పిల్లలను దారుణంగా చంపి..
Published Wed, Jun 28 2017 3:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల పాలిట తండ్రే కాలయముడు అయ్యాడు. అభంశుభం ఎరుగని చిన్నారులను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో శరణ్య (5), చరణ్ (7)లు అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత తండ్రి మైదం రాములు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య పొలం పనులకు వెళ్లిన తర్వాత భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement