The woman
-
ఆడదే ఆధారం
నాటి సినిమా పురుషుడు స్త్రీకి ఈ ప్రపంచంలో ఒక చిన్న ప్రపంచం కేటాయింటాడు. దాని పేరు ఇల్లు. స్త్రీ ఇంట్లో ఉండాలి. సాటి స్త్రీని ఇంట్లో ఉంచాలి. ఇంటి రాజకీయాలలో ఒకరితో ఒకరు తలపడుతూ ఉండాలి. రెండు గదులు, ఒక హాలు, చిన్న వరండా... ఇదే సామ్రాజ్యం అనుకుంటూ దానిలో ఆధిపత్యం కోసం ఒక స్త్రీ మరో స్త్రీతో వాదనకూ యుద్ధానికీ పీడనకూ దిగాలి. చాలాసార్లు పురుషుడు ఈ యుద్ధానికి దూరంగా ఉంటాడు. ఈ పాపంతో తనకు సంబంధం లేదు అన్నట్టుంటాడు. ఎందుకంటే అతడికి బయట పెద్ద ప్రపంచం ఉంది. అందులో అతడు హాయిగా తిరుగుతుంటాడు. కాని స్త్రీ మాత్రం? ఇంట్లోనే తాను వేదన అనుభవిస్తూ ఒకరికి వేదన కలిగిస్తూ... ‘ఆడదే ఆధారం’ సినిమా పురుష ప్రపంచంలో స్త్రీల సగటు మానసిక స్థితిని చెబుతుంది. అత్తగా ఉండే స్త్రీ కోడలని వేధించాలని, కోడలుగా ఉండే స్త్రీ అత్తామామలను నిర్లక్ష్యం చేయాలని నమ్ముతూ సమాజం కల్పించిన చట్రంలో స్త్రీలు ఎంత దారుణంగా కొట్టుకుపోతున్నారో చూపుతుంది. ఇందులో ఒక కోడలు (ముచ్చెర్ల అరుణ). ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోంది కనుక ఇంట్లో దర్జాగా ఉండాలని భావిస్తుంది. అత్తమామలను పనివాళ్ల కింద జమ చేస్తుంది. భర్త ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా ఉంటాడు. వాదన చేస్తే భార్య పెద్ద గొడవకు దిగుతుందని భయం. వీళ్ల పక్క వాటాలోనే ఒక అత్తగారు (పి.ఆర్.వరలక్ష్మి) ఉంటుంది. ఈమె తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేస్తుంది. కోడలు (సీత) ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెకు సంతోషం లేదు. ఎందుకంటే కోడలు తేవాల్సిన కట్నాన్ని ఇంకా తేలేదు. బాకీ ఉంది. అందువల్ల అత్త కోడలని వేధిస్తూ ఉంటుంది. ఆమెను గర్భం దాల్చవద్దని ఆజ్ఞాపిస్తుంది. అయినప్పటికీ గర్భం వస్తే అబార్షన్ చేయించాలని చూస్తుంది. చివరకు కోడలితోనే తెగదెంపులు చేసుకునేదాకా వెళుతుంది. ఆ ఇంట్లో ఒక కోడలి వల్ల సుఖం లేదు. ఈ ఇంట్లో ఒక అత్త వల్ల సంతోషం లేదు. వీరి మనసులు, మెదడులు ఇంత ‘నేరో’గా కావడానికి కారణం ఎవరు అని మనం ఆలోచించాలి. కోడలికి అత్త శత్రువు, అత్తకు కోడలు శత్రువు అని ఎవరు నిర్థారణ చేశారు? మగవాడు కాదా? కాని అందరు మగవాళ్లు ఒకేలా ఉండరు. ఈ కథలోనే ఒక రేడియో మామ (విసు) ఉంటాడు. ఈయన రిటైరైన పెద్ద మనిషి. అయితై రిటైరైనవాడు రిటైరైనట్టు ఉండక కొడుకూ కోడలి (చంద్రమోహన్, రాజ్యలక్ష్మి)తో ఏ కాలనీకి వెళితే ఆ కాలనీలో చుట్టు పక్కల ఆడవాళ్ల కష్టాలను తీర్చే పని పెట్టుకుంటాడు. అతడి దృష్టి ఈ కాలనీకి రాగానే పొరుగన ఉన్న అత్తగారిపైన, పై పోర్షన్లో ఉన్న కోడలి మీద పడుతుంది. వారిని అతడు ఎలా సరిదిద్దాడో అనేది కథ. అయితే అత్తాకోడళ్లందరూ ఇలాగే ఉంటే ఈ సినిమాకు విలువ లేదు. ఈ సినిమాలోని రేడియో మామ కోడలు పరిణితి కలిగిన స్త్రీ. మామగారు స్త్రీల పట్ల ఆర్తి చెందితే ఆయనకు ఆమె ఆలంబనగా నిలుస్తుంది. అలాగే మరో మురికివాడలో ఇద్దరు అత్తాకోడళ్లు ఉంటారు. తండ్రీ కొడుకులు తాగి తందనాలాడుతూ ఉంటే ఈ అత్తాకోడళ్లు ఎంతో సహనంతో సంయమనంతో ఒకరికొకరు మద్దతుగా ఉంటూ కాపురాన్ని నిలబెట్టుకుంటూ వస్తారు. మగాడు నిస్సహాయంగా ఉన్నా, దాష్టికంగా ఉన్నా స్త్రీ బుద్ధి కుశలతా, ఇంగితజ్ఞానంతో ఇంటిని నిలబెట్టుకోవచ్చు అనడానికి ఈ పాత్రలు కనిపిస్తాయి. కాని చాలాసార్లు స్త్రీలు ఎంత అభద్రతతో ఉంటారంటే అత్తతోగాని, కోడలితోగాని వైరం పెట్టుకుంటే తప్ప మనుగడ లేదు అనట్టుగా ఉంటారు. ఆర్థిక కేంద్రం మగాడు తీసుకోగా నాలుగ్గోడలు ఉండే ఇంటి కేంద్రమైనా తన చేతుల్లో ఉండాలని భావించడం వల్లే ఈ అభద్రత. ఎట్టకేలకు ఈ సినిమాలో అత్త కోడలి ఔన్నత్యాన్ని గ్రహిస్తుంది. కోడలు అత్త పెద్దరికాన్ని అర్థం చేసుకుంటుంది. నలుగురూ ఆడవాళ్లే. కాని కొద్దిపాటి సామరస్యాన్ని కోల్పోయి ఇల్లు నరకం చేస్తారు. అత్త కోడలి దృష్టి నుంచి ఆలోచించినా కోడలు అత్త వైపు నుంచి ఆలోచించినా చాలా సమస్యలు రావు. ఉన్నవి తొలిగిపోతాయి. నేటికీ ఈ సూత్రం పాటించే అత్తాకోడళ్లు మాత్రం తక్కువ. అలాంటివారిని తట్టిలేపే సినిమా ‘ఆడదే ఆధారం’. తమిళంలో నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా ప్రఖ్యాతి పొందిన విసు ఈ సినిమాను మొదట తెలుగులో (1988) తీసి ఆ తర్వాత తమిళంలో చేశాడు. రెండు చోట్లా విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇరుగు పొరుగు ఎలా చస్తే మనకేంటి అనుకునే మనుషులకు బదులు... సాటి మనిషి కష్టాన్ని పట్టించుకునే రేడియో మామగా అతడు ఆకట్టుకుంటాడు. ఇందులో సీతారామశాస్త్రి రాసిన ‘మహిళలూ మహరాణులు’... ‘నేలమ్మా నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ’.. పాటలు రేడియోలో చాలాకాలం వినిపించాయి... వినిపిస్తున్నాయి. ప్రపంచం దాని చలన సూత్రాల ఆధారంగా అది కదలుతూ ఉండొచ్చు. కాని ఇంటి చలన సూత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే దాని చలన సూత్రాలు సజావుగా సాగుతాయి. ఇల్లు సజావుగా ఉండాలంటే కుటుంబం సజావుగా ఉండాలి. కుటుంబం సజావుగా ఉండాలంటే స్త్రీ తనను తాను గమనించుకుంటూ ఏమరుపాటుగా ఉండాలి. తను స్త్రీ. ఎదురుగా ఉన్నది కూడా స్త్రీయే. ఆమే అగ్ని. ఆమే జడి. ఆడదే ఆధారం. కథ ఆడనే ఆరంభం. – కె -
మహిళా సాక్షిగా!
ఆమె... పేరుకే సర్పంచ్... పెత్తనం అంతా మిస్టర్ సర్పంచ్‌దే. ఇదీ... మన దగ్గర సాగుతున్న మహిళాసాధికారత. ఇంటి పనికి జీతం ఉండదు... ఇంట్లో జీతం తెచ్చే వాడిదే పై చేయి. ఇదీ మన గృహిణికి ఉన్న ఆర్థిక సాధికారత. సమాజంలో మహిళ వెతలకు అంతే లేదు. ఆమె సమస్యలకు సమాధానం ఒక్కటే! మహిళ ఇంకా ఇంకా ఎదగడం... దేశ నిర్మాణంలో భాగం కావడం! అందమైన... ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆమె బలమైన ఇరుసు కావాలి. అప్పుడే ఆమెకు... ఆర్థిక స్వావలంబన... సామాజిక గుర్తింపు... మానసిక వికాసం!! ఆల్ ఇండియా ఉమెన్ జర్నలిస్ట్‌ల వర్క్‌షాప్... ఉద్దేశమూ అదే. స్వతంత్ర భారతంలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది!! అధికార ముద్రిక ఆమె అయితే... ఆ ముద్రను వేసే చేయి మగవాడిది కాకూడదు. అధికారం నిజంగానే మహిళకు దక్కాలి. బస్తాల కొద్దీ పిస్తాలు రికార్డుల్లో మాత్రమే కాదు... పిల్లల చేతుల్లో ఉండాలి. ఒక మాట మహిళల కోసం... మరోమాట పిల్లల కోసం... ఈ రెండు మాటలు చెప్పింది కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ. ప్రదేశం... ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లోని ఈస్ట్ హాల్. తేదీ: జూన్ 7, 2016. ఉదయం పదిగంటల సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా విలేఖరుల సమావేశంలో అన్న ఈ మాటలు దేశమంతటికీ వర్తించేవి... అన్ని రాష్ట్రాలవారూ అనుసరించాల్సినవి. పదకొండు భాషల ప్రసారమాధ్యమాల నుంచి దాదాపుగా 250 మందికి పైగా మహిళా విలేఖరులు హాజరైన సందర్భంగా వారిని ఉద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రసంగిస్తూ అన్న మాటలివి. దేశనిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలతోపాటు మరికొన్ని కొత్త ప్రతిపాదనలను మహిళా విలేఖరుల ముందుంచారు మంత్రి. అమలులో అవసరమైన మార్పులు, సూచనలను స్వాగతించారామె. ‘సమాచారమే శక్తి. ఆ శక్తితో పురోగతి సాధించవచ్చు’ అంటూ సాగిన ప్రసంగంలో, మహిళా విలేఖరులు ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’కు సోషల్ ఏజెంట్లుగా సహాయసహకారాలందించాల్సిగా ఆమె కోరారు. మహిళలు, పిల్లల హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వివరాలను నేరుగా మంత్రిత్వ శాఖ నెట్‌వర్క్‌తో పంచుకోవడం ద్వారా త్వరితగతిన ప్రక్షాళన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఆరు గంటలు సాగిన సెషన్లో, దేశం నలుమూలలా మహిళలు, పిల్లలకు ఎదురవుతున్న సమస్యలను మనేకాగాంధీ ప్రస్తావించారు. తమ సందర్శన సందర్భంగా తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలను ఉదాహరించారు. పిల్లలకు పోషకాహారాన్ని పెట్టాల్సిన అంగన్వాడీ సెంటర్లు... పిల్లలకు రుచి, నాణ్యత లేని ఆహారం పెట్టడాన్ని, ఉత్తరాఖండ్‌లో దాబా నుంచి నూనెలో వేయించిన పదార్థాలు కొని పెట్టడాన్ని నిరసించారు. కర్ణాటకలో తనకు ఎదురైన చిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘అక్కడి ఎన్జివో నిర్వహకులు పిల్లలకు పిస్తా, పండ్లు, గుడ్లు పెట్టారు ఆ రోజు. పిల్లలను పరిశీలిస్తే... రోజూ అలాంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. పోషకాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. కేవలం మంత్రి పర్యటించే రోజున మాత్రం పని చేసినట్లు కనిపించే చర్యలను తప్పుపట్టారు. తాను ప్రతిరోజూ పర్యటించి పరిశీలించడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి మహిళా విలేఖరులు వీటి మీద ఒక కన్ను వేసి ఏమైనా పొరపాట్లు దొర్లివుంటే మంత్రిత్వశాఖ వెబ్సైట్ ద్వారా తన దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యంగా పెరిగితేనే దేశం శక్తిమంతమవుతుందనీ, అందుకే ప్రసవించిన మహిళకు 26 వారాల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనే నిబంధనను గుర్తు చేశారామె. వీటన్నింటినీ సక్రమంగా అమలయ్యేలా చూసే మరో నేత్రంగా విమెన్ మీడియా పనిచేయాలని, మహిళల స్థితిగతులను మెరుగుపరచడంలో సహకరించాలని మనేకా గాంధీ కోరారు. ఇది మహిళల వికాసానికి మంత్రి హోదాలో ఓ మహిళ చేస్తున్న ప్రయత్నం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి సంక్షేమం కోసం... పథకాలు... ప్రతిపాదనలు! జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015... కౌమారదశలోని పిల్లల నేరాన్ని బాల్యచేష్టగా పరిగణించడమా, శిక్షార్హమైన నేరంగా పరిగణించడమా అనేది విచక్షణతో వ్యవహరించాలి. మిస్సింగ్, ట్రాఫికింగ్... పారిపోయిన పిల్లల కోసం ‘ఖోయా-పాయా’ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇందులో రైల్వేలతో ఒప్పందం కుదుర్చుకుని బోగీలకు వివరాల పట్టికను అతికిస్తారు. పారిపోయిన పిల్లలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడానికి ఎన్నుకునే ప్రధాన రవాణా మార్గం రైల్వేలే అయి ఉంటాయి. అందుకే ప్రతి స్టేషన్లోనూ ఇలాంటి పిల్లలను గుర్తించి ప్రభుత్వ హోమ్‌లకు సమాచారం అందించి పిల్లలను చేర్చడానికి ఒక సెల్ ఏర్పాటు. కాంప్రహెన్సివ్ అడాప్షన్ రిఫార్మ్స్... ఆర్థిక పరిపుష్టి ఉన్న దంపతులు తమ పిల్లలతోపాటు ఒక అనాథ బాలికను పెంచుకోవడాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో పాక్షిక దత్తతనూ ప్రోత్సహిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్ఆర్) ద్వారా కంపెనీలు కూడా అనాథ బాలికలను దత్తత తీసుకోవచ్చు. ప్రతి బాలికకూ ప్రభుత్వం ఒక ఐడీ నంబరు ఇస్తుంది. స్కూల్లో చేర్చడానికి, ఇతర సౌకర్యాలకు ఆ ఐడి సరిపోతుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్... అంగన్ వాడీ సెంటర్ల మౌలిక సదుపాయాల పెంపు... పిల్లలకు అందుతున్న ఆహారంలో నాణ్యత, స్వచ్ఛ్ అంగన్వాడీ అభియాన్ ద్వారా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ రెమ్యూనరేషన్ వంటివి ఈ కార్యక్రమాల కింద ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ పథకాల ప్రచారంలో పని చేయించుకోవడం ద్వారా వాళ్లు పిల్లల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని, వారికి అదనపు పనులు కేటాయించరాదనేది తప్పక పాటించాల్సిన నియమం. సాధారణంగా గ్రామానికి ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. దాని పరిధిలో చిన్న చిన్న నివాస ప్రాంతాలు దూరదూరంగా ఉంటాయి. అలాంటి చోట్ల ఆ పిల్లలందరూ ఒక సెంటర్‌కు రావడం సాధ్యం కానప్పుడు మినీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.జంక్‌ఫుడ్ గైడ్‌లైన్స్... స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ అమ్మడం మీద నిషేధం విధించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మహిళల కోసం... మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు... ప్రత్యేకమైన యాప్ ద్వారా ప్రమాదం సంభవించినప్పుడు మొబైల్ ఫోన్లోని నిర్దేశిత బటన్ నొక్కితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌తోపాటు సమీపంలో ఉన్న పది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులకు సమాచారం అందుతుంది.మహిళా-ఇ-హాట్... మహిళలు ఇంట్లోనే ఉండి తమకు చేతనైన పనులు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. ఇతర మెళకువలేమీ లేకపోయినా సరే... స్వీట్లు, మురుకుల వంటి తినుబండారాలు చేయడం మాత్రమే వచ్చిన వాళ్లు కూడా ఈ-మార్కెటింగ్ వెబ్సైట్లతో కనెక్ట్ అవుతారు. బేటీ బచావో బేటీ పడావో... ఆడబిడ్డను రక్షించాలి, చదివించాలని సమాజాన్ని చైతన్యవంతం చేసే క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బాలికలున్న అన్ని స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం దీని లక్ష్యం. వితంతువుల పునరావాసం... యూపీలోని బృందావనంలో పిల్లలు వదిలేసిన మహిళల కోసం హోమ్. ఇతర చోట్ల అలాంటి హోమ్‌ల అవసరాన్ని గుర్తించి నిర్మించాలి.ఉమెన్ హెల్ప్‌లైన్... మహిళల హక్కుల కోసం సలహాలు, సహాయం కోసం పని చేస్తుంది.హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్... పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్ 2013’ ప్రకారం... ప్రతి ఆఫీసులోనూ ఒక సెల్ ఏర్పాటయ్యే వరకు మహిళలు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలి.పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ ... చట్టాన్ని ఆశ్రయించిన మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడడం వంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలి. హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ అచీవర్స్ కాంటెస్ట్... నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ వంటి సంస్థాగతమైన అంశాలతోపాటు మాట్రిమోనియల్ వెబ్సైట్ల వాడకంలో చట్టపరమైన నిబంధనలు రూపొందాలి. ఈ వెబ్సైట్ల ద్వారా మగవాళ్లు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రశ్నలు వేయడాన్ని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు (ఒక పెళ్లి కొడుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఒక అమ్మాయితో ‘పెళ్లికి ముందు శీల పరీక్షకు సిద్ధమేనా’ అని అడిగిన సంగతి ప్రస్తావించారు మనేక). పంచాయితీరాజ్‌లో మహిళా ప్రతినిధులకు శిక్షణ... ప్రభుత్వ పథకాలు, వాటిని ఏయే కార్యాలయాల ద్వారా చేయించుకోవాలనే అంశాల్లో శిక్షణ ఇవ్వడం, ఒక యాప్ ద్వారా మహిళా ప్రతినిధులను కనెక్ట్ చేయడం, ‘సర్పంచ్పతి’ విధానానికి అడ్డుకట్ట వేయడం ద్వారా మహిళల రిజర్వేషన్‌ను పటిష్టంగా అమలు చేయడం. మహిళల పని వేళలు... రాత్రిళ్లు పని చేయాల్సిన ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక సదుపాయాల కల్పన, మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ‘లో నెక్ బ్లవుజ్, పొట్టి దుస్తులు’ అనే నేలబారు వ్యాఖ్యానాల నిరోధానికి పటిష్టమైన చట్టాల ఆవశ్యకత వంటి అనేక ప్రతిపాదనలతోపాటు నారీ శక్తి పురస్కారాన్ని ప్రస్తావించారు. ఇందులో అభ్యుదయ రీతిలో వ్యవహరించిన మహిళలకు మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. ఈ ఏడాది కూతుళ్లిద్దరినీ రైఫిల్ షూటర్లను చేసి ఒక మహిళకు పురస్కారం అందించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అర్హులైన మహిళలను గుర్తించి వారి వివరాలను మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో పోస్ట్ చేయవలసిందిగా మహిళా విలేఖరులను కోరారు మనేకా గాంధీ. ఫేస్బుక్ యూజర్సే ఈ ఎంట్రీలకు న్యాయనిర్ణేతలు. -
అబ్బాయి మారాడు
‘సమాజంలో మార్పు రావాలంటే మహిళల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే.. సింపుల్‌గా... అబ్బాయిలు మారాలి’ అని చెబుతూ ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ వలంటీర్లు దేశవ్యాప్తంగా చైతన్యం కలిగిస్తున్నారు. అబ్బాయిలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పుటలు పుటలు రాశారు. పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించారు. ఉద్యమాలు చేశారు. ఆపసోపాలు పడ్డారు. బ్యానర్లు కట్టారు. నినాదాలు చేశారు. సీన్లు రాశారు. సినిమాలు తీశారు. స్టేజీలు ఎక్కారు. మైకులు మింగారు. సభలకు వెళ్లారు. చట్టాలు తెచ్చారు. అయినా... ‘అబ్బాయి’ మారలేదు. లేదు... లేదు... మారాడు! ‘నీ పేరు?’ ‘అనికేత్’ ‘ఏం చదువుతున్నావ్? ‘ నైన్త్ క్లాస్’ ‘వీళ్లంతా ఎవరు?’ ‘మా ఫ్రెండ్స్!’ ‘ఎందుకలా ఆ ఆడపిల్లల్ని ఆట పట్టిస్తున్నారు?’ ‘ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండకుండా అట్లా సైకిళ్లేసుకొని తిరగడమేంటి?’ ‘ఏ! ఎందుకు ఆడుకోవద్దు.. వాళ్లూ మీ వయసువాళ్లేగా?’ ‘కానీ వాళ్లు ఆడపిల్లలు.. ఆడపిల్లలు రోడ్లమీదకు రావడమేంటి?’ ‘రావద్దని ఎవరు చెప్పారు?’ ‘మా అమ్మా, నాన్న. మా ఇంట్లో అయితే అంతే. అమ్మాయిలు బయటకు రారు. మగపిల్లలతో మాట్లాడరు, మాట్లాడొద్దు కూడా!’ కరాఖండిగా చెప్పాడు అనికేత్. ‘నీకు అక్క, చెల్లెళ్లు ఉన్నారా?’ ‘ఊ.. ఒక అక్క, చెల్లెలు’ ‘చదువుకుంటున్నారా?’ ‘చదువా? హె.. హె (వెటకారంగా నవ్వుతూ)’ ‘ఎందుకలా నవ్వుతున్నావ్?’ ‘మరి? మా అక్క ఇంట్లోనే ఉంటుంది.. మాకు వండిపెడుతూ. చెల్లెలు స్కూల్‌కి వెళ్తుంది. కాని పెద్దమనిషి కాగానే మాన్పించేస్తామని అమ్మ చెప్పింది’. ‘ఇంట్లో నువ్వు సాయం చేస్తావా?’ ‘నేనా? ఛీఛీ...’ ‘ఎందుకు ఛీ?’ ‘నేను అబ్బాయిని. అలాంటి పనులు చేయకూడదు. నేనే కాదు మా గల్లీలో, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, మా చుట్టాల్లో అబ్బాయిలెవరూ ఇలాంటి పనులు చేయరు.. చేయకూడదు. మేం మగవాళ్లం. బయట పనులు చేస్తాం. బోర్ కొడితే సినిమాలకెళ్తాం. ఆడుకుంటాం.. సైకిల్ రేస్ పెట్టుకుంటాం..’ అనికేత్ చెప్తుంటే.. పక్కనే ఉన్న గుంపులో ఒక అబ్బాయి ‘ఆడపిల్లల్ని చిడాయిస్తాం కూడా’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అతను ఆ మాట అనగానే గుంపు గుంపంతా హై ఫైవ్ ఇచ్చుకున్నారు అదే వెకిలి నవ్వుతో! మూడు నెలల కిందట జరిగిన సంభాషణ ఇది. పుణెలోని ఎగువ, దిగువ మధ్యతరగతి కలగలసి ఉండే ప్రాంతంలోని ఓ మార్కెట్లో! ఒక్క అనికేతే కాదు ఆ మార్కెట్లోని పద్నాలుగు, పదిహేడేళ్ల మధ్య వయసున్న అబ్బాయిలంతా వాళ్లింటి ఆడపిల్లల గురించి దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఇప్పుడు... అనికేత్ వాళ్లింట్లో... వాళ్లక్క ప్రశాంతి నీళ్ల బిందె మోస్తుంటే ఎదురెళ్లి బిందెను తన భుజం మీదకు తీసుకుంటూ కనిపించాడు అనికేత్. ఆమె చపాతి పిండి తడుపుతుంటే కూరగాయలు తరిగిపెట్టాడు. ఆశ్చర్యపోయి.. ‘అనికేత్ నువ్వేంటి? అమ్మాయిల పని చేస్తున్నావ్? నీ ప్రెస్టేజ్ ఏం కాను?’ అని అడిగితే.. ‘ప్రెస్టేజ్ గిస్టేజ్ జాన్తా నహీ మేడమ్.. లడ్కా యా లడ్కీ దోనో బరాబర్ హై.. సబ్కో సబ్ కామ్ కర్నా చాహియే’ అంటూ అక్కకు హిస్టరీ పుస్తకంలోని పాఠాన్ని వివరించసాగాడు. చపాతీలు చేస్తూనే తమ్ముడు చెప్తున్న పాఠాన్ని శ్రద్ధగా వింటోంది ప్రశాంతి. ‘ఏంటీ అక్కకు చదువు చెప్తున్నావా?’ .. ‘అవును మేడం.. ఈ యేడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది ప్రైవేట్‌గానే’- సమాధానమిచ్చాడు. చెల్లెల్నీ మంచిగా చదివించాలని, అందుకు వాళ్ల నాన్న ఒప్పుకోకుంటే తను చదివిస్తానని చెప్పాడు. అక్క, చెల్లెలు ఇంటి పనికే పరిమితం కావాలని, సల్వార్‌కమీజ్ తప్ప ఇంకెలాంటి మోడర్న్ డ్రెస్‌లు వేసుకోకూడదని, మగపిల్లల వంక కన్నెత్తి చూడకూడదనే బలమైన భావాలతో ఉన్న అనికేత్‌లో ఇంతటి మార్పేంటి? కారణం ఎవరు? ఎవరంటే.. ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ అనే స్వచ్చంద సంస్థ! దీనిని స్థాపించింది.. రుజుతా తెర్‌దేశాయి. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ‘స్కూల్, కాలేజ్, సినిమా, షాపింగ్ ఇలా ఎక్కడికి వెళ్లినా అల్లరిమూకల పిచ్చి మాటలు వింటూనే పెరిగాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. స్కూల్‌డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారు అని ఇంట్లో చెబితే ఒళ్లు కనపడని బట్టలు వేసుకో, అమ్మాయిలంతా గుంపుగా వెళ్లండి, అల్లరిమూకలున్న రూట్లో కాక వేరే రూట్లో రా, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్ అంటూ నాకే సలహాలు ఇచ్చారు తప్ప ఇబ్బంది పెడ్తున్న వాళ్లతో మీ ప్రవర్తన మార్చుకొండని అనలేదు. అవతల అబ్బాయిలు తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు నా అలవాట్లను మార్చుకోవాలి అని ఇంట్లో వాదించేదాన్ని. మా అన్నయ్యలూ నన్నే కంట్రోల్లో పెట్టాలని చూశారు. సో.. అసలు తప్పు అక్కడుందన్నమాట. అబ్బాయిలను ఒకరకంగా.. అమ్మాయిలను ఒకరకంగా పెంచడంలో! అబ్బాయిల్లో మార్పువస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీల మీద హింసా తగ్గుతుంది అనుకున్నా. అందుకే అబ్బాయిలను సెన్సిటైజ్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశా. ముందసలు ఒక సంస్థ పెట్టాలనే ఆలోచనే లేదు. నాకు టైమ్ ఉన్నప్పుడల్లా మిడిల్‌క్లాస్, లోయర్ మిడిల్‌క్లాస్, స్లమ్స్ ఏరియాల్లోకి వెళ్లి అక్కడి మగపిల్లలతో మాట్లాడేదాన్ని. మొదట్లో చాలా రఫ్‌గా, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడేవాళ్లు. ఒకానొక దశలో ఆత్మాభిమానం దెబ్బతిని నాకెందుకొచ్చిన గోల వదిలేస్తే పోలా అనీ అనుకున్నా. కానీ నా ప్రయత్నం గురించి తెలిసిన నలుగురైదుగురు ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు. తర్వాత నాతోపాటూ వాళ్లూ రావడం మొదలుపెట్టారు. అప్పుడే దీనికి సంబంధించి ఓ సంస్థను స్టార్ట్ చేస్తే పకడ్బందీగా పనిచేయొచ్చు అని ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’ను స్థాపించాం’ అని చెప్తారు రుజుతా తెర్‌దేశాయి. యునిసెఫ్ సర్వే మొన్నీమధ్యనే యునిసెఫ్ సహాయంతో ఎన్పీఆర్ అనే వెబ్‌జర్నల్ లింగ వివక్ష మీద ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలోని పదిహేను దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికీ బాల్యవివాహాలు, రుతు సమయంలో ఆడపిల్లలను ఆరుబయట ఉంచడం, పెద్దమనిషి కాగానే చదువు మాన్పించేయడం, కూతుళ్లకు తిండిపెట్టకుండా కొడుకులకు మంచి ఆహారాన్నివ్వడం, అసలు అమ్మాయిని పెంచడమంటేనే ‘పక్కింటి తోటకు నీళ్లు పట్టడం’... అన్న ముతక భావాలతో ఆడకూతురి పట్ల తీవ్ర విక్షను చూపుతున్న దేశంగా ఆ సర్వేలో తలవంచుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది, అనుసరణీయమైనది కూడా. మూడు నెలల ప్రోగ్రామ్ టీనేజ్ అబ్బాయిలకు వాళ్లుండే ప్రాంతాల్లోనే స్త్రీ, పురుష సమానత్వం మీద తరగతులు నిర్వహిస్తుంటుంది ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ సంస్థ. అమ్మాయిల పట్ల గౌరవంగా లేకపోతే సమాజంలో ఎదురయ్యే దుష్పరిణామాలను వీడియో క్లిప్పింగ్స్ద్వారా చూపిస్తుంది. నాన్న.. అమ్మను గౌరవించడం మంచి కుటుంబానికి చిహ్నం అని షార్ట్ ఫిలిమ్స్‌తో చెప్పిస్తుంది. థియరీ, ప్రాక్టికల్స్‌తో రెండంచెలుగా ఒక్కో బ్యాచ్‌కి మూడునెలల ప్రోగ్రామ్ ఉంటుంది. ‘ముందు ఎవరూ ఇష్టంగా రారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్తాం. బలవంతంగా కూర్చోబెడ్తాం. ఫస్ట్ బాలీవుడ్ సినిమాలు చూపిస్తూ.. నెమ్మదిగా వాళ్ల అటెన్షన్‌ను గైన్ చేసి తర్వాత జెండర్ ఈక్వలిటీ గురించి చెప్తాం. మారిన వాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తాం’ అని చెప్పారు రుజుత. పుణెలో కనిపిస్తున్న ఈ మార్పు, అందుతున్న ప్రోత్సాహంతో ఈ మధ్యే పశ్చిమబెంగాల్లో కూడా జెండర్ ఈక్వాలిటీ తరగతులు ప్రారంభించిందీ సంస్థ. స్థానికంగా ఉన్న ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి. ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’కు వంద బ్రాంచ్‌లను స్టార్ట్ చేసి దేశమంతటా విస్తరించాలనేదే తమ సంస్థ భవిష్యత్ లక్ష్యం అంటారు రుజుత. ఇ.సి.ఎఫ్. వ్యవస్థాపకురాలు రుజుతా తెర్‌దేశాయి -
మహిళ కంటిలో కీటకం
- శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులు - ఏడాదిగా కంటిలోనే 9 సెం.మీ. వరకు పెరిగిన వైనం సాక్షి, ముంబై: ఓ మహిళ కంటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవున్న కీటకాన్ని (వానపాము ఆకారంలో) వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. ఏడాది కాలంగా మహిళ కంటిలోనే ఉన్న కీటకం అప్పటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గర్భవతి అయిన సంబంధిత మహిళకు ఎలాంటి హాని జరగకుండా వైద్యులు చికిత్స చేశారు. దక్షిణాఫ్రికాలో అరుదుగా కనిపించే ఈ కీటకాలు మన దేశంలో ఇప్పటి వరకు మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కనిపించినట్లు సమాచారం. కాగా ఆమె పేరు, ఫొటో ప్రచురించడానికి బంధువులు నిరాకరించడంతో చికిత్స చేసిన వైద్యులు వివరాలు వెల్లడించారు. ఏడాది కిందట ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కంటి డాక్టర్‌కు చూపించగా ఏమి లేదని చెప్పాడు. అయితే అలాగే జరుగుతుండటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించారు. అయితే కంటిలో ఏదో కదులుతున్నట్లు వైద్యులు గుర్తించినప్పటికీ కచ్చితంగా అది ఏంటో నిర్ధారించలేకపోయారు. తరువాత మాటుంగా గాంధీ నర్సింగ్ హోంలోని సర్జన్ డాక్టర్ దీపక్ గాంధీని బాధితురాలు సంప్రదించింది. సోనోగ్రఫ్రీ చేయగా కుడి కంటిలో తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన కీటకం ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ చెప్పారు. కీటకాన్ని ప్రయోగశాలకు పంపామని, అక్కడి నుంచి నివేదిక వస్తే పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు. -
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
- విద్యుత్ లోటును పూడ్చగలిగాం - రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత జంగారెడ్డిగూడెం రూరల్ : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తుందని చెప్పారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో శుక్రవారం ఇంటింటా ఎల్ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దశాబ్ధ కాలంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును చూపించిందని, తమ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేసి లోటును పూడ్చగలిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 కోట్ల విలువైన 15.22 లక్షల ఎల్ఈడీ బల్బులను ప్రజలకు అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లో వినియోగదారులకు రెండు ఎల్ఈడీ బల్బులు చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో 75 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడానికి వినియోగదారుడు విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి రెండు ఎల్ఈడీ బల్బులు పొందవచ్చన్నారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడం వల్ల విద్యుత్ వినియోగం సంవత్సరానికి 55 యూనిట్లు ఆదా అవుతుందన్నారు. చింతలపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని వీటి ఏర్పాటుకు అర ఎకరం స్థలం కేటాయించాల్సి ఉందని ఇందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాల రాజు మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల ప్రతి ఇంటా విద్యుత్ పొదుపు జరుగుతుందని, దానివల్ల ఏటా వినియోగదారునకు రూ.800 ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 49 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుందని దానివల్ల 24 శాతం విద్యుత్ పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట రమణ, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ సాల్మన్ రాజు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, నాయకులు రాజాన సత్యనారాయణ (పండు), కొడవటి సత్తిరాజు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రూ. 10.40 లక్షలతో నిర్మిం చనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టూరిజం సర్క్యూట్ పర్యాటకుల సదుపాయాల సమాచార భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఈ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు. -
మంత్రాల నెపంతో మహిళపై దాడి
- పోలీసుల రాకతో దక్కిన మహిళ ప్రాణాలు - ఘటనలో 35 మంది వరకు ఉన్నట్టు అనుమానం - ఏడుగురి రిమాండ్ వర్ని : మంత్రాలు చేయడానికి వచ్చిందనే అనుమానంతో నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్ జవహర్‌నగర్ కాలనీలో ఓ అపరిచిత మహిళను కొందరు దారుణంగా చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నారుు. రుద్రూర్ గ్రామ శివారులోని బారెడు పొశమ్మ మందిరం వద్ద బుధవారం రాత్రి దాదా పు 45 ఏళ్లున్న అపరిచిత మహిళ అనుమానాస్పదంగా తిరగడాన్ని కొందరు గుర్తించారు. ఎవరని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో గాంధీచౌక్ వద్దకు తీసుకు వచ్చి చితకబాదారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న కల్లు దుకాణం వైపు పరుగెత్తింది. తన దగ్గర ఉన్న బియ్యం, ఎం డుమిర్చి, నిమ్మకాయలను అక్కడ పారవేసింది. ఇది చూసిన కాలనీవాసులు కొందరు ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదారు. కటింగ్ ప్లేయర్‌తో దంతాలను ఊడబెరికారు. విషయం తెల్సుకున్న పోలీసులు కాలనీకి వచ్చి దారుణాన్ని అపడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. మంత్రాలు చేసి తమను చంపడానికి వచ్చిందని, మీరెందుకు మధ్యలో వస్తారని పోలీసులను దగ్గరికి రానివ్వలేదు. వారు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో బోధన్ డీఎస్పీ రాంకుమార్,బో ధన్ రూరల్ సీఐ దామోదర్ రెడ్డి, బోధన్‌టౌన్ ఎస్హెచ్ఓ వెంకన్న, కోటగిరి ఎస్ఐ బషీర్ అహమ్మద్ ఏఎస్ఐలు సైదుల్లా, రజాక్ సంఘటన స్థలా నికి చేరుకుని దుం డగులను త రిమికొట్టారు. బాధిత మహిళను పోలీస్ వాహనంలో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ దాడిలో సూమారు 35 మంది వరకు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఉదయం భూమాగౌడ్, నర్సింహులు, శంకర్, శ్రీనివాస్, బాబు,లక్ష్మణ్, గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిం చామని ఇన్చార్జి ఎస్ఐ బషీర్ అహమ్మద్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. బాధిత మహిళ మూడు రోజుల క్రితం వరకు మండలంలోని అక్బ ర్‌నగర్ గ్రామంలో సంచరించినట్టు తెలుస్తోంది. పిచ్చి చేష్టలు చేయడం, రాళ్లతో కొట్టడంలాంటివి చేయడంతో గ్రామం నుంచి వెళ్లగొట్టారని సమాచారం. -
ఆకాశమే హద్దుగా.. ఆమె
ఆమె నిస్వార్థం పలువురికి బతుకు నిచ్చింది. తానొక మహిళగా.. మరికొందరి మహిళలకు చేతనైన సాయాన్ని అందించాలని తపన పడింది. ఆ తపనే... నేడు వందలాది మంది మహిళలను చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె... గంగలక్ష్మమ్మ. మహిళల ఆర్థికాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంఘ సంస్థలు పలు వేదికలపై సత్కరించాయి. - గౌరిబిదనూరు తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఇడగూరు చౌడయ్య కుమార్తె గంగలక్ష్మమ్మ. దేశ స్వాతంత్య్రం కోసం తన తండ్రి పడిన తపన ఆమెలోనూ జీర్ణించుకుపోయాయి. 1978లో కల్లూడికి చెందిన గంగప్పను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో గ్రామంలోని మహిళలు పడుతున్న కష్టాలను చూసిన ఆమె చలించిపోయారు. వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచాలని భావించారు. ఆ దిశలోనే 1988లో ఝాన్సీరాణి ఆదర్శ మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి, కుట్టు పనిపై శిక్షణ, వైర్లతో వివిధ రకాల అల్లికలు నేర్పారు. అప్పడాలు, సొండిగలు, పచ్చళ్లు, సాంబారు పొడి, చట్నీ పొడి తయారు చేసి విక్రయించడం వంటి కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించారు. మహిళల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసిన పలు రకాల వస్తువులకు బెంగళూరులోని జనతా బజారు తదితర ప్రదేశాలకు తరలించి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంలో గంగలక్ష్మమ్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం అయా కార్యక్రమాలను ఒక్కొక్కటిగా గ్రామీణ మహిళలకు అప్పగిస్తూ వారిని చిన్న పాటి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. 2009లో మహిళలే సభ్యులుగా మహిళలే ఉద్యోగులుగా ఉండేలా సమృద్ధి మహిళా సౌహార్ధ సహకార బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 567 మంది సభ్యులున్న ఈ బ్యాంక్ ఏడాదికి రూ. మూడు కోట్లకు పైగా లావాదేవీలను కొనసాగిస్తోంది. మహిళలకు రుణాలివ్వడమే కాకుండా, సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను రూపొందించారు. బ్యాంక్ లాభాలను డివిడెండ్ల రూపంలో సభ్యులందరికీ సమానంగా పంచారు. నేడు 1,300 జనాభా కలిగిన కల్లూడి గ్రామంలో ఉన్న సుమారు 610 కుటుంబాలలో 500కు పైగా కుటుంబాల వారు అప్పడాల తయారీ, వ్యాపారంలో నిమగ్న మైనారు. మహిళకు రుణాలివ్వడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువుల విక్రయాలకు బ్యాంక్ ప్రాంగణంలోనే కొద్దిపాటి స్థలాన్ని గంగలక్ష్మమ్మ కేటాయించారు. -
మన కుమార్తెలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉండాలి
అతి ప్రాచీన కాలం నుండి జీవితంలో అన్ని విషయాలలో స్త్రీ పురుషులను సమానంగా గౌరవించింది భారతీయ సంస్కృతి. భగవంతుని దివ్వరూపాన్ని అర్థనారీశ్వరరూపంలో సృజించటం ద్వారా ఈ సృష్టిని అంతటినీ రక్షించి పోషించటంలో స్త్రీ పురుషులకు గల సమాన భాగస్వామ్యాన్ని సూచించింది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీలమైన సమాజం కోసం స్త్రీలను, సమాజంలో వారి పాత్రను గౌరవించి తీరాలి. ఈనాడు ప్రపంచంలో స్త్రీశిశు మరణాలలో అత్యధిక సగటు భారతదేశంలో నమోదు అవుతోంది. బాలికల ఆరోగ్య సంరక్షణ విషయంలో శ్రద్ధవహించకపోవటమే దీనికి ప్రధాన కారణం. మగపిల్లలతో పోలిస్తే, ఆడపిల్లలు అనారోగ్యానికి గురైనపుడు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళటానికి ఆలస్యం జరుగుతోంది. పురిటి మరణాలు తప్పించుకున్నా, ఆడశిశువులకు రోగనిరోధక శక్తి, పోషణ మగశిశువులకంటే తక్కువగా ఉన్నట్లు అనేక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పసివారిని లైంగిక అకృత్యాలకు వాడుకోవటమనే అమానుషమైన విషయాన్ని మనం ఎదుర్కొనాల్సివస్తోంది. యాభై శాతానికి పైగా స్త్రీలకు విద్యాభ్యాసం లేకపోవటం మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సవాలు. ఇవన్నీ కేవలం స్త్రీ హక్కులకు సంబంధించిన విషయాలుగానే చూడరాదు. దీనిని మానవహక్కుల విషయంగా చూడాల్సి ఉంది. మనిషి మంచివాడు కావటానికి అతడి తల్లి పెంపకమే కారణమని ఒక సామెత ఉన్నది. ఆమె విలువలను పాదుకొల్పుతుంది. పునాదుల నుండి సమాజంలో పై స్థాయిల వరకూ ఉన్న మన పిల్లలలో మానవతా విలువలు, సకారాత్మక భావనలకు బీజాలు వేయటానికి ఇదే మంచి తరుణం. భానుమతీ నరసింహన్ (రచయిత అంతర్జాతీయ మహిళా సమ్మేళనానికి ఛైర్ పర్సన్‌గా , ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలకు డెరైక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. www.artofliving.org -
ఫిట్నెస్ తార!
చాలా సాదాసీదాగా కనిపించే ఈ మహిళ ఇవాళ హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్. ఆమె దగ్గర ఫిట్నెస్ శిక్షణ పొందుతున్నవారి జాబితాలో జెస్సికా అల్బా, హ్యాలే బెర్రీ, అన్నే హాత్ఎవే, జాక్ ఎఫ్రాన్, బ్రాడ్లీ కూపర్ తదితరులున్నారు. ముఖ్యంగా కాబోయే తల్లులకు ఫిట్నెస్ విషయంలో ఆమె చెబుతున్న సూచనలు ఇవాళ ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. ఇదే అంశంపై ఈమె పుస్తకం కూడా రాశారు. ‘‘అటు పాశ్చాత్య వ్యాయామ విధానాన్నీ, ఇటు ప్రాచ్య దేశాల ఆహారపుటలవాట్లనూ మేళవించుకొని ముందుకు సాగితే, ప్రసవం తరువాత కూడా అందంగా, ఆహ్లాదంగా ఉంటారు’’ అంటున్న రమోనా జీవిత పుస్తకం నుంచి కొన్ని పుటలు... బి.జీవన్ రెడ్డి ఒంటిని విల్లులా వంచి విన్యాసాలు చేసే జిమ్నాస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. తీరైన అథ్లెటిక్ శరీరాన్ని కలిగినప్పటికీ ఆ రంగంలో అంతపేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ లాస్ఏంజెలెస్ మహిళ నిరాశకరమైన పరిస్థితుల్లో కూడా ఫిట్‌నెస్‌పై ఏమాత్రం పట్టుకోల్పోలేదు. జిమ్నాస్ట్‌గా ఉన్న నేపథ్యమే ఆమెను ఫిట్నెస్ట్రైనర్గా తీర్చిదిద్దింది. అనేకమందిని తీర్చదిద్దడానికి అవకాశాన్నిచ్చింది. అమెరికాలో జరిగే క్రీడా పోటీలు, స్పోర్ట్స్ ఈవెంట్లలో చీర్‌లీడర్స్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీల ద్వారా ఈ సంస్కృతి మనకూ పరిచయం అయ్యింది. మరి చీర్లీడర్ల శరీరాకృతి, వారి ఫిట్‌నెస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. అలా ప్రేక్షకుల్లో ఉల్లాసాన్ని కలిగించే విన్యాసాలు చేయడానికి అనుగుణంగా చీర్‌లీడర్స్‌ను తీర్చిదిద్దే ఫిట్నెస్ ట్రైనర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది రమోనా. ఒక జిమ్నాస్ట్‌గా తనకు తెలిసిన ఫిట్నెస్ కిటుకులను వారికి చెబుతూ, తీర్చిదిద్దుతూ దాన్నే కెరీర్‌గా మార్చుకొంది. ఎలాంటి ఎక్సర్‌సైజ్‌తో శరీరంలో ఏయే వ్యవస్థలు ప్రభావితం అవుతాయి, ఏ మూమెంట్‌తో ఏ భాగానికి వ్యాయామం అందుతుంది అనే విషయాలను విపులంగా వివరిస్తూ తన దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చే వాళ్లను ఆకట్టుకొంటుంది రమోనా. ఈ నైపుణ్యమే ఆమెను అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, హాలీవుడ్ స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్ అయేలా చేసింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న అనేకమంది హీరోయిన్లవి రమోనా తీర్చిదిద్దిన శరీరాకృతులే. ‘‘వారిని చూసినప్పుడు ముచ్చటేస్తుంది...’’ అని హాలీవుడ్ తారలతో తన ట్రైనింగ్ అనుభవాలను వివరిస్తారు రమోనా. అమ్మే స్ఫూర్తి...‘‘నాకు స్ఫూర్తి మా అమ్మ. ఆమె కూడా ఫిట్నెస్ ట్రైనరే. ట్రైనర్‌గా నాకంటూ ప్రత్యేకత సంపాదించడానికి అమ్మ గెడైన్స్ చాలా ఉపయోగపడింది..’’ అంటారు ఈ సెలబ్రిటీ ట్రైనర్. పర్యటన పరమార్థం అదే..! ఫిట్నెస్ ట్రైనర్‌గా కొన్ని వేల మైళ్లు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో కేవలం జిమ్, కసరత్తులు మాత్రమే కాదు... ఆయా నాగరికతలను, అక్కడి ప్రజల జీవనశైలిని పరిశీలిస్తూ, వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకొంటూ వారి శరీర సమతాస్థితిని విశ్లేషించే ట్రైనర్ తనలో నిద్రలేస్తుందని చమత్కరిస్తారు. చదవమని ఒక సలహా..! శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో సలహాలను చెప్పే రమోనా.. మంచి మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని చదవడం మనసుకి స్థిమితాన్ని ఇస్తుందంటారు. మరోకోణం.. జీవితం అంటే సాహసం చేయడం కూడా అంటారు రమోనా. పర్వతారోహణ చేయటం, సహారా ఎడారిలో బైక్‌రైడింగ్ చేయడం ఈమె హాబీలట.. బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేయడం తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆకాంక్ష అని.. భారత పర్యటన ద్వారా దాన్ని నెరవేర్చుకొంటానని చెబుతారు. 3-2-1 ఫిట్నెస్ మంత్ర రమోనామొదటి పుస్తకం ‘ఫీల్ ఫిట్... లుక్ ఫెంటాస్టిక్ ఇన్ 3-2-1’ భారతీయ దేహాలను ఉద్దేశించి రాసినది. ఈ 3-2-1 శిక్షణ విధానం, పౌష్టికాహార ప్రణాళిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. ‘‘ఫిట్నెస్ కోసం మానసికంగా సిద్ధపడాలి. శారీరకంగా తయారై, మానసికంగా ముందుకు సాగాలి. నా ఫిట్నెస్ సిద్ధాంతం 3-2-1. అర్థమయ్యేలా చెప్పాలంటే - 3 విడతలుగా కార్డియో వ్యాయాయం చేయాలి. 2 విడతలుగా శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి వర్క్ అవుట్‌లోనూ 1 విడత కీలకమైన సెగ్మెంట్ ఉండాలి. పౌష్టికాహారం విషయంలో కూడా 3-2-1 ఫార్ములాను అనుసరించాలి. రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి. రోజూ కనీసం 1 లీటరు మంచినీళ్ళు తాగాలి’’ అంటున్నారు రమోనా. ఈ ట్రైనర్ పేరుతో ఉన్న వెబ్సైట్లో కూడా వర్కవుట్ల సమాచారం ఉంటుంది. RAMONA321PRO ఇది ఐస్టోర్‌లో అందుబాటులో ఉన్న రమోనా అప్లికేషన్ పేరు. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే ఫిట్నెస్ విషయంలో ఆమె సలహాలు, సూచనలు సొంతం చేసుకొన్నట్టే. అలాగే డీవీడీల రూపంలోకూడా రమోనా ఫిట్నెస్ మంత్ర అందుబాటులో ఉంది. -
మహిళపై సామూహిక అత్యాచారం
హిందూపురం : చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఓ మహిళ (56)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి వేళ వాకింగ్ చేస్తుండగా ముఖానికి గుడ్డ కట్టుకున్న ముగ్గురు యువకులు బలవంతంగా తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను 108 వాహనంలో స్థానికులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ శివనారాయణ స్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై విచారణ చేపట్టారు. -
కడుపులోని బిడ్డ.. కళ్ల ముందు!
ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా స్త్రీ అనుభవించే మాతృత్వపు మధురిమను మాటల్లో వర్ణించలేం. కడుపులో బిడ్డ కదిలినప్పుడల్లా ఆనందపడిపోతూ, ఎప్పుడెప్పుడు బుజ్జి ప్రాణాన్ని ఒళ్లో పెట్టుకొని లాలిద్దామా అంటూ తల్లి నవమాసాలూ అపురూపంగా మోస్తుంది. మరి.. కడుపులో ఉండగానే బిడ్డను కళ్లారా చూసుకునే అవకాశం వస్తే? సూపర్ కదూ! అలాగే, గుండెజబ్బుతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్కానింగ్‌లు, పరీక్షలు చేశాక ఎక్స్‌రే ఫిల్మ్‌లు పట్టుకొని చూస్తూ.. వైద్యులు అతడి గుండెకు చిల్లు పడింది చూడమంటూ అతడి గుండెను లైవ్‌లో కళ్లముందు చూపెడితే? లైవ్ హోలోగ్రామ్ (3డీ రూపాన్ని) పాయింటర్‌తో టచ్ చేస్తూ అటూ ఇటూ తిప్పిచూపిస్తూ వివరిస్తే? ఇది కూడా సూపర్ కదూ! అందుకే వీటిని నిజం చేసే టెక్నాలజీని ఇజ్రాయెల్‌కు చెందిన రియల్ వ్యూ కంపెనీతో కలసి ఫిలిప్స్ కంపెనీ ఇప్పుడు అభివృద్ధి పరుస్తోంది. ఈ టెక్నాలజీతో కడుపులోని బిడ్డను 3డీ హోలోగ్రామ్ రూపంలో కళ్లముందు కనిపించేలా చేయడమే కాదు.. ఆ బిడ్డను అటూఇటూ తిప్పుతూ అన్ని వైపులా చూపిం చొచ్చు కూడా! ఇదెలా సాధ్యమంటే.. ఫిలిప్స్ పరిశోధకులు తయారుచేసిన ఇంటర్వెన్షనల్ ఎక్స్-రే, కార్డియాక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ల ద్వారా శరీరంలోని అవయవాలను 3డీ చిత్రాలుగా మలుస్తారు. రియల్వ్యూ సిస్టమ్ ద్వారా ఆ 3డీ చిత్రాలను హోలోగ్రాఫిక్ రూపంలో లైవ్‌లో ప్రదర్శిస్తారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు సైతం అవయవాలను లైవ్‌లో నిశితంగా పరిశీలించేందుకూ దీంతో వీలుంది. -
ఓటు వేయలేదని మహిళపై సజీవదహన యత్నం
సాక్షి, ముంబై: తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఓ మహిళను సజీవదహనం చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటనలో జెలుబాయి వాబలే (65) తీవ్ర గాయాలయ్యాయి. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యేవ్లా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫుల్మాలి ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు.. నాసిక్ జిల్లా యేవ్లా తాలూకా బాభుల్‌గావ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన అశోక్ బోరనారే, పాండురంగ బోరనారే, నందకిషోర్ భూరక్ బుధవారం ఓటు వేసేందుకు బయలుదేరిన జెలూబాయి వాబలేకు మూడవ నంబర్ బటన్ (మీట) నొక్కాలని చెప్పారు. అయితే వయసు పైబడడంతో ఆమె రెండవ నంబర్ మీట నొక్కింది. ఇది తెలుసుకున్న నిందితులు ముగ్గురు గురువారం రాత్రి జెలుబాయిపై దాడిచేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటిబయటే కూర్చున్న ఆమెను చూసి చివాట్లు పెడుతూ ఇంట్లో ఉన్న కిరసనాయిల్ ఒంటిపై పోసి నిప్పంటించారు. సుమారు 60 శాతం కాలిన ఆమెను నాసిక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ముగ్గురు నిందితులపై కేసు నమోదుచేసుకుని అరెస్టు చేశారు. -
చైతన్యం ఇలా..
ఓ మహిళ చేతిలో కెమెరా ఉంటే... ఊళ్లోకి నీళ్లొస్తాయి. ఓ మహిళ రేడియో మైకు ముందు నిలబడితే... బడి మానేసిన పిల్లలు బడిబాట పడతారు. ఓ మహిళ చేతిలో కాగితం, కలం ఉంటే... నాలుగ్గోడల మధ్య నలిగే మహిళ కడగండ్లకు ఊరట కలుగుతుంది. ఇది నిజమా! అంటే... నిజంగా నిజమేనని ఆధారాలు చూపిస్తారు గుజరాత్ మహిళలు. అది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరాన ఉన్న మణిపూర్ గ్రామం. అక్కడ ‘రుడి నో రేడియో’ అనే కమ్యూనిటీ రేడియో కేంద్రం ఉంది. వర్ష, జైమిని, విద్య, జల్పలతోపాటు అనేక మంది మహిళలు అక్కడ తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వర్ష ఆ రేడియో ప్రసారాలకు వ్యాఖ్యాత. జల్ప స్థానిక జానపదాలను గానం చేసే గాయని. విద్య ఈ కార్యక్రమాలను రూపొందిస్తారు. జైమిని ఈ ప్రసారాలకు కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. వీరందరి కంటే ఎక్కువగా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న మహిళ దమయంతి. ఆమె జాతీయ మహిళా పాత్రికేయుల సదస్సును (ఎన్డబ్ల్యుఎమ్ఐ) వీడియో కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఒక జాతీయస్థాయి కార్యక్రమాన్ని సామాన్య గ్రామీణ మహిళ అధునాతనమైన కెమెరాతో సమర్థవంతంగా చిత్రీకరిస్తున్నారు. వీడియో కూర్పులో కూడా ఆమె నేర్పరి. అందరూ మహిళలే! ‘రుడి నో రేడియో’ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ అంతా మహిళలే చూసుకుంటారు. అయితే... అసలు విషయం ఇది మాత్రమే కాదు. ఈ మహిళల్లో ఎవరూ పెద్ద చదువులు చదవలేదు. ఇంటి పనులు, వ్యవసాయ పనులను యథావిధిగా కొనసాగిస్తూ, రేడియో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారెంచుకున్న మాధ్యమే ఈ కమ్యూనిటీ రేడియో, వీడియో కార్యక్రమాలు. ‘పది వాక్యాల్లో చెప్పలేని ఓ విషయాన్ని ఒక్క బొమ్మ ఇట్టే వివరిస్తుంది’- అంటున్నారు. శక్తిమంతమైన మాధ్యమం! మణిపూర్ గ్రామంతోపాటు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించింది ఈ కెమెరానే అంటారు కెమెరా ఉమన్ దమయంతి. ‘‘ ఊరి చివరన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని మోయాల్సి వచ్చేది. నీటి సౌకర్యం కల్పించమని గ్రామపెద్దను కోరాం. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో ఒక రోజు నా కెమెరాకు పని చెప్పాను. అంతే! మా గ్రామానికి కుళాయిలు వచ్చేశాయి’’ అన్నారామె నవ్వుతూ. ఇంతకీ వారు ఏం చేశారంటే... తెల్లవారు జాము నుంచి మహిళలు నీటిని మోయడాన్ని చిత్రీకరించి స్థానిక కేబుల్ ద్వారా ప్రసారం చేశారు. ఆ ప్రసారాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరడంతో సమస్య తీరింది. సంఘటితంగా పని చేస్తే... ఇలా భట్ అనే సామాజిక సంస్కర్త ‘సేవ’ అనే వేదిక ద్వారా ఇచ్చిన ఆసరాతో ఈ మహిళలు చైతన్యవంతమయ్యారు. ఆ ఆసరాతో తమ జీవితాలకు ఒక రూపు తెచ్చుకుంటున్నారు. ‘ఇలా’ సేవకు గుర్తింపు! పద్మభూషణ్ (1986), పద్మశ్రీ(1985) రైట్ టు లైవ్లీ హుడ్ అవార్డు(1984) పార్లమెంట్ సభ్యురాలు (1986 - 1989) హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్, ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ( 2001) కుటుంబం... భర్త రమేశ్‌భట్, అమ్మాయి అమిమాయి, అబ్బాయి మిహిర్. అహ్మదాబాద్‌లో నివాసం .ఆమె రాసిన పుస్తకం...‘వియ్ ఆర్ పూర్ బట్ సో మెనీ...’. ఇది సేవా సంస్థలో స్వయంసాధికారత సాధించిన మహిళల జీవితాల ఆధారంగా సాగిన కథనం. -
యాసిడ్ దాడి కేసులో... మహిళకు ఐదేళ్ల జైలు
ఖమ్మం లీగల్: యాసిడ్ దాడి కేసులో ఓ మహిళకు కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను పై కోర్టు ఖరారు చేసింది. దీనికి సంబంధించి, ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం... ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిళ్ళగూడెంలోని అపార్ట్మెంట్లో లక్ష్మీమాధురి నివసిస్తోంది. ఆమె వద్దకు బంధువైన కొదుమూరి లక్ష్మీఅనూష వచ్చింది. తాను చేసుకోవాలనుకున్న వ్యక్తికి లక్ష్మీమాధురి భార్య కాబోతోందన్న సమాచారాన్ని లక్ష్మీఅనూష తట్టుకోలేకపోయింది. ఆమె హత్యకు పథకం రూపొందించింది. 2011 జూన్ 20వ తేదీ అర్ధరాత్రి లక్ష్మీమాధురిపై ముఖంపై యాసిడ్ పోసింది. ఈ దాడిలో లక్ష్మీమాధురి తీవ్రంగా గాయపడింది. ఆమె ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు లక్ష్మీఅనూషను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అప్పటి ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు.. నిందితురాలైన లక్ష్మీఅనూషకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో నిందితురాలు అప్పీలు దాఖలు చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్.. కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరిస్తూ గురువారం తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.నాగేశ్వరరావు వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మోహన్‌రావు, హోంగార్డు యూసుఫ్ సహకరించారు. -
సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి
= సీఎంకు రామదాసు లేఖ సాక్షి, బెంగళూరు : ‘తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన రాజకీయతకే మచ్చ తెచ్చేలా ప్రేమకుమారి అనే మహిళ నాపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించండి.’ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాజీ మంత్రి ఎస్ఎ రామదాసు లేఖ రాసారు. ఈ నెల 14న ఆయన రాసిన లేఖ మీడియాకు ఆదివారం అందింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజకీయ కుట్రతోనే తన ప్రత్యర్థులు ఇందులో ఇరికించారని, ఆ మహిళతోపాటు కొంతమంది బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నేరానికి పాల్పడిన వారికి శిక్షపడేలా చేయాలని లేఖలో సిద్ధరామయ్యను ఆయన కోరారు.