రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్‌లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్‌లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..
అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment