Water tap
-
అమ్మో, దీని తెలివి సల్లగుండ..
-
వైరల్: అమ్మో, దీని తెలివి సల్లగుండ..
కాకి మీద బోలెడు సామెతలున్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి గూటిలో కోయిల పిల్లలాగా, కాకి ముక్కుకు దొండ పండు, కాకిలా కలకాలం మన్నేకంటే హంసై ఆరు నెలలున్నా చాలు, కాకులను కొట్టి గద్దలకు వేయడం, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, కాకమ్మ కబుర్లు.. అబ్బో ఇలానే చాలానే ఉన్నాయి. అయితే ఈ వార్త చదివాక ఆ లిస్టులో కాకి తెలివితేటలు అనే సామెత కూడా చేర్చాలంటున్నారు కొందరు జనాలు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. కుండ అడుగులో ఉన్న నీళ్లను తాగేందుకు ఓ కాకి అందులో రాళ్లు వేసి నీళ్లు పైకి రాగానే ఎంచక్కా తాగేసిందనే కథ బాల్యంలో దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే కాకి మాత్రం అలా పెద్దగా కష్టపడకుండా ఈజీగా తన దాహం తీర్చుకుంది. ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చి ఓ కుళాయి మీద కూర్చున్న కాకి తన కాళ్లతో దాహార్తిని తీర్చుకుంది. కాళ్లతో బలంగా ఆ కుళాయిని తిప్పడంతో అందులో నుంచి నీళ్లు రాగా, వాటిని ఎంచక్కా తాగి దప్పిక తీర్చుకుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో ఆ కుళాయిని కట్టేసిందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. కాకి తెలివి చూసిన నెటిజన్లు 'దీని తెలివి సల్లగుండ..' అని అబ్బురపడుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం అది కుళాయి బంద్ చేయలేదంటూ కాకి మీద చిరుకోపం ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఇది ఏ‘కాకి’ కాదు! రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! -
నీళ్ల కోసం వెళ్తే చితక్కొట్టి చంపేశారు
న్యూఢిల్లీ: చిన్నచిన్న సమస్యలే కొన్నసార్లు విపరీతానికి దారి తీస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కుళాయి దగ్గర గొడవ ఓ మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నజఫ్‌ఘర్‌లోని జల విహార్ ప్రాంతానికి చెందిన జితేంద్ర నీళ్లు పట్టేందుకు కుళాయి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అమిత్ రావత్‌తోపాటు మరో వ్యక్తి జితేంద్రతో గొడవకు దిగారు. జితేంద్రపై దాడి చేస్తూ రక్తం చిందేలా చితకబాదారు. (‘బాబోయ్..నా భార్య నుంచి కాపాడండి’) ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వెంటనే కుళాయి దగ్గరకు వెళ్లి గాయాలపాలైన జితేంద్రను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు అమిత్ రావత్, అతని తల్లితో కలిసి బాధితుడి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడు. దీంతో జితేంద్ర సోదరుడు అనిల్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం తిరిగి ఆసుపత్రికి చేరుకునేసరికి జితేంద్ర ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు అమిత్ రావత్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి) -
వాటర్ ట్యాప్ తాకగానే.. 240 వోల్ట్స్ షాక్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్‌ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్‌తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్లో చోటుచేసుకుంది. డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్‌ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. 50 ఓల్ట్‌ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్‌ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు. -
రాత్రి పూట టెర్రస్‌పైకి వద్దనేలోపే..
సాక్షి, న్యూఢిల్లీ : ఇంట్లో చెడిపోయిన నీటి కుళాయిని సరిచేస్తానంటూ వచ్చి ఓ బ్యాంకు ఉద్యోగిపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది (2017) డిసెంబర్ 19న ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఓ బ్యాంకులో సీనియర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తనపై లైంగిక దాడి జరిగిన విషయం తెలియడంతో ప్రస్తుతం సహ ఉద్యోగులంతా తీవ్రంగా అవమానిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ఉద్యోగ రీత్యా ఢిల్లీకి బదిలీ అయింది. బ్యాంకు తాళాలు నిర్వహించే బాధ్యత కూడా ఆమె చేతుల్లోనే ఉంది. దీంతో బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకుంది. అది నాలుగంతస్తుల భవనం. కింద జిమ్ సెంటర్ ఉండగా మధ్యలో తాను ఉంటున్న పోర్షన్ ఉంది. ఆమెకు ఆ ఇంటి యజమాని తప్ప ఎవరూ తెలియదు. ఇంట్లో ఓ పనిమనిషిని పెట్టుకుంది. డిసెంబర్ 19న ఇంట్లో నీళ్లు రావడం లేదని పనిమనిషి చెప్పింది. దాంతో ఉద్యోగిని జిమ్ నిర్వహిస్తున్న ఇంటి యజమాని కుమారుడికి ఆ విషయం చెప్పగా అతడు సహాయం చేసేందుకు నిరాకరించాడు. ఆ సమయంలో ఆమె చెబుతున్న మాటలు ఆ జిమ్‌లోనే ఉన్న మరో వ్యక్తి విని సాయం చేస్తానంటూ ఆమెను అనుసరించాడు. అయితే ఆ సమయంలో పనిమనిషి కూడా పని ముగించుకుని వెళ్లిపోయింది. కాగా రాత్రి పూట టెర్రస్‌పైకి ఓ వ్యక్తితో కలిసి వెళ్లడం మంచిది కాదని భావించింది. అతడిని తిరిగి పంపించేలోగానే... ఆమెను నేరుగా బెడ్రూమ్లోకి నెట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
వంటింటి చిట్కాలు
► టొమాటోలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిజ్‌లో వెజిటబుల్ ట్రేలో వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కపక్కన పెట్టాలి. అది కూడా ఫొటోలో ఎడమ చేతిలో ఉన్నట్లు కాకుండా కుడి చేతిలో ఉన్న విధంగా బోర్లించినట్లు సర్దుకోవాలి. ఇదే విధంగా ఒక వరుస మీద మరో వరుస వచ్చేటట్లు పేర్చుకుంటే ఒకదాని బరువు మరొకదాని మీద పడకుండా తాజాగా ఉంటాయి. ►టొమాటో,ఉల్లిపాయ ఒలవాలంటే వాటిని మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే (వాటర్ టాప్ కింద) త్వరగా ఊడి వచ్చేస్తుంది. టొమాటోలకైతే పదిహేను సెకన్లు, ఉల్లిపాయలైతే రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ►ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్ తరిగే ముందు చాకును చన్నీటితో తడిపితే త్వరగా కట్ అవుతాయి. ►మాంసం కాని చికెన్ కాని మరీ పలుచని ముక్కలుగా కట్ చేయాలంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఒక మోస్తరుగా గట్టిపడుతుంది కాబట్టి కట్ చేయడం సులభమవుతుంది. సమయం ఆదా ఆవుతుంది. ► నిమ్మకాయ నుంచి రసం మొత్తం రావాలంటే కోసే ముందు కాయను కిచెన్ ప్లాట్‌ఫాం మీద పెట్టి అరచేత్తో రుద్దాలి. ఇలా చేస్తే కాయ మెత్తబడి పిండిన వెంటనే రసం మొత్తం వచ్చేస్తుంది. రసం తీసే టైం తగ్గుతుంది. ►వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కాలి. ► ఎక్కువ రేకలు కావల్సినప్పుడు వేడి నీటిలో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెను చన్నీటి ధార కింద రేకలకు నీటి వత్తిడి తగిలే విధంగా పెడితే పొట్టు ఊడిపోయి నీళ్ల మీదకు తేలుతుంది. ►వంటల వాసన ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే వండేటప్పుడు వంటగదిలో తడి టవల్‌ను ఆరేస్తే వాసన టవల్‌కు పట్టేసి గది ఫ్రెష్‌గా ఉంటుంది. -
అయ్యో.. పాపం!
నీటి గుంతలో పడి బాలుడి మృతి నాగర్‌కర్నూల్‌లో ఘటన నాగర్‌కర్నూల్: అప్పటివరకు ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతూ ఉన్న ఆ బాలుడిని అంతలోనే నీటి గుంత బలితీసుకుంది. గురువారం 16నెలల ఓ బాలుడు నల్లగుంతలో పడి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న నాగార్జున, భార్య ప్రియలకు ఏకైక కుమారుడు నాగనర్సింహ(16నెలలు). గురువారం సాయంత్రం తల్లి ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఆడుకుంటూ వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి ఎదురుగా ఉన్న నల్లగుంతలో పడి మృతి చెందాడు. కొద్దిసేపటికి తలి ్లగమనించినా అప్పటికే బాలుడు మృతి చెందాడు. అనుకోని సంఘటన, ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కన్నీటిని పెట్టించింది. -
కుళాయి దగ్గర గొడవ.. యువతి ఆత్మహత్య
వర్ని (నిజామాబాద్) : నీటి కుళాయి దగ్గర జరిగిన పంచాయితీతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నీళ్లు ఎవరు ముందు పట్టుకోవాలన్న విషయమై గంగామణి(20) అనే యువతికి, ఇతర మహిళలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. అసభ్య పదజాలం ప్రయోగించడంతో ఆ మాటలకు మనస్తాపం చెందిన గంగామణి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా గంగామణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
'ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా'