Varni
-
నిజామాబాద్: గర్భిణి భార్య గొంతులో యాసిడ్ పోసి చంపాడు
సాక్షి, నిజామాబాద్: తల్లిని కాబోతున్నా అనే ఆనందాన్ని లేకుండా చేసిన ఆ మృగం.. అర్ధాంగి జీవితాన్ని అర్ధాంతరంగా చిదిమేసింది. గర్భిణి అని కూడా చూడకుండా భార్య గొంతులో యాసిడ్ పోసి భర్త హత్య చేశాడు ఓ భర్త. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజిపేట్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన కళ్యాణి (24)కి రాజిపేట్‌కు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు సరైన జోడీ కాదని, రెండో పెళ్లి చేసుకుంటానని తరుణ్ భార్యను తరచూ వేధించేవాడు. వదిలించుకునే ప్రయత్నమూ చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భర్త తరుణ్, మామ పిర్య, బావ ప్రవీణ్ కలిసి కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మరణించింది. మృతురాలు కళ్యాణి 3 నెలల గర్భిణి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు తరుణ్ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, వస్తువులు ధ్వంసం చేశారు. -
సహజీవనం; కుళ్లిపోయిన మృతదేహాలు
వర్ని: అనుమానమే పెనుభూతమై, తల్లీకొడుకుల హత్యకు దారి తీసింది. చందూర్ మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన తల్లీకొడుకుల హత్యకు అనుమానమే కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను సోమవారం వెలికి తీశారు. రుద్రూర్ సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఉదయం నిందితుడిని తీసుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. నిందితుడు చూపిన ప్రాంతంలో చూడగా, మృతదేహాలు కనిపించాయి. తహసీల్దార్ వసంత సమక్షంలో మృతదేహాలను వెలికి తీసి పంచనామా చేశారు. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో బోధన్ ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. ముందుగానే ప్లాన్ వేసుకుని.. వర్ని మండలం హుమ్నాపూర్‌కు చెందిన సుజాత (34), ఆమె కొడుకు రాము(2)ను చందూర్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన రాములు హత్య చేసినట్లు బోధన్ ఏసీపీ రామరావు తెలిపారు. మృతదేహాలను వెలికితీసిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. మూడేళ్లుగా సుజాతతో రాములు సహజీవనం చేస్తున్నాడు. వీరికి కుమారుడు రాము(2) ఉన్నాడు. సుజాత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాములు.. ఇతరులతో ఎందుకు తిరుగుతున్నావని ఇటీవల బోధన్‌లో ప్రశ్నిస్తే నీకేందుకని ఆమె బదులిచ్చింది. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రాములు పగ పెంచుకొని తల్లీకొడుకును చంపాలని ప్లాన్ చేశాడు.(చదవండి: మనస్తాపంతో ఆత్మహత్య) ఈ క్రమంలో డిసెంబర్ 31న కట్టెలు తీసుకు వద్దామని సుజాతను, కొడుకును తీసుకుని అడవిలోకి వెళ్లాడు. పథకం ప్రకారం ఇద్దరిని హత్య చేసి మృతదేహాలను ఒర్రెలో పడేసి మట్టి వేసి, చెట్ల ఆకులు కప్పి వెళ్లి పోయాడు. కూతురు, మనవడి జాడ చెప్పాలని సుజాత తల్లి లస్మవ్వ రాములును అడిగినా చెప్పకపోవడంతో ఆదివారం వర్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. రాములును అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. -
వర్నిలో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి హత్యచేశారు. ఈ ఘటన వర్ని మండలంలో బుధవారం జరిగింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. -
పోలీసుల అదుపులో ప్రతిపక్ష నాయకులు
వర్ని(బాన్సువాడ) : వర్ని మండలం మోస్రా గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్ నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన మండలాల ఏర్పాటులో భాగంగా మోస్రా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంలో మంత్రి పోచారం నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉదయం మోస్రాలో భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలను రప్పించారు. ఉదయం వేళ బస్టాండ్ వద్ద, ఇళ్లలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని నిజామాబాద్ నాల్గోటౌన్‌కు తరలించారు. గ్రామంలో మంత్రి కార్యక్రమం ముగిసిన తరువాత సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఇళ్లలో ఉన్న కార్యకర్తలను కూడా బలవంతంగా పీఎస్‌కు తరలించడం అన్యాయమని, అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, యువమోర్చా నాయకుడు సందీప్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, హరినారాయణ, కె.లక్ష్మణ్, సాయిలు తదితరులు ఉన్నారు. -
సాగర్ కాలువలో ఇద్దరి గల్లంతు
వర్ని(బాన్సువాడ): ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.. చదువుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ కాలువలో సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు గల్లంతయ్యారు. వర్ని మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థులు సోహెల్ (17), ప్రభురాజ్ (17) బుధవారం చివరి పరీక్ష రాశారు. పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయిన ఆ మిత్రులు ఇద్దరు సహా ఐదుగురు స్నేహితులు గురువారం సరదాగా స్నానం చేయడానికి సత్యనారాయణ పురం సమీపంలో గల నిజాంసాగర్ కాలువలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సోహెల్, ప్రభురాజ్ కొట్టుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోటి స్నేహితులతో పాటు సమాచారమందుకున్న బంధువులు కాలువ వెంబడి సాయంత్రం వరకు గాలించారు. రబీ పంటల కోసం వారం రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు గల్లంతు కావడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
పిల్లలను దారుణంగా చంపి..
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల పాలిట తండ్రే కాలయముడు అయ్యాడు. అభంశుభం ఎరుగని చిన్నారులను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో శరణ్య (5), చరణ్ (7)లు అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత తండ్రి మైదం రాములు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య పొలం పనులకు వెళ్లిన తర్వాత భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వర్ష బీభత్సానికి పాత ఇళ్లు నేలమట్టం
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలిపోతున్నాయి. భాన్సువాడ మండల పరిధిలో వర్ష బీభత్సానికి 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వేలాది ఎకరాల్లో సోయపంట నీట మునిగింది. కోటగిరి మండలంలో 43 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్ని మండలంలో 74 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. గంధారి మండలంలోని సర్వాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాందేడ్- సంగారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సదాశివనగర్ కొత్త చెరువు పూర్తిగా నిండి అలుగుపోస్తోంది -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
వర్ని: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రోల లక్ష్మీ(17) స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వర్నిలో గంజాయి పట్టివేత
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన స్మగ్లర్లు కారును గంజాయిని వదిలి పారిపోయారు. కారులో ఉంచిన 26 సంచుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుళాయి దగ్గర గొడవ.. యువతి ఆత్మహత్య
వర్ని (నిజామాబాద్) : నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నీళ్లు ఎవరు ముందు పట్టుకోవాలన్న విషయమై గంగామణి(20) అనే యువతికి, ఇతర మహిళలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. అసభ్య పదజాలం ప్రయోగించడంతో ఆ మాటలకు మనస్తాపం చెందిన గంగామణి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా గంగామణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
నలుగురు దొంగలు అరెస్ట్
వర్ని (నిజామాబాద్) : నలుగురు దొంగల్ని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాకోరా క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా.. దొంగలు పట్టుబడ్డారని, వీరి నుంచి అర కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టుబడిన వారు ఈనెల 23న మండల కేంద్రంలో రవి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, ఎల్ఈడీ టీవీ, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. విచారణ అనంతరం బాన్సువాడలోని ఎర్రమన్నుకుచ్చ గ్రామంలో వారి నివాసాల నుంచి మూడు టీవీలు, తులం బంగారు నల్లపూసల దండ, సెల్‌ఫోన్, రెండు ల్యాప్‌టాప్‌లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలోని పలు దొంగతనాల్లో వీరి పాత్ర ఉన్నట్టు చెప్పారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నిజామాబాద్ (వర్ని) : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రా గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మోస్రా గ్రామానికి చెందిన యాలాల నర్సింహయ్య(60) సైకిల్‌పై గడ్డి తీసుకొస్తుండగా బాన్సువాడ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆనందాలకు అడ్డొస్తున్నాడని...
వర్ని: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న వాడినే హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగిత్తగుట్ట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివలాల్ (28), అతడి భార్య జ్యోతికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. జ్యోతి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్న శివలాల్ ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శివలాల్ అడ్డు తొలగించుకోవాలని జ్యోతి పథకం వేసింది. జ్యోతి సోమవారం కొడుకుని తన పుట్టింటికి పంపింది. రాత్రి మద్యం మత్తులో శివలాల్ ఇంటికి వచ్చి నిద్రిస్తుండగా, కాళ్లు చేతులు కట్టేసి అతడి గొంతు నులిమి హత్య చేసింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రాల నెపంతో మహిళపై దాడి
- పోలీసుల రాకతో దక్కిన మహిళ ప్రాణాలు - ఘటనలో 35 మంది వరకు ఉన్నట్టు అనుమానం - ఏడుగురి రిమాండ్ వర్ని : మంత్రాలు చేయడానికి వచ్చిందనే అనుమానంతో నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్ జవహర్‌నగర్ కాలనీలో ఓ అపరిచిత మహిళను కొందరు దారుణంగా చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నారుు. రుద్రూర్ గ్రామ శివారులోని బారెడు పొశమ్మ మందిరం వద్ద బుధవారం రాత్రి దాదా పు 45 ఏళ్లున్న అపరిచిత మహిళ అనుమానాస్పదంగా తిరగడాన్ని కొందరు గుర్తించారు. ఎవరని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో గాంధీచౌక్ వద్దకు తీసుకు వచ్చి చితకబాదారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న కల్లు దుకాణం వైపు పరుగెత్తింది. తన దగ్గర ఉన్న బియ్యం, ఎం డుమిర్చి, నిమ్మకాయలను అక్కడ పారవేసింది. ఇది చూసిన కాలనీవాసులు కొందరు ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదారు. కటింగ్ ప్లేయర్‌తో దంతాలను ఊడబెరికారు. విషయం తెల్సుకున్న పోలీసులు కాలనీకి వచ్చి దారుణాన్ని అపడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. మంత్రాలు చేసి తమను చంపడానికి వచ్చిందని, మీరెందుకు మధ్యలో వస్తారని పోలీసులను దగ్గరికి రానివ్వలేదు. వారు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో బోధన్ డీఎస్పీ రాంకుమార్,బో ధన్ రూరల్ సీఐ దామోదర్ రెడ్డి, బోధన్‌టౌన్ ఎస్హెచ్ఓ వెంకన్న, కోటగిరి ఎస్ఐ బషీర్ అహమ్మద్ ఏఎస్ఐలు సైదుల్లా, రజాక్ సంఘటన స్థలా నికి చేరుకుని దుం డగులను త రిమికొట్టారు. బాధిత మహిళను పోలీస్ వాహనంలో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ దాడిలో సూమారు 35 మంది వరకు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఉదయం భూమాగౌడ్, నర్సింహులు, శంకర్, శ్రీనివాస్, బాబు,లక్ష్మణ్, గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిం చామని ఇన్చార్జి ఎస్ఐ బషీర్ అహమ్మద్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. బాధిత మహిళ మూడు రోజుల క్రితం వరకు మండలంలోని అక్బ ర్‌నగర్ గ్రామంలో సంచరించినట్టు తెలుస్తోంది. పిచ్చి చేష్టలు చేయడం, రాళ్లతో కొట్టడంలాంటివి చేయడంతో గ్రామం నుంచి వెళ్లగొట్టారని సమాచారం. -
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
అనుమానమే పెనుభూతమై... వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో హతమార్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు,ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందూర్ గ్రామానికి చెందిన గుండ్ల లక్ష్మణ్ (32)కు నిజామాబాద్ మండలం సిరిపురానికి చెందిన రోజా అలియాస్ స్వప్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్ (7), అఖిల్ (5) ఉన్నారు. లక్ష్మణ్ జీవనోపాధి కోసం రెండేళ్లపాటు దుబాయ్ వెళ్లి ఏడాది క్రితం తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి లక్ష్మణ్ ఇంటికి వచ్చేసరికి భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. లక్ష్మణ్ తల్లి లింగవ్వ, కొందరు స్థానికులు వారిద్దరిని సముదాయించారు. అనంతరం, పిల్లలతో కల్సి పడుకున్న ఇద్దరు తెల్లారేసరికి విగతజీవులయ్యారు. మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు నిఖిల్ నిద్రలేచి, రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని, ఉరి వేసుకున్న తండ్రిని చూసి, పరుగెత్తుకుపోయి పక్కింట్లో ఇంట్లో ఉన్న నాన్నమ్మ లింగవ్వకు చెప్పాడు. లింగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించారు. రోజాను లక్ష్మణ్ గొడ్డలితో తలపై నరికి కిరాతకంగా హత్య చేశాడు. గతంలోనూ ఇరువురి మధ్య ఇదే విషయమై ఘర్షణలు జరగగా, కుల పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. -
వాస్తవాలు చెప్పండి..
వర్ని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న సామాజిక కుటుంబ సర్వేపై ఎలాంటి భయాందోళనలు వద్దని, ఎన్యూమరేటర్లకు వాస్తవాలు తెలియజేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ సూచించారు. గురువారం మండలంలోని అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్వేపై నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలుత స్థానికులకు సర్వేపై ఎంత వరకు అవగాహన ఉందో ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు.అంశాల వారీగా చెప్పాల్సిన వివరాలు, ఎన్యూమరేటర్లకు చూపించాల్సి న ధ్రువపత్రాల గురించి వివరించారు. వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సమాచారం తమ వద్ద ఉందని, తప్పుగా చెబితే విచారణలో వెల్లడవుతుందన్నారు. ఆధార్ కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతా నంబర్ల ద్వారా లబ్ధిదారులు నేరుగా ప్రభుత్వ సబ్సిడీని, విద్యార్థులు స్కాలర్షిప్ను పొందవచ్చని సూచిం చారు. దళారుల సమస్య ఉండదన్నారు. గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలియజేయాలన్నారు. ఇప్పటికే ఏజెన్సీలు పూర్తిజాబితాను అందచేశాయన్నారు. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్లు, రైతులు వ్యవసాయభూమి వివరాలు, ఏ సర్వే నంబరు ఎం త భూమి ఉందో పూర్తిగా చెప్పాల న్నారు. ఎన్యూమరేటర్లకు ధ్రువపత్రాలు ఇస్తే, వారు సంబంధించిన నంబర్ న మోదు చేసుకుని తిరిగి ఇచ్చేస్తారన్నారు. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌లు ఇవ్వాలనే ప్రచారం జరుగుతోందని పలువురు అ డుగగా, కలెక్టర్ పైవిధంగా చెప్పారు. 19న అందరూ ఇంట్లో ఉండాలి ఈ నెల 19న అందరు ఇంట్లో ఉండాలని, దూర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థుల గుర్తింపు పత్రాలు లేదా హాస్టల్ ఫీజు చెల్లింపు రశీదు తెచ్చుకోవాలని సూచించారు. వీ ఆర్ఏలు అందుబాటులో ఉండి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ఇళ్ల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేపై గ్రామస్తుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో గ్రామసర్పంచ్ రామాగౌడ్, ఉపసర్పంచ్ శంకర్, సింగిల్ విండో చైర్మన్ పత్తి రాము, బోధన్ ఆర్డీవో శ్యాంసుందర్ లాల్ పాల్గొన్నారు.