= జిల్లాల వారీగా సమావేశాలు
= 6న రాష్ట్రానికి దిగ్విజయ్
= ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల నేతలతో సమావేశం
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర విభాగం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆది వారం జిల్లాల వారీగా వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. మొదటిరోజు ఉడిపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, మైసూరు, మం డ్య, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేలు, గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన పరాజితులు, పార్టీ జిల్లాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి జిల్లాకు అరగంట సమయం కేటాయించారు. సవ ూవేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడి అభిప్రాయాన్ని విన్నారు. తమ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడాలని ఎవరెవరు భావిస్తున్నారు, అందులో గెలుపు అవకాశాలు ఎవ రికున్నాయి అన్న విషయాలపై ఇరువురు నాయకులు కూపీ లాగారు. చర్చకు వచ్చిన ప్రతి విషయాన్ని ఇరువురు నోట్ చేసుకున్నారు. అనంతరం అన్ని జిల్లాల నాయకులను ఒకచోట చేర్చి పరమేశ్వర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సిద్ధరామయ్య , పరమేశ్వర్, మల్లికార్జున ఖర్గే గ్రూపులుగా విడిపోయారంటూ అటు సొంత పార్టీలోనూ ఇటు విపక్షాల్లోనూ విమర్శలు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఇకపై పార్టీలో గ్రూపు రాజకీయాలు జరపకూడదన్నారు. పార్టీ హైకవ ూండ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన నాయకులు సదరు నాయకుడి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సమీక్షసమావేశం సోమవారం) కూడా కొనసాగనుంది.
జనవరి 6న రాష్ట్రానికి దిగ్విజయ్....
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. ఆదేరోజున ఆయన అధ్యక్షతన పార్టీ సమన్వయ సమితి సభ జరగనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అన్వేషణ
Published Mon, Dec 30 2013 2:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement