పోలీసుల అదుపులో ప్రతిపక్ష నాయకులు    | Opposition leaders in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ప్రతిపక్ష నాయకులు   

Published Wed, Jun 6 2018 12:15 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Opposition leaders in police custody - Sakshi

మోస్రాలో మోహరించిన పోలీసు బలగాలు  

వర్ని(బాన్సువాడ) : వర్ని మండలం మోస్రా గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన మండలాల ఏర్పాటులో భాగంగా మోస్రా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంలో మంత్రి పోచారం నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం  ఉదయం మోస్రాలో భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలను రప్పించారు. ఉదయం వేళ బస్టాండ్‌ వద్ద, ఇళ్లలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని నిజామాబాద్‌ నాల్గోటౌన్‌కు తరలించారు. 

గ్రామంలో మంత్రి కార్యక్రమం ముగిసిన తరువాత సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఇళ్లలో ఉన్న కార్యకర్తలను కూడా బలవంతంగా పీఎస్‌కు తరలించడం అన్యాయమని, అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. 

పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి, యువమోర్చా నాయకుడు సందీప్‌ రెడ్డి, సుదర్శన్‌ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, హరినారాయణ, కె.లక్ష్మణ్, సాయిలు తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement