arrogant behavior
-
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇదేమి రాజ్యం.. మెచ్చుతారా జనం?
ఒక్కోసారి రాజకీయ నేతలు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన చర్యలు వైరల్ అవుతుంటాయి. తమ నేత తోపు, తురుము అని అనుచరులు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు. కానీ, సామాన్య జనం మాత్రం ఇలాంటి చేష్టలను అస్సలు భరించలేరు. మరీ ముఖ్యంగా.. అధికారంలో ఉన్నవాళ్ల విషయంలో!..ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ప్రతీకార దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు అధికార పార్టీ నేతలు తమ తమ చేష్టలతో వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఓ ఎస్సైపై రుసరుసలాడారు. నిన్న ఎమ్మెల్యే కొలికపూడి.. వైఎస్సార్సీపీ నేత ఇంటిని జేసీబీతో కూల్చేసేందుకు జేసీబీతో నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ టీడీపీ అనుకూల మీడియానే ‘అత్యుత్సాహం’ పేరిట ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం. అయితే.. ఇలాంటి వ్యవహారాలతో వారికే కాదు, పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుంది. గత పాలనలో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్షాల అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అవి జనంలోకి బాగా వెళ్లాయి. వైఎస్సార్సీపీ ఓటమి కారణాల్లో అది కూడా ఉందనే చర్చా నడిచింది. కానీ, ఇప్పుడు ఏకంగా.. అధికారంలో ఉన్నవాళ్లు మాటలతో సరిపెట్టుకోవడం లేదు. ప్రతీకార చర్యలతో చేతలకు దిగుతున్నారు. మంత్రి భార్య, కొలికపూడి మాత్రమే కాదు.. జేసీ లాంటి వాళ్లు అధికారుల్ని నరికేస్తామని హెచ్చరించినా, టీడీపీ వాళ్లు వెళ్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని అధికారుల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించినా, తమకు తగ్గట్లు నడుచుకోవాల్సిందేనని మిగతా మంత్రులు హెచ్చరించినా.. ఇవన్నీ అధికారం ఇప్పటికే వాళ్లకు తలకెక్కిందనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా పంపించక మానదు. అధికారం ఉందని.. అడిగేవారు లేరని అనుకోవద్దు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి, జనాలు ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను మెచ్చరనే విషయం ఇప్పటికైనా కూటమి నేతలు గుర్తిస్తే మంచిది. ::: సోషల్ మీడియాలో ఓ సిటిజన్ -
మీకిచ్చిన సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుంది: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: పేదల సొంతింటి కల నెరవేర్చేలా అక్కచెల్లెమ్మలకు రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని అందించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. మీకిచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చడానికి సరిపోతుందంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెందుర్తిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎన్టీఆర్ జంక్షన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సెంటు భూమిలో ఇళ్లు కడతామని జగన్ చెబుతున్నారని, ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు ఇచ్చామని తెలిపారు. తాము కరెంట్ చార్జీలు పెంచలేదని, కరెంట్ కూడా ఒక్కసారి కూడా ఆపకుండా సరఫరా చేశామని అన్నారు. విశాఖలో వీధిదీపాలు వేసింది తానేనని, ఈ ప్రభుత్వానికి వాటికి రిపేర్లు కూడా చేసే స్థోమత లేదన్నారు. అమరావతిని రాజధానిగా, విశాఖపట్నం ఐటీ, ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పానని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో ఏ మూల నుంచైనా అమరావతికి వచ్చి ఇళ్లు కట్టుకోవడానికి 5 శాతం భూమి రిజర్వ్ చేశానన్నారు. ఇప్పుడా భూముల అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. అమరావతిలో తానుండే అద్దె ఇంటిని కూల్చేసేందుకు ప్రయత్నించి.. ఇప్పుడు దానిపై క్విడ్‌ప్రోకో పేరుతో కేసు పెట్టారన్నారు. చదవండి: లోకేష్‌కు నలుగురూ వేర్వేరుగా స్వాగతం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..! రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే తన ఒక్కడి బలమే సరిపోదని, అందరం కలిసి సమష్టిగా పోరాడాలని అన్నారు. ధనిక ముఖ్యమంత్రికి, నిరుపేదలకు మధ్య జరుగబోతున్న కురుక్షేత్ర పోరాటంలో అందరం కలిసి కౌరవుల్ని ఓడించాలన్నారు. ఇక జగన్ పని, వైఎస్సార్సీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా గెలవరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 కాదు.. వైఎస్సార్సీపీకి గుండుసున్నాయే మిగులుతుందన్నారు. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ధైర్యం ఉంటే.. రేపే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. తన దగ్గర డబ్బులు లేవని వాళ్లనుకుంటున్నారని, తనది ప్రజాబలం, వాళ్లది ధనబలమని అన్నారు. ఇంకా జనం రాలేదా? షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వేపగుంట జంక్షన్‌కు చేరుకొని రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 4 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. జనం లేరని తెలిసి మారియట్ హోటల్‌కు వెళ్లిపోయారు. ఈలోగా జనాల్ని నాయకులు తీసుకొచ్చి సమాచారం ఇవ్వడంతో రోడ్ షోకు వెళ్లారు. అప్పటికీ జనం లేకపోవడంతో స్థానిక నేతలపై బాబు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సభకు కూడా జనాల్ని తీసుకొచ్చారు. అది కూడా చిన్న రహదారిలో రెండువైపులా హోర్డింగ్‌లు పెట్టి.. ఇరుకు రోడ్డులోనే భారీగా జనం వచ్చినట్లు షో చేసి.. మమ అనిపించారు. -
గన్‌తో కాల్చేస్తానంటూ భక్తులను బెదిరించిన ఎస్సై
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవాన్ని దర్శించుకునేందుకు సుదూరాల నుంచి వచ్చిన భక్తులతో ఓ ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న సమాచారం అడిగిన పాపానికి భక్తులపై అంతెత్తుఎగిరిపడ్డ ఆ ఎస్సై.. సర్వీస్ రివాల్వర్ చూపించి కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జేఈవో ఆఫీసుకు ఎలా వెళ్లాలో తెలియక.. పక్కనే ఉన్న ఎస్ఐ నాగేశ్వర్ ను అడిగారు. అంతే, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భక్తులపై విరుచుకుపడ్డారు ఎస్సై నాగేశ్వర్. సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి కాల్చేస్తానని బెదిరించాడు. ఎస్సై చర్యను నిరసిస్తూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్సీ భక్తులకు సర్దిచెప్పి పంపించారు. సదరు ఎస్సై నాగేశ్వర్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్ పై తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు.