సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి | Instruct a comprehensive investigation | Sakshi
Sakshi News home page

సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి

Published Mon, Feb 17 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Instruct a comprehensive investigation

= సీఎంకు రామదాసు లేఖ
సాక్షి, బెంగళూరు : ‘తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన  రాజకీయతకే మచ్చ తెచ్చేలా ప్రేమకుమారి అనే మహిళ నాపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి.’ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాజీ మంత్రి ఎస్‌ఎ రామదాసు లేఖ రాసారు.

ఈ నెల 14న ఆయన రాసిన లేఖ మీడియాకు ఆదివారం అందింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజకీయ కుట్రతోనే తన ప్రత్యర్థులు ఇందులో ఇరికించారని, ఆ మహిళతోపాటు కొంతమంది బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా చేయాలని లేఖలో సిద్ధరామయ్యను ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement