న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ కేసును క్రైమ్‌బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3(5) కింద రాహుల్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
తోపులాటలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే రాహుల్ గాం«దీని పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ రాస్తామని వెల్లడించారు. తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి(69), ముకేశ్ రాజ్‌పుత్(56) గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కోలుకుంటున్నారని డాక్టర్లు శుక్రవారం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment