నల్లగుంతలో పడి మృతి చెందిన నాగనర్సింహ
-
నీటి గుంతలో పడి బాలుడి మృతి
-
నాగర్‌కర్నూల్‌లో ఘటన
నాగర్‌కర్నూల్: అప్పటివరకు ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతూ ఉన్న ఆ బాలుడిని అంతలోనే నీటి గుంత బలితీసుకుంది. గురువారం 16నెలల ఓ బాలుడు నల్లగుంతలో పడి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న నాగార్జున, భార్య ప్రియలకు ఏకైక కుమారుడు నాగనర్సింహ(16నెలలు).
గురువారం సాయంత్రం తల్లి ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఆడుకుంటూ వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి ఎదురుగా ఉన్న నల్లగుంతలో పడి మృతి చెందాడు. కొద్దిసేపటికి తలి ్లగమనించినా అప్పటికే బాలుడు మృతి చెందాడు. అనుకోని సంఘటన, ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కన్నీటిని పెట్టించింది.