ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Thu, Jul 21 2016 1:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
వర్ని: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రోల లక్ష్మీ(17) స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement