హుబ్బళ్లి: అధికార బీజేపీని గద్దె దించకుండా దేశం అభివృద్ధి చెందదని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. బీజేపీ పాల న లూటీ, మోసం, అహంకారం, విద్వేషాల తో నిండిఉందని ఆమె తూర్పారబట్టారు. సోనియా గాంధీ శనివారం మొట్టమొదటి సారిగా కర్ణాటకలో ని హుబ్బళ్లి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. హుబ్బళ్లి సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ దోపిడీ పాలన, చీకటి పాలనకు వ్యతిరేకంగా గొంతు కలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని తెలిపారు.
బీజేపీ అణచివేతలతో ప్రజలు వణికిపోతున్నారని ఆమె అన్నారు. ‘లూటీ వ్యాపారంగా మారిం 2018లో మీ రు వారికి అధికారం ఇవ్వలేదు కానీ, వారు బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత వారి 40 శాతం కమీషన్ ప్రభుత్వం దోపిడీలో భాగంగా మారిపోయింది’అని సోనియా అన్నారు. ఇలా ఉండగా.. ‘40 శాతం కమీషన్ సర్కార్, భరించలేనంతగా పెరుగుతున్న ధరలు, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఎప్పటికీ పూర్తికాని నిర్మాణా లతో బెంగళూరులో గుంతలు..వాస్తవమైన ఈ సమస్యలపై ప్రధాని ఏమాత్రం మాట్లాడరు’అని కాంగ్రెస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment