- పోలీసుల రాకతో దక్కిన మహిళ ప్రాణాలు
- ఘటనలో 35 మంది వరకు ఉన్నట్టు అనుమానం
- ఏడుగురి రిమాండ్
వర్ని : మంత్రాలు చేయడానికి వచ్చిందనే అనుమానంతో నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్ జవహర్‌నగర్ కాలనీలో ఓ అపరిచిత మహిళను కొందరు దారుణంగా చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నారుు. రుద్రూర్ గ్రామ శివారులోని బారెడు పొశమ్మ మందిరం వద్ద బుధవారం రాత్రి దాదా పు 45 ఏళ్లున్న అపరిచిత మహిళ అనుమానాస్పదంగా తిరగడాన్ని కొందరు గుర్తించారు. ఎవరని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో గాంధీచౌక్ వద్దకు తీసుకు వచ్చి చితకబాదారు.
దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న కల్లు దుకాణం వైపు పరుగెత్తింది. తన దగ్గర ఉన్న బియ్యం, ఎం డుమిర్చి, నిమ్మకాయలను అక్కడ పారవేసింది. ఇది చూసిన కాలనీవాసులు కొందరు ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదారు. కటింగ్ ప్లేయర్‌తో దంతాలను ఊడబెరికారు. విషయం తెల్సుకున్న పోలీసులు కాలనీకి వచ్చి దారుణాన్ని అపడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. మంత్రాలు చేసి తమను చంపడానికి వచ్చిందని, మీరెందుకు మధ్యలో వస్తారని పోలీసులను దగ్గరికి రానివ్వలేదు.
వారు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో బోధన్ డీఎస్‌పీ రాంకుమార్,బో ధన్ రూరల్ సీఐ దామోదర్ రెడ్డి, బోధన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ వెంకన్న, కోటగిరి ఎస్‌ఐ బషీర్ అహమ్మద్ ఏఎస్‌ఐలు సైదుల్లా, రజాక్ సంఘటన స్థలా నికి చేరుకుని దుం డగులను త రిమికొట్టారు. బాధిత మహిళను పోలీస్ వాహనంలో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ దాడిలో సూమారు 35 మంది వరకు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఉదయం భూమాగౌడ్, నర్సింహులు, శంకర్, శ్రీనివాస్, బాబు,లక్ష్మణ్, గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిం చామని ఇన్‌చార్జి ఎస్‌ఐ బషీర్ అహమ్మద్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. బాధిత మహిళ మూడు రోజుల క్రితం వరకు మండలంలోని అక్బ ర్‌నగర్ గ్రామంలో సంచరించినట్టు తెలుస్తోంది. పిచ్చి చేష్టలు చేయడం, రాళ్లతో కొట్టడంలాంటివి చేయడంతో గ్రామం నుంచి వెళ్లగొట్టారని సమాచారం.
మంత్రాల నెపంతో మహిళపై దాడి
Published Fri, Apr 17 2015 2:40 AM | Last Updated on Mon, Oct 8 2018 4:31 PM
Advertisement