arrogance
-
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు పెట్టుకుంది. కానీ, గురి తప్పింది. అయితే ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితం వచ్చిందంటూ వ్యాఖ్యానించారాయన.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారాయన. అలాగే.. ప్రతిపక్ష ఇండియాకూటమిని కూడా ఆయన వదల్లేదు. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని కామెంట్ చేశారు.#Breaking: RSS slams Narendra Modi & the BJP for their arrogance.Taking a jibe at the Loksabha election results, RSS leader Indresh Kumar said that those who became arrogant didn’t get as much power as they were expecting, Prabhu Ram reduced their numbers.It’s open fight now! pic.twitter.com/mr7pnJtAFI— Shantanu (@shaandelhite) June 14, 2024ఇదిలా ఉంటే.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మెజారిటీ(272) కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం విఫలమైంది. కేవలం 241 సీట్లతో మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇదిలా ఉంటే.. మొన్నీమధ్యే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
Karnataka Assembly elections 2023: బీజేపీది చీకటి పాలన: సోనియా
హుబ్బళ్లి: అధికార బీజేపీని గద్దె దించకుండా దేశం అభివృద్ధి చెందదని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. బీజేపీ పాల న లూటీ, మోసం, అహంకారం, విద్వేషాల తో నిండిఉందని ఆమె తూర్పారబట్టారు. సోనియా గాంధీ శనివారం మొట్టమొదటి సారిగా కర్ణాటకలో ని హుబ్బళ్లి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. హుబ్బళ్లి సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ దోపిడీ పాలన, చీకటి పాలనకు వ్యతిరేకంగా గొంతు కలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు. బీజేపీ అణచివేతలతో ప్రజలు వణికిపోతున్నారని ఆమె అన్నారు. ‘లూటీ వ్యాపారంగా మారిం 2018లో మీ రు వారికి అధికారం ఇవ్వలేదు కానీ, వారు బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత వారి 40 శాతం కమీషన్ ప్రభుత్వం దోపిడీలో భాగంగా మారిపోయింది’అని సోనియా అన్నారు. ఇలా ఉండగా.. ‘40 శాతం కమీషన్ సర్కార్, భరించలేనంతగా పెరుగుతున్న ధరలు, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఎప్పటికీ పూర్తికాని నిర్మాణా లతో బెంగళూరులో గుంతలు..వాస్తవమైన ఈ సమస్యలపై ప్రధాని ఏమాత్రం మాట్లాడరు’అని కాంగ్రెస్ పేర్కొంది. -
గురువాణి: శ్రమకు నమస్కారం
నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం. -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్‌స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్‌స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్‌స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్‌స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్‌స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్‌స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్‌స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్‌స్టీన్‌ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్‌స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్‌స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్‌స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చీమలు కూడా తిరగబడతాయి.. తస్మాత్ జాగ్రత్త
ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు. ఉంటే ? ‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!– అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి. అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి. పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది. అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి. అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి. గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి. రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్మఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ‘నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో....’’ అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు. ‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు. మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగనా... అనుకున్నాడు. మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు. తరువాత ఏమయిందో తెలిసిందే కదా... నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది. కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి. పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నమస్కరించండి
గౌతమ బుద్ధుడు ఓరోజున బోధివృక్షానికి నమస్కరిస్తూ ఉండటం చూశాడు ఒక శిష్యుడు. అతని దృష్టిలో బుద్ధుడు భగవంతుడితో సమానం. అలాంటి బుద్ధభగవానుడు ఒక చెట్టుకు ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఉండబట్టలేక బుద్ధుణ్ణి సమీపించి, ఆయనకు నమస్కరించి, ‘‘భగవాన్, మీరే భగవత్ స్వరూపులు కదా, మీరు ఒక మామూలు చెట్టుకు ఎందుకని నమస్కరిస్తున్నారో తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు. అందుకు బుద్ధుడు చిరునవ్వుతో, ‘‘మనిషిలో అహంకారం చిగురించకుండా చేసే శక్తి ప్రకృతిలో ఉంది. అందుకే ప్రకృతిలో భాగమైన చెట్టుకు నమస్కరిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎప్పుడూ అహంకారాన్ని తెచ్చుకోవద్దు. వినయంగా, నమ్రతగా మెలగండి. అందరితోనూ ప్రేమాభిమానాలతోనూ, గౌరవంగానూ నడుచుకోండి. అప్పుడు మిమ్మల్ని అహంకారం ఆవరించదు. మిమ్మల్ని చూసి, అందరూ కూడా అదే బాటలో నడుస్తారు’’ అని బోధించాడు. బుద్ధభగవానుడి నుంచి తనకు ఎంతో విలువైన కానుకలాంటి విషయాన్ని బోధించినందుకు శిష్యుడు ఎంతగానో సంతోషించాడు. శిష్యులకు ఏమైనా మంచి విషయాలను బోధించాలనుకునేవారు ముందుగా తాము ఆచరించాలి. అప్పుడు శిష్యులు తాము కూడా అనుసరిస్తారు. -
పవిత్ర సంగమం వద్ద విషాదం
-
నా ఫ్లాపులకు నా పొగరే కారణం
ఇటీవలి కాలంలో తన సినిమాలు ఫ్లాప్ కావడానికి తన పొగరే కారణం తప్ప మరేమీ కాదని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. చాలా కాలం తర్వాత ముంబై తిరిగి వెళ్లిన ఆయనను అక్కడి మీడియా ప్రశ్నించినపుడు ఆయనీ సమాధానం చెప్పారు. తాను సినిమాలు త్వరత్వరగా తీసేసి చుట్టేయడం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారని, కానీ ఇంతకుముందు తాను తీసిన డిపార్ట్మెంట్, ఆగ్ లాంటి సినిమాలకు చాలా సమయం తీసుకున్నా.. అవి కూడా ఆడలేదని గుర్తుచేశారు. సర్కార్ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశానన్నారు. సత్యకు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువని గుర్తుచేశారు. తాను అడవిగుర్రం లాంటివాడినని, చాలా వేగంగా ఉంటానని, తన ఆటవికతను అణిచేసుకోడానికి ప్రయత్నిస్తే, తనలోని విభిన్నత కూడా అణిగిపోతుందని వర్మ అన్నారు. తాను రెండేళ్లలో ఆరు స్క్రిప్టులు పూర్తిచేశాని, దాంతోపాటు వందలాది విదేశీ సినిమాలు చూసి, పునరుత్తేజం పొందానని చెప్పారు. తన పొగరు వల్ల, అతి నమ్మకం వల్ల చేసిన తప్పులన్నీ సరిచేసుకుని.. ఇప్పుడు ముంబైకి వచ్చానని అన్నారు. ఇక తన కొత్త కార్యాలయం 'కంపెనీ' ఇప్పుడో టూరిస్టు స్పాట్‌లా మారిపోయిందని వర్మ తెలిపారు. కేవలం బాలీవుడ్ నుంచే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారని, కొంతమంది అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు కూడా వస్తున్నారని చెప్పారు. తన మీద ఉన్న పాత ముద్రను పూర్తిగా చెరిపేసుకుని కొత్తతరహాలో కనిపించాలనే ఈ ఆఫీసును కూడా అలా తయారుచేశానన్నారు.