేపీ వారు ఉక్కు మనిషి అని సంబోధించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడిన పటేల్ ఒక్కరే ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. ఈ దేశంలో మరొకరు ఉక్కు మనిషి కాలేరని తెలిపారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేని దేశాన్ని నిర్మిస్తామని మోడీ ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదమన్నారు. ఆయన కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమేనని, ప్రధాని కాదని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ చరిత్రను తెలియని వారే పార్టీని విమర్శిస్తుంటారని అన్నారు. త్యాగం, బలిదానాలతో దేశం పురోభివృద్ధికి కాంగ్రెస్ శ్రమించిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. -
‘కరువు నివారణకు రూ.1,014 కోట్లు ఇవ్వండి’
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో 14 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని కరువు పరిశీలన బృందానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కరువు నివారణ పనుల కోసం రూ.1,014 కోట్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.పి. సిన్హా నేతృత్వంలోని రెండు కరువు పరిశీలన బృందాలు వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పర్యటించాయి. తమ పరిశీలినలో తేలిన విషయాలను సీఎం క్యాంపు కార్యాలయం ‘కృష్ణా’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కేంద్ర బృందం వివ రించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య వర్షాభావం వల్ల తుమకూరు, కోలార్, చిత్రదుర్గ జిల్లాలో భూగర్భ నీటిమట్టం 1,500 అడుగులకు పడిపోయిందన్నారు. చాలా చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కరువు నివారణ పనులు చేపట్టడానికి, పంట నష్టపరిహార వితరణకు వీలుగా వెంటనే నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రతినిధి బృందానికి తెలిపానన్నారు. వారు కూడా నిదుల విడుదలకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారన్నారు. కాగా, కరువు పరిస్థితుల అధ్యయనం కోసం కేంద్ర ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించడం ఈ ఏడాది ఇది రెండోసారి. -
సాగు నీటిప్రాజెక్టులకు పెద్దపీట
= ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం = ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం = ‘కృష్ణా’ జలాల వాటా విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం = రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే లెసైన్‌స రద్దు = సీఎం సిద్ధరామయ్య వెల్లడి మాన్వి/రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బుధవారం ఆయన మాన్విలోని కాకతీయ పాఠశాల మైదానంలో, దేవదుర్గ తాలూకా అరకెరలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో మాట్లాడారు. అంతకు ముందు ఆయన పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. సీఎం మాట్లాడుతూ ... కృష్ణా నదీ జలాల సాగు నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వాటా విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సమర్థవంతమైన వాదనలు వినిపిస్తుందని, న్యాయ నిపుణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా ఆయకట్టు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తోందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా అవినీతి, అక్రమాల నియంత్రణకు చర్యలు చేపట్టి అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. 169 హామీలు ఇచ్చామని, 2013-14లో 60 హామీలు నెరవేర్చామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే కొత్త పథకాలకు శ్రీకారం చుడితే విపక్షాలు నానాయాగీ చేయడం తగదన్నారు. అన్నభాగ్య, క్షీరభాగ్య, యశస్విని పథకాలను ప్రారంభించామన్నారు. రేషన్ షాపులలో బీపీఎల్ కార్డుదారులకు 30 కేజీల కంటే తక్కువ బియ్యం ఇస్తే అలాంటి రేషన్ షాప్‌ల లెసైన్స్ రద్దు చేస్తామన్నారు. అన్న భాగ్య పథకానికి ఏటా రూ.4200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి బీపీఎల్ కార్డులు అందించామన్నారు. కర్ణాటకను ఆకలి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు గోధుమలు, జొన్నలు కూడా పంపిణీ చేస్తామన్నారు. 39 లక్షల మంది అంగన్వాడీ పిల్లలకు, 65 లక్షల మంది విద్యార్థులకు క్షీరభాగ్య పథకం కింద పాలను అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదలు, దళితులు, మైనార్టీలు తీసుకున్న రూ.1300 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. బీజేపీ హయాంలో యడ్యూరప్ప, సదానందగౌడ, జగదీష్ శెట్టర్లు ఇచ్చిన హామీలేవీ లేవన్నారు. నేడు బీజేపీలో ప్రతిఒక్కరూ నమో మంత్రాన్ని జపిస్తున్నారన్నారు. గుజరాత్‌లోని సమస్యలను పరిష్కరించలేని నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఎలా అవుతారన్నారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభావం ఏమీ లేదన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం చెరుకు, వరి, కంది, మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలకు మద్దతు ధరలు ప్రకటించామన్నారు. నగరాభివృద్ధికి రూ.70 కోట్లు : మంత్రి ఖమరుల్ ఇస్లాం జిల్లాలోని నగరసభలు, పురసభలకు రూ.70 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఖమరుల్ ఇస్లాం పేర్కొన్నారు. నగరాల పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాయచూరుకు రూ.30 కోట్లు, సింధనూరు, మాన్వి, లింగసూగూరు, మస్కి, దేవదుర్గ, ముదుగల్లకు రూ.6 కోట్లు చొప్పున విడుదల చేశామన్నారు. మైనార్టీలకు ఇళ్ల నిర్మాణానికి లక్ష రూపాయల సబ్సిడీ అందిస్తున్నామని, అభివృద్ధి పథకాలకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. ఎన్‌ఆర్‌బీసీ కాలువపై సర్వే : మంత్రి ఎంబీ పాటిల్ నారాయణపుర కుడిగట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ)పై 125వ కి.మీ.నుంచి 168వ కి.మీ.వరకు సర్వే జరుపుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఎం.బీ.పాటిల్ పేర్కొన్నారు. అరకెర వద్ద 9ఏ కాలువ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. లింక్ కెనాల్ విషయంలో కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నందవాడగి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖలో ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. రోడ్ల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు : రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు కేటాయించామని రాష్ట్ర ప్రజా పనుల శాఖా మహదేవప్ప పేర్కొన్నారు. ఈ ఏడాది 8 వేల కి.మీ.మేర రోడ్ల నిర్మాణానికి తారు వేసే పనులను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బాదర్లి హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బోసురాజు, పాపారెడ్డి, రాజారాయప్ప నాయక్, జెడ్పీ అధ్యక్షురాలు లలిత, డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.20 వేల కోట్ల విలువైన భూమి హాంఫట్
సాక్షి, బెంగళూరు :బెంగళూరు అర్బన్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో రూ.20 వేల కోట్ల విలువ చేసే భూములను రాజకీయ నాయకులతో పాటు కొన్ని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలు అక్రమంగా సొంతం చేసుకున్నాయని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ (ఎన్సీపీఎన్ఆర్) వ్యవ స్థాపకుడు ఎస్.ఆర్.హీరేమఠ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖను మంగళవారమిక్కడ మీడియాకు విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏదైనా మున్సిపాలిటీ లేదా మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పరిధిలోని 18 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోను రెగ్యులరైజ్ చేయరాదని కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1964 చెబుతోందని తెలిపారు. అయితే ఈ యాక్ట్‌కు వ్యతిరేకంగా మాజీ మేయర్ డి.వెంకటేష్ మూర్తి, ఆయన భార్య ప్రభ నగరంలోని పద్మనాభ నగరలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చెరో నాలుగు ఎకరాల భూమిని పొందారని ఆరోపించారు. ఇందుకు అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్.అశోక్ సహాయం చేశారని పేర్కొన్నారు. మాజీ కేంద్రమంత్రి ఎస్.ఎం.కృష్ణ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2004లో) ఆయన సోదరుని కుమార్తెకు యశ్వంతపురలో ఐదెకరాల ముప్పై కుంటల స్థలాన్ని డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో కేటాయించారని తెలిపారు. అయితే ఆ స్థలంలో ఇప్పటికీ ఎలాంటి విద్యాసంస్థను స్థాపించకుండా ఇతర వ్యవహారాల కోసం భూమిని వినియోగిస్తున్నారని చెప్పారు. తన అల్లుడైన వి.జి.సిద్ధార్థ్‌కు కూడా అక్రమంగా భూ కేటాయింపులు చేశారని ఆరోపించారు. నగరంలోని కొన్ని ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొన్ని వందల ఎకరాల భూమిని పొందాయని పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికలో వెల్లడైందని చెప్పారు. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ సంబంధిత నాయకులు, అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బహుశా టాస్క్‌ఫోర్స్ నివేదికలో పేర్కొన్న నేతలపై చర్యలు కనుక ప్రారంభిస్తే విధానసౌధలో కూర్చున్న రాజకీయ నాయకుల్లో దాదాపు 20 శాతం మంది జైలు కెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు వెనకాడుతోందని విమర్శించారు. వేల కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని హీరేమఠ్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన భూవ ుులన్నింటిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని, అక్రమంగా భూములు పొందిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆందోళన వద్దు
= బియ్యం ధరలపై ముఖ్యమంత్రి భరోసా = త్వరలో లెవీ సమస్య పరిష్కరిస్తాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మిల్లుల యజమానులు నిరవధిక సమ్మెకు దిగినప్పటికీ, బియ్యం ధర పెరగకుండా అన్ని చర్యలూ చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనిక్కడ జనతా దర్శన్‌లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మిల్లర్లతో చర్చించాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావుకు సూచించామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల నుంచి మిల్లర్లు క్వింటాల్ రూ.1,600 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, క్వింటాల్ బియ్యం ధరను రూ.2,600గా నిర్ణయించామని వివరించారు. దీనికంటే ఎక్కువ ధరను కోరడం న్యాయం కాదన్నారు. రూపాయి కిలో బియ్యం పథకం అన్న భాగ్యకు 13.5 లక్షల టన్నుల లెవీ బియ్యం అవసరమని తెలిపారు. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఒకే సీఈటీని నిర్వహిస్తామని వెల్లడించారు. ఫీజు నిర్ధారణకు ఓ కమిటీని, సీట్ల పంపకానికి మరో కమిటీని నియమించామని చెప్పారు. ఈ దశలో 2006లో మాదిరే సీట్ల పంపకం ఉంటుందంటూ వస్తున్న వదంతులను ఆయన కొట్టి పారేశారు. -
ఎయిర్‌పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు
= జీవీకేకు సీఎం సిద్ధరామయ్య సూచన = విమానాశ్రయం ఏర్పాటుకు 4,300 ఎకరాలిచ్చిన రైతులకు కృతజ్ఞతలు = బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘కెంపేగౌడ’గా నామకరణం సాక్షి, బెంగళూరు : ఇక్కడి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విమానాశ్రయం నిర్వాహక సంస్థ జీవీకేకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం నిర్మాణానికి దాదాపు 4,300 ఎకరాలను ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం ఎదురుగా బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిందిగా సూచించారు. విమానయాన సర్వీసులపై ప్రస్తుతం ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించే విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినందున పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అపారంగా ఉన్న నైపుణ్య మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని వివిధ దేశాల ప్రతినిధులకు ఆయన సూచించారు. అంతకు ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ... విస్తరించిన వివ ూనాశ్రయం వల్ల బెంగళూరు ఆర్థిక రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు. -
విధేయులకే పెద్ద పీట
= కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం = మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, బోర్డులు, కార్పొరేషన్ల నియామకాల్లో పార్టీ విధేయులకే పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌ను శనివారం ఇక్కడ కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , సమన్వయ సమితి సభ్యులు కేజే. జార్జ్, డీకే. శివకుమార్‌లు కలుసుకున్నప్పుడు పలు అంశాలపై చర్చ జరిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున వీలైనంత త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని, కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్ల నియామకాన్ని పూర్తి చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థులతో జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపాలని పరమేశ్వరకు సూచించారు. గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ చీటికి మాటికి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడం సమావేశంలో ప్రస్తావనకు వ చ్చింది. దీనిపై దిగ్విజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సీఎంకు సలహా ఇచ్చారు. సమన్వయ సమితి సమావేశం రద్దు నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ సమన్వయ సమితి సమావేశం, అన ంతరం నగర శివార్లలోని రిసార్టులో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ బిల్లు, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునిచ్చే విషయమై అత్యవసరంగా చర్చించాల్సి ఉన్నందున తక్షణమే రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పిలుపు మేరకు వెళ్లాల్సి రావడంతో తాను బస చేసిన అతిథి గృహంలోనే సమన్వయ సమితి సభ్యులైన పరమేశ్వర, సీఎం, జార్జ్, శివ కుమార్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. మధ్యలో ఆయన గవర్నర్‌ను రాజ్ భవన్లో కలుసుకున్నారు. మంత్రుల పని తీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తుండడంతో నష్ట నివారణకు భేటీ అయ్యారు. మున్ముందు ఇలా జరుగకుండా చూస్తానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
మౌన రోదన
రాచ నగరిలో నిశ్శబ్దం.. = ఒడయార్ మృతితో తల్లడిల్లిన నగరం = అంతిమ దర్శనానికి భారీగా జనం = శోకసంద్రమైన రాజ ప్రాసాదం = నగరంలోని కూడళ్లలో ఆయన చిత్రపటాలుంచి శ్రద్ధాంజలి = నగరంలో స్వచ్ఛంద బంద్ = మధువనంలో అంత్యక్రియలు = సౌధపై జాతీయ పతాకం అవనతం = వారసుడిగా కాంతరాజ అర్స్! మైసూరు, న్యూస్‌లైన్ : సుమారు ఐదున్నర శతాబ్దాల పాటు తమ ఏలికగా ఉన్న ఒడయార్ రాజ వంశం అంతమవడంతో రాచ నగరి మైసూరు తల్లడిల్లిపోయింది. మైసూరు రాజుల్లో ఆఖరి వారైన శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ పార్థివ శరీరం మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి మైసూరు చేరుకున్నప్పటి నుంచి తండోప తండాలుగా ప్రజలు రాజ ప్రాసాదానికి తరలి వచ్చారు. పలు సార్లు తొక్కిసలాట ఏర్పడింది. రాష్ర్టంలోని నలుమూలల నుంచి, ముఖ్యంగా మైసూరు, చామరాజ నగర, మండ్య జిల్లాల ప్రజలు వేల సంఖ్యలో అంతిమ దర్శనానికి తరలి వచ్చారు. ఒడయార్ మరణ వార్త తెలియగానే రాచ నగరిలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. పలు కూడళ్లలో ఆయన చిత్ర పటాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. నగరమంతా ఆయన మరణం గురించే మాట్లాడుకోవడం కనిపించింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మధ్యాహ్నం వరకు అంతిమ దర్శనానికి అవకాశం కల్పించి, అనంతరం రాజప్రాసాదం ద్వారాలన్నీ మూసివేశారు. తర్వాత యదు వంశ రాయుని బంధువులు అంత్యక్రియలకు ముందు నెరవేర్చాల్సిన ధార్మిక కార్యక్రమాలను పూర్తి చేశారు. మైసూరు చుట్టు పక్కల దేవస్థానాల నుంచి తీసుకొచ్చిన తీర్థాన్ని భౌతిక కాయంపై చల్లారు. తదనంతరం రాజప్రాసాదం నుంచి సయ్యాజీ రావు సర్కిల్, అరసు రోడ్డు, నారాయణ శాస్త్రి రోడ్డు, చాముండి డబుల్ రోడ్డుల మీదుగా అంతిమ యాత్రను నిర్వహించి నంజనగూడు రోడ్డులోని మధువనంలో అంత్యక్రియలను నిర్వహించారు. భానుప్రకాశ్ శర్మ నేతృత్వంలో 25 మంది వేద పండితులు అంత్య సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారసుడిగా కాంతరాజ అర్స్ సంతానం లేని ఒడయార్ అంత్యక్రియలను ఆయన మేనల్లుడు కాంతరాజ్ అర్స్ నిర్వహించారు. ఒడయార్ పెద్ద సోదరి గాయత్రీ దేవి కుమారుడైన కాంతరాజ్ తదుపరి వారసుడవుతారని వినవస్తోంది. ఒడయార్‌కు మరో సోదరి మీనాక్షి దేవి కూడా ఉన్నారు. వీరిద్దరి కుమారుల్లో వారసుడిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ నెలకొన్నా.. పెద్ద సోదరి కుమారుడికే ఆ గౌరవం లభించవచ్చని తెలుస్తోంది. ప్రముఖుల శ్రద్ధాంజలి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రి వర్గ సహచరులు అంబరీశ్, కేజే. జార్జ్, హెచ్ఎస్. మహదేవ ప్రసాద్, డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప, వీ. శ్రీనివాస ప్రసాద్, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, యడ్యూరప్ప ప్రభృతులు పార్థివ శరీరంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. సుత్తూరు మఠాధిపతి శ్రీ శివరాత్రీశ్వర దేశికేంద్ర స్వామీజీ అంతిమ దర్శనం చేసుకుని, రాణి ప్రమోద దేవికి సాంత్వన పలికారు. బెంగళూరులో.. ఒడయార్ మృతికి సంతాప సూచకంగా నగరంలోని కేఆర్ మార్కెట్లో వర్తకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మేయర్ సత్యనారాయణ స్కూటర్‌పై వచ్చి ఒడయార్‌కు నివాళులర్పించారు. పుట్టణ్ణ శెట్టి టౌన్ హాలు వద్ద ఒడయార్ చిత్ర పటాన్ని పెట్టి పూజలు నిర్వహించారు. పలువురు నివాళులు అర్పించారు. ప్యాలెస్, నవరంగ్ తదితర చోట్ల కూడా ఒడయార్ చిత్ర పటాలుంచి సంతాపం వ్యక్తం చేశారు. విధాన సౌధపై జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. -
ఫలితం అక్కడ... ప్రకంపనలిక్కడ!
= నేడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు = కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ = ‘లోక్‌సభ’పై కేపీసీసీలో మరింత ఉత్కంఠ = అసమ్మతిని బుజ్జగించేందుకు యత్నాలు = వచ్చే నెల కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ = కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకూ అనుమతి = యడ్డిని పార్టీలోకి రప్పించుకునేలా బీజేపీ యత్నాలు = జేడీఎన్ నేతలూ గోవాలో సమాలోచనలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా పడనుంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే కర్ణాటక విషయంలో మున్ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఖాయం. మంత్రి వర్గ విస్తరణ రాష్ర్ట మంత్రి వర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్న వారి సంఖ్య పదికి పైగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు విస్తరిస్తే, అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉందని అధిష్టానం ఇన్నాళ్లూ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే జాప్యం వల్ల అసమ్మతికి మరింతగా ఆజ్యం పోసినట్లవుతుందని నిర్ధారణకు వచ్చింది. కనుక ఈ నెలలోనే విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌లతో చర్చలు జరిపారు. విస్తరణతో పాటు కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కూడా అధిష్టానం సమ్మతించినట్లు సమాచారం. ఈ నెల 15న దిగ్విజయ్ సింగ్ నగరానికి రానున్నారు. ఆ సందర్భంగా మంత్రి వర్గంలో ఎవరెవరిని తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లతో పాటు నగరంలోని శాంతి నగర ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారిస్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాస్త స్వేచ్ఛ లభించే అవకాశాలున్నాయి. బీజేపీలో... నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ గట్టి విశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి దృష్టి సారించనుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీకి ఉనికి లేదు. కనుక సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను ఈ రాష్ర్టం నుంచే గెలుపొందడానికి వ్యూహ రచన చేస్తుంది. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం కనబడుతోంది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానిస్తే మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. ఆయనను తీసుకోవడానికి పార్టీలో సర్వామోదం లభించినా, యడ్యూరప్పే కాస్త బెట్టు చేస్తున్నారు. తన అనుయాయులకు కూడా పదవులు ఇవ్వాలని ఆయన షరతులు విధిస్తున్నారు. జేడీఎస్.. అంతా అనుకున్నట్లు జరిగి, యడ్యూరప్ప మళ్లీ బీజేపీ పంచన చేరితే జేడీఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోనుంది. ఇటీవల బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటినీ కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ మాటేమో కానీ జేడీఎస్ కొట్టుకు పోయేట్లుంది. అతి కష్టం మీద మాజీ ప్రధాని దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల వ్యూహంపై ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి, ఆయన సహచరులు గోవాలో మంతనాలు సాగించారు. బెల్గాంలో శుక్రవారం శాసన సభ సమావేశాలు ముగియగానే అటు నుంచి అటే గోవాకు వెళ్లారు. -
తీరు మారాలి
మంత్రుల వైఖరిపై గవర్నర్ = సీఎం బాగా పనిచేస్తున్నారు = బాధ్యతలను విస్మరించిన మంత్రులు = ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలి = పలు వర్సిటీల్లో వీసీల నియామకంలో జాప్యం = దీనిపై సీఎం ప్రత్యేక ద ృష్టి సారించాలి = బెంగళూరులోనే ‘రాజీవ్’ వర్సిటీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల తీరుపై సదా విమర్శలు గుప్పిస్తున్న గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ తాజాగా వారి వైఖరిపై పెదవి విరిచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పని తీరును ప్రశంసిస్తూనే మంత్రుల వైఖరిని తప్పుబట్టారు. నౌకా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కార్వారలోని సీ బర్డ్ నౌకాశ్రయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొందరు మంత్రుల పని తీరు తనకు తృప్తినివ్వడం లేదన్నారు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం బాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. తాను వివాదాల్లోకి పోదలచుకోలేదని, అయినప్పటికీ మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి తాను సమష్టి బాధ్యతను ఆశిస్తున్నానని తెలిపారు. మొత్తం ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించాల్సి ఉందన్నారు. అయితే ఈ నియామకాల్లో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సి ఉందన్నారు. రామనగర జిల్లాలో నిర్మించదలచిన రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని బెంగళూరులోనే నెలకొల్పాలని అన్నారు. బెంగళూరులో కావాల్సినంత స్థలం ఉన్నందున ఈ విశ్వ విద్యాలయం భవనాన్ని ఇక్కడే నిర్మించాలని సూచించారు. రామనగరలో ప్రైవేట్ స్థలంలో నిర్మించాల్సిన ఆగత్యం లేదన్నారు. -
మారకపోతే.. మీ ఖర్మ
మంత్రులపై సీఎం అసహనం * మీ పని తీరుపై అధిష్టానానికి నివేదిక ఇచ్చా * ఇకనైనా పని తీరు మార్చుకోండి *లేకుంటే.. జరగబోయే పరిణామాలకు నేను బాధ్యుడ్ని కాను * నా మాటలను పెడచెవిన పెడుతున్నారు * ఎమ్మెల్యేల ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు స్పందించారు. బెల్గాంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో ఆయన మంత్రుల ఎదుటే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పని తీరును మార్చుకోక పోతే మున్ముందు చోటు చేసుకునే పరిణామాలకు తనను బాధ్యుని చేయవద్దని కోరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మీ పని తీరుపై నివేదిక సమర్పించానన్నారు. మారండి, మారండంటూ ఎంతగా మొత్తుకున్నా వినిపించుకోడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఉన్నప్పుడు వారంలో కనీసం మూడు రోజులు విధాన సౌధకు వచ్చి, అధికారులతో చర్చించాలన్న తన సూచనలను సైతం పెడచెవిన పెట్టారని నిష్టూరమాడారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమస్యలపై స్పందించడం లేదు, కేపీసీసీ కార్యాలయానికీ వెళ్లడం లేదు అంటూ ఆయన మంత్రుల వైఫల్యాల చిట్టాను విప్పారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినప్పుడు మంత్రులు స్పందించడం లేదని, దీనిపై ఫిర్యాదులు వచ్చినా తీరు మారడం లేదని నిష్టూరమాడారు. ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు ఏమవుతుందో తాను చెప్పలేనని హెచ్చరించారు. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరును తప్పుబట్టారు. తమను విశ్వాసంలోకి తీసుకుని నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులపై స్పందించాలని కోరారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని సూచించారు. కనీసం రెండు నెలలకోసారి సీఎల్పీ సమావేశాలను నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. -
నిర్మాతలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన
= నిర్మాతలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన = బిఫ్కు రూ. 2 కోట్లు విడుదల = ‘కృష్ణా’లో బిఫ్ లోగో విడుదల చేసిన సీఎం = 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు కార్యక్రమాలు సాక్షి, బెంగళూరు : ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటు రాష్ట్ర సంసృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సామాజిక సృహ ఉన్న చిత్రాలను నిర్మించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిత్ర నిర్మాతలు, దర్శకులకు సూచించారు. క్యాంపు కార్యాలయం ‘కృష్ణా’లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 6వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల (బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-బిఫ్) లోగోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘బంగారద మనుష్య’, ‘సంగోళ్లిరాయణ్ణ’ వంటి సామాజిక చిత్రాలు గతంలో చాలా వచ్చేవన్నారు. ఈ సినిమాలను చూసి చాలామంది తమ ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను మార్చుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అభిరుచి ఉన్న నిర్మాతలు, దర్శకులు సామాజిక చిత్రాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది బిఫ్కు తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. అవసరమనుకుంటే మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిద్ధరామయ్య తెలిపారు. ధూమ్-3 వల్లే ఆలస్యం: నరహరిరావ్ ఈ ఏడాది బిఫ్స్ను ఈనెల 19న ప్రారంభించి వారం పాటు జరపాలని నిర్ణయించినా ధూమ్-3 సినిమా వల్ల చలనచిత్రోత్సవ ప్రారంభం ఆలస్యమైందని బిఫ్స్ ఆర్టిస్టిక్ డెరైక్టర్ నరహరిరావ్ తెలిపారు. ధూమ్-3 సినిమా ఈనెల 20న విడుదలవుతున్నందువల్ల స్క్రీన్లు ఇవ్వలేమని థియేటర్ల యాజమాన్యాలు చెప్పడం వల్లే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను వాయిదా వేయాల్సి వ చ్చిందన్నారు. గోవా తదితర అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఆయా రాష్ట్రాల సొంత స్క్రీన్లు ఉంటాయన్నారు. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత ఏడాది బిఫ్ కంటే ఈసారి ప్రదర్శిస్తున్న చిత్రాల సంఖ్య తక్కువగా ఉన్నమాట వాస్తవమన్నారు. నిధుల కొరతే ఇందుకు ప్రధానకారమణమన్నారు. నాణ్యమైన చిత్రాలను ఎంపిక చేయాలనే ఉద్దేశం కూడా మరో కారణమని నరహరిరావ్ తెలిపారు. ఇవి బిఫ్ వివరాలు = 6వ బిఫ్ చలనచిత్రోత్సవాలు ఈనెల 26న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 2 వరకూ జరగనున్నాయి. = బహుభాషానటుడు కమల్‌హాసన్‌తో =పాటు దేశవిదేశాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. = ఇండియాతో పాటు 45 దేశాలకు చెందిన 152 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏడు స్క్రీన్లను ఎంపిక చేశారు. = ఏషియన్ సినిమా, ఇండియన్ సినిమా, కన్నడ సినిమా విభాగాలకు ఎంపికయిన చిత్రాల్లో ఉత్తమమైన వాటిని జ్యూరీ సభ్యులు గుర్తించి నగదు పురస్కారాన్ని అందజేస్తారు. = ఇండియాన్ సినిమా విభాగంలో తెలుగు చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. చిత్రాల వివరాలను నిర్వాహకులు త్వరలో బహిరంగపరుచనున్నారు. = 86వ అకాడమి అవార్డ్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ (ఆస్కార్) విభాగానికి ఎంట్రీ పొందిన14 చిత్రాలను ఈ చలనచిత్రోత్సావాల్లో ప్రదర్శించనున్నారు. = చిత్రాలను చూడటానికి సాధారణ ప్రజలకు రూ.500, విద్యార్థులకు, చిత్రరంగ నిర్మాణంలో ఉన్న వారికి రూ.250ల ఫీజుగా నిర్ణయించారు. ఒక్క పాసును తీసుకుని ఎన్ని సినిమాలైనా చూడవచ్చు. పాసులు దొరికే స్థలం ( నేటి నుంచి పాసులు పొందవచ్చు) 1) కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, క్రిసెంట్ రోడ్డు 2) సమాచార శాఖ, ఇన్ఫాంట్రీ రోడ్డు 3) బిఫ్స్ కార్యాలయం, బాదామి హౌస్ 4) సుచిత్రా ఫిల్మ్ సొసైటీ, బీఎస్కే 2వ స్టేజ్ 5) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం www.biffes.in చిత్రాలను ప్రదర్శించే సినిమా హాళ్ల వివరాలు 1) 3 స్క్రీన్లు, ఫన్ సినిమా-సిగ్మామాల్, కన్నింగ్‌హామ్ రోడ్డు 2) 2 స్క్రీన్లు, ఐనాక్స్-లిడోమాల్, హలసూర్ 3) 1 స్క్రీన్, సమాచారశాఖ, ఇన్ఫాంట్రీ రోడ్డు 4) 1 స్క్రీన్, ప్రియదర్శిని (బాదామిహౌస్), ఎన్.ఆర్ స్వ్కైర్ -
ఆదుకుంటాం....
= చెరకు రైతులకు అండగా ఉంటాం = కేంద్ర సాయం కోసం త్వరలో ప్రతినిధి బృందంతో ఢిల్లీకి = రైతుల కష్టాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తా = ఈ విషయంపై గతంలోనే కేంద్రానికి రెండు లేఖలు = గిట్టుబాటు ధర నిర్ణయంలో చక్కెర ఫ్యాక్టరీల లాబీకి తలొగ్గం = మండలిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కష్టాల్లో ఉన్న చెరకు రైతులను ఆదుకోవడంలో భాగంగా కేంద్ర సాయాన్ని కోరడానికి వచ్చే నెల ఆరో తేదీ తర్వాత ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెరకు మద్దతు ధరపై శాసన మండలిలో జరిగిన చర్చకు శుక్రవారం ఆయన సమాధానమిచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్లను కలుసుకుని చెరకు రైతులకు అండగా నిలవాలని కోరనున్నట్లు చెప్పారు. చక్కెర ధర పతనం కావడంతో చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు సరైన మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్టాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతామని వివరించారు. చెరకు రైతుల కడగండ్లపై ఇదివరకే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రం వద్దకు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి రెండు లేఖలను రాస్తూ చెరకు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరినట్లు చెప్పారు. చక్కెర దిగుమతి సుంకాన్ని ఐదు శాతం నుంచి 40 శాతానికి పెంచాలని, రాష్ట్రంలో నిల్వ ఉన్న 85 లక్షల టన్నుల చక్కెరకు సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. బకాయిల చెల్లింపు రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు చక్కెర కర్మాగారాలు చెరకు రైతులకు రూ.780 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండేదని, ఇప్పటి వరకు రూ.748 కోట్లను చెల్లించేశారని తెలిపారు. చక్కెర కర్మాగారాల యజమానులు మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ, చెరకు మద్దతు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. చక్కెర ఫ్యాక్టరీల లాబీకి ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. టన్ను చెరకుకు మద్దతు ధరను రూ.3 వేలుగా నిర్ణయించాలన్న బీజేపీ సభ్యుల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ‘వీరు అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్ చక్కెర ధర రూ.3,400గా ఉండేది. అప్పట్లో వారు చెరకు మద్దతు ధరను ఎందుకు పెంచలేదు’ అని నిలదీశారు. అంతకు ముందు బీజేపీ సభ్యులు మద్దతు ధరపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
రాష్ర్ట సర్కార్ గద్దె దిగాలి
= రైతు బలవన్మరణంపై ఉద్యమించిన బీజేపీ, రైతుసంఘం, హసిరుసేన = మండ్య, శివమొగ్గలో ధర్నాలు శివమొగ్గ/మండ్య, న్యూస్‌లైన్ : బెల్గాం సువర్ణవిధానసౌధ ఎదురుగా రైతు విఠల అరభావి ఆత్మహత్య చేసుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వమే కారణమని, వెంటనే సర్కార్ గద్దె దిగాలని బీజేపీ, దాని అనుబంద సంఘాలతోపాటు రైతు సంఘం, హసిరుసేన ఆందోళనకు దిగాయి. శివమొగ్గలో హసిరుసేన, రైతుసంఘం కార్యకర్తలు శివప్పనాయక సర్కిల్లో, బీజేపీ కార్యకర్తలు గోపీసర్కిల్లో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కర్ణాటక రైతుసంఘం, హసిరుసేన రాష్ట్రాధ్యక్షుడు కేటీ.గంగాద ర్ మాట్లాడుతూ.....రాష్ట్ర ప్రభుత్వం చెరకుకు మద్దతు ధర కల్పించకపోవడంతో దిక్కుతోచక రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెంటనే చెరుకుకు మద్దతు ధర కల్పించడంతోపాటు మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెరుకుకు మద్దతు ధర కోసం రైతులు బెల్గాం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి దర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి రైతులతో సమావేశమై చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. సిద్ధరామయ్య వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా మండ్యలో రైతు మోర్చ నాయకులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. అనంతరం నాల్వడి కృష్ణరాజ ఒడెయార్ సర్కిల్లో ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, చెక్కరశాఖ మంత్రి కారణమన్నారు. తక్షణమే సీఎంతోపాటు సదరు మంత్రి తమ పదవులకు రాజినామ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను హత్య చేయడానికి కూడ వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి చెరుకుకు గిట్టుబాటు ధరను కల్పించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. రైతు మోర్చ అధ్యక్షుడు రవీంద్ర, సిద్దరాజు గౌడ, సిద్దరామయ్య, జోగిగౌడ, కృష్ణెగౌడ, జవరేగౌడ పాల్గొన్నారు. -
సౌధ సాక్షిగా అన్నదాత ఆత్మహత్య
చెరకు రైతుల ఆందోళనలో అపశ్రుతి.. = గిట్టుబాటు ధర కల్పించాలని విషం తాగిన రైతు = ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి = నివాళులర్పించిన సీఎం, మంత్రులు = అసెంబ్లీలో సీఎంపై యడ్డి వాగ్దాడి = తేరుకుని ఎదురు దాడికి దిగిన సిద్ధు = పరస్పర దూషణలతో దద్దరిల్లిన అసెంబ్లీ = స్పీకర్ జోక్యం.. సభ నేటికి వాయిదా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలోని సువర్ణ సౌధలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా గిట్టు బాటు ధర కోసం సౌధ ఎదుట చెరకు రైతులు చేపట్టిన ఆందోళనలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. విఠల అరభావి (60) అనే రైతు మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. హుటాహుటిన ఇతర రైతులు ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే శాసన సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఆస్పత్రిలో విఠల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా... సభ తిరిగి సాయంత్రం పునఃప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యపై ప్రకటన చేస్తూ, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఇప్పటికే ఆయన రూ.ఐదారు లక్షల అప్పుల్లో ఉన్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. చక్కెర కర్మాగారాలు టన్ను చెరకు ధరను రూ.2,500 గా ప్రకటించగా, తమ ప్రభుత్వం మరో రూ.150 చొప్పున మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. దీని కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత రెండు రోజులుగా సభలో చెరకు రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందని, దీనిపై తాను సమాధానం ఇవ్వాల్సిన తరుణంలో ఈ ఘోరం జరిగి పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దశలో కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప లేచి నిల్చుని హరి కథలు చాలంటూ ఆగ్రహంతో పోడియం వద్దకు దూసుకు వచ్చారు. రైతులకు ఏం చేశారో చెప్పండంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. యడ్యూరప్పను ఇతర కేజేపీ, బీజేపీ సభ్యులు అనుసరించారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రిపై వాగ్దాడికి దిగారు. కాసేపు బిత్తరపోయిన ముఖ్యమంత్రి అనంతరం తేరుకుని యడ్యూరప్పపై విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ నిల్చున్నారు. మీకు సిగ్గు లేదంటే, మీకు సిగ్గు లేదంటూ ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. కేజేపీ, బీజేపీ సభ్యులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యడ్యూరప్ప వాగ్దాటిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి స్వరం పెంచి మాట్లాడారు. ‘శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీకు మానం, మర్యాద లేదు’ అంటూ తూలనాడారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రైతు మృతికి సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా రైతు ఆత్మహత్య సంఘటనకు నిరసనగా బెల్గాం జిల్లాలో పలు చోట్ల రైతులు రాస్తారోకోను నిర్వహించారు. -
లాడ్ రాజీనామా
= అక్రమ మైనింగ్ ఎఫెక్ట్.. = ప్రైవేట్ కారులో సీఎం నివాసానికి = 20 నిమిషాల పాటు చర్చలు = రాజీనామా అనివార్యతను వివరించిన సీఎం = విపక్షాలకు అవకాశం ఇవ్వరాదని ఇతర మంత్రుల ఒత్తిళ్లు = పదవిని కాపాడుకోడానికి లాడ్ తుదివరకూ యత్నం = సిద్ధు నిర్ణయమే ఫైనలని తేల్చిచెప్పిన అధిష్టానం = రాజీనామా చేయబోనని సాయంత్రం ప్రకటన = పార్టీకి ఇబ్బంది కలగరాదని రాత్రికి రాజీనామా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర సమాచార, ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలుసుకుని రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నా ఇష్ట ప్రకారమే రాజీనామా చేశాను. పార్టీకి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’ ఆని అన్నారు. కాగా అక్రమ మైనింగ్‌లో ఆయన భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రమేయం ఉందంటూ సామాజికవేత్తలు హీరేమఠ్. అబ్రహాంలు పదే పదే ఆరోపణలు చేయడమే కాకుండా పలు సాక్ష్యాధారాలను విడతల వారీగా విడుదల చేశారు. వాటినన్నిటినీ గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌కు కూడా అందజేశారు. వీటిని గవర్నర్ ముఖ్యమంత్రికి పంపించడంతో లాడ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం లాడ్ ప్రైవేట్ కారులో సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెనుక ద్వారం నుంచి వచ్చారు. 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. రాజీనామా చేయాల్సిన అనివార్యతను ముఖ్యమంత్రి ఆయనకు వివరించడంతో మానసికంగా సిద్ధమై వెనుదిరిగారు. సంతోష్ లాడ్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు అదే పనిగా ఆరోపణలు సంధిస్తుండడంతో ఆయన చేత రాజీనామా చేయంచాలని మంత్రి వర్గ సహచరులు సైతం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున, ప్రతిపక్షాల చేతికి ఆయుధం అందించరాదని కోరారు. దీంతో ఆయన గురువారం రాత్రే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని లాడ్‌కు సూచనలు పంపారు. అధిష్టానంలోని తన గాడ్ ఫాదర్ల ద్వారా పదవిని కాపాడుకోవడానికి లాడ్ తుదికంటా ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో అంతిమ అధికారం ముఖ్యమంత్రిదేనని అధిష్టానం తేల్చి చెప్పడంతో లాడ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. లాడ్ అక్రమాలకు పాల్పడ లేదంటూ ముఖ్యమంత్రి పదే పదే వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. లాడ్ రాజీనామా చేయకపోతే శీతాకాల సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని బీజేపీ హెచ్చరించింది. రాజీనామా చేసేది లేదు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజీనామా లేఖను సమర్పించడానికి కొన్ని నిమిషాల ముందు లాడ్ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను తప్పు చేయలేదని, కనుక రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ సూచించ లేదని తెలిపారు. మరో సారి ముఖ్యమంత్రిని కలుసుకుని చర్చిస్తానని ఆయన వెల్లడించారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్‌ను కలుసుకున్న అనంతరం లాడ్ ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశమైనా, లాడ్ రాజీనామా లేఖను సమర్పించడం ద్వారా డ్రామాకు తెర దించారు. -
ఆ రెండు జిల్లాలకు నీరు ఎలా అందిస్తారో చెప్పాలి
శిడ్లఘట్ట, న్యూస్‌లైన్ : కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొందని, ఈ రెండు జిల్లాల్లో నీటి కష్టాలను ఎలా పరిష్కరిస్తారో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజలకు తెలియచేయాలని కర్ణాటక రాష్ర్ట రైతు సంఘం, హసిరు సేనే రాష్ట్ర అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం శిడ్లఘట్ట పట్టణంలోని తాలూకా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ‘శాశ్వత నీరావతి పథకం’పై ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో కండువా భుజంపై వేసుకుని పలుమార్లు రైతులతో కలిసి పోరాటాలు చేశారని, నేడు కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల కరువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి న్యాయం చేస్తారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వందల చెరువులు ఉన్నా, ప్రస్తుతం నీరు లేక ఎండి పోయాయని, భూగర్భ జలాలు ప్రస్తుతం 12 వందల అడుగుల నుంచి 13 వందల అడుగులకు చేరిందని, రాబోయే రోజుల్లో ప్రజలకు నీరు దొరుకుతుందన్న నమ్మకం లేదన్నారు. ఈ ప్రాంతం ప్రజల కోసం డాక్టర్ పరమశివ య్య నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు. ఎత్తినెహోళె పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు పనులను ఇప్పించి సుమారు రూ. 8 వేల కోట్ల విలువ చేసే పైపులను తెప్పించి ప్రజల సొమ్మును వృథాగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో కర్ణాటక రాష్ర్ట రైతు సంఘం ఉపాధ్యక్షుడు జడియప్ప దేశాయి, శాశ్వత నీరావరి పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, జిల్లా పంచాయతీ సభ్యుడు నారాయణస్వామి, తాలూకా న్యాయవాదుల సంఘం సభ్యుడు పాపిరెడ్డి, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రామయ్య, రైతు మహిళ సంఘం సభ్యురాలు సులోచనమ్మ పాల్గొన్నారు.