బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్థం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కర్నాటకలో ప్రచారంలో భాగంగా హుబలి సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ కర్నాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుందని.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోమని కామెంట్స్ చేశారు. అనంతరం, సోనియా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
దీంతో, సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సోనియా గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించింది. సార్వభౌమత్వం అన్న పదాన్ని వాడడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని బీజేపీ కోరింది.
ఇదిలా ఉండగా.. సోనియా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే సీరియస్ అయ్యారు. సోనియా వ్యాఖ్యలు.. దిగ్భ్రాంతికరం, ఆమోదయోగ్యం కాదన్నారు. సోనియా గాంధీ మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు ఉల్లంఘించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియా వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
#WATCH | A BJP delegation meets Election Commission (EC) in Delhi
— ANI (@ANI) May 8, 2023
She (Sonia Gandhi) deliberately used the word sovereignty. Congress manifesto is the agenda of the 'Tukde-Tukde' gang and hence they are using such words. We hope EC will take action against this anti-national… pic.twitter.com/7S4dScJHF4
ఇది కూడా చదవండి: Karnataka Assembly Election 2023: బంగారు గని ఎవరి ఒడికి?
Comments
Please login to add a commentAdd a comment