న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది.
నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment