నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది.
వర్ని (నిజామాబాద్) : నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నీళ్లు ఎవరు ముందు పట్టుకోవాలన్న విషయమై గంగామణి(20) అనే యువతికి, ఇతర మహిళలకు మధ్య మాటల యుద్ధం జరిగింది.
అసభ్య పదజాలం ప్రయోగించడంతో ఆ మాటలకు మనస్తాపం చెందిన గంగామణి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా గంగామణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.